news

News April 14, 2025

శుభ ముహూర్తం (14-04-2025)(సోమవారం)

image

తిథి: బహుళ పాడ్యమి ఉ.6.25 వరకు తదుపరి విదియ.. నక్షత్రం: స్వాతి రా.10.17 వరకు తదుపరి విశాఖ.. శుభసమయం: ఉ.6.34 నుంచి 7.10 వరకు తిరిగి రా.7.46 నుంచి 8.10వరకు.. రాహుకాలం: సా.7.30-9.00 వరకు.. యమగండం: ఉ.10.30-మ.12.00 దుర్ముహూర్తం: మ.12.24-1.12 వరకు, మ.2.46-3.34వరకు వర్జ్యం: తె.4.28 లగాయతు అమృత ఘడియలు: ఉ.12.31 నుంచి 2.17 వరకు

News April 14, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News April 14, 2025

TODAY HEADLINES

image

☞ AP: అనకాపల్లి జిల్లాలో అగ్నిప్రమాదం.. 8 మంది మృతి
☞ శ్రీవారికి తలనీలాలు సమర్పించిన పవన్ కళ్యాణ్ భార్య
☞ TG: పారదర్శకంగా ‘భూ భారతి’ : CM రేవంత్
☞ TG: సన్నబియ్యంలో 40 శాతం నూకలే: హరీశ్ రావు
☞ తెలుగు రాష్ట్రాల్లో వడగళ్ల వర్షం
☞ IPL: RRపై RCB, DCపై MI విజయం

News April 14, 2025

అశ్వవాహనంపై కోదండరాముడు

image

AP: కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఇవాళ రాత్రి అశ్వవాహనంపై దర్శనమిచ్చారు. అంతకుముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో అలరించారు. అశ్వవాహనంపై స్వామిని చూస్తూ భక్తులు శ్రీరామనామ స్మరణలతో పరవశించిపోయారు.

News April 14, 2025

రాజధాని కోసం మరోసారి భూ సమీకరణ?

image

AP: రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రాజధాని కోసం మరో 30 వేల ఎకరాలకు పైగా భూమిని సేకరించాలని యోచిస్తున్నట్లు సమాచారం. గతంలోనే 29 గ్రామాల్లోని 33,000 ఎకరాల భూమిని ప్రభుత్వం రైతుల నుంచి సమీకరించింది. ఇప్పుడు తూళ్లురు, అమరావతి, తాడికొండ, మంగళగిరిలో ఈ భూ సేకరణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

News April 13, 2025

బ్రదర్.. నా గురించి బాధపడొద్దు: నిధి అగర్వాల్

image

సినిమాలు చేయడంలో తనకు తొందర లేదని, మంచి సినిమాల్లో భాగమవడం కోసమే టైమ్ తీసుకుంటున్నట్లు నిధి అగర్వాల్ తెలిపారు. ‘ఇస్మార్ట్ శంకర్(2019) తర్వాత నిధి ఎన్ని సినిమాలు చేసింది? 2021లో వచ్చిన శ్రీలీల 20+ మూవీస్ చేసింది’ అని ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు ఆమె రిప్లై ఇచ్చారు. ‘2019 తర్వాత తెలుగులో హీరో మూవీ, తమిళంలో 3 సినిమాలు చేశా. తర్వాత HHVM, రాజాసాబ్ చేస్తున్నా. బ్రదర్.. నా గురించి బాధపడొద్దు’ అని సూచించారు.

News April 13, 2025

రోహిత్ పని అయిపోయినట్లేనా?

image

ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ మళ్లీ నిరాశపరిచారు. డీసీతో జరుగుతున్న మ్యాచులో 18 పరుగులే చేసి విఫలమయ్యారు. 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో టచ్‌లోకి వచ్చినట్లు కనిపించినా అనూహ్యంగా విప్రజ్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయారు. ఈ సీజన్‌లో CSKపై డకౌట్, GTపై 8, KKRపై 13, RCBపై 17, DCపై 18 పరుగులు చేశారు. కాగా గత IPL సీజన్ నుంచి హిట్‌మ్యాన్ పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడని విషయం తెలిసిందే.

News April 13, 2025

16న జపాన్ పర్యటనకు సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన ఖరారైంది. ఈ నెల 16 నుంచి 22 వరకు సీఎం నేతృత్వంలోని ప్రతినిధి బృందం జపాన్‌లో పర్యటించనుంది. టోక్యో, మౌంట్ ఫుజి, ఒసాకా, హిరోషిమాలో పర్యటించి రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామిక సాంకేతిక సహకారంపై పారిశ్రామికవేత్తలతో చర్చలు జరపనుంది.

News April 13, 2025

తిలక్ ఫిఫ్టీ.. ముంబై భారీ స్కోర్

image

ఢిల్లీతో జరుగుతున్న మ్యాచులో ముంబై భారీ స్కోర్ నమోదు చేసింది. ఓవర్లన్నీ ఆడి 205/5 పరుగులు చేసింది. హైదరాబాదీ తిలక్ వర్మ మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగారు. 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 59 పరుగులు చేశారు. రికెల్‌టన్ (41), సూర్యకుమార్ (40), నమన్ (38) రాణించారు. విప్రజ్, కుల్దీప్ చెరో రెండు వికెట్లు తీశారు. ముకేశ్ ఓ వికెట్ పడగొట్టారు. ఢిల్లీ టార్గెట్ 206 పరుగులు.

News April 13, 2025

BSPలోకి మాయావతి మేనల్లుడు రీఎంట్రీ

image

తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను తిరిగి పార్టీలోకి చేర్చుకుంటున్నట్లు BSP అధినేత్రి మాయావతి ప్రకటించారు. ఆకాశ్ తన తప్పులను బహిరంగంగా ఒప్పుకున్నందుకు మరోసారి అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. తన వారసులుగా ఎవరినీ ప్రకటించడం లేదని స్పష్టం చేశారు. ఇవాళ ఆనంద్ X వేదికగా మాయావతికి క్షమాపణలు చెప్పారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని కొన్ని రోజుల క్రితం ఆయనను మాయావతి పార్టీ నుంచి బహిష్కరించారు.