news

News March 19, 2025

హైదరాబాద్‌లో మెక్‌డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీస్‌

image

TG: మెక్‌డొనాల్డ్స్ తన గ్లోబల్ ఆఫీస్‌ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు CM రేవంత్ మెక్‌డొనాల్డ్స్ CEO క్రిస్ కెమ్‌కిన్స్కి‌తో ఒప్పందం చేసుకున్నారు. దీని ద్వారా 2,000 ఉద్యోగాల కల్పన జరగనుంది. రాష్ట్రంలో ఇప్పటికే 38 మెక్‌డొనాల్డ్స్ అవుట్‌లెట్‌‌లు ఉండగా, ఇక నుంచి ఏటా 3- 4 కొత్త అవుట్‌లెట్‌లు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర రైతులు దాని కార్యకలాపాలకు తాజా ఉత్పత్తులను సరఫరా చేయనున్నారు.

News March 19, 2025

క్రెడిట్ కార్డులను క్లోజ్ చేస్తున్నారా?

image

కొందరు ఖర్చులు పెరిగిపోతున్నాయంటూ క్రెడిట్ కార్డులను క్లోజ్ చేయాలని భావిస్తుంటారు. కానీ వాటిని తీసేస్తే క్రెడిట్ హిస్టరీ దెబ్బతింటుంది. క్రెడిట్ స్కోర్ పడిపోయే ఛాన్స్ ఉంది. ఇవి అత్యవసర పరిస్థితుల్లో బ్యాకప్‌గా ఆదుకుంటాయి. ఈ కార్డులను యాక్టివ్‌గా ఉంచుకోవడమే బెటర్. అతిగా ఖర్చు చేసేవారు మాత్రం క్లోజ్ చేసుకుంటేనే మంచిది. మీరు ఉపయోగించకపోయినా మేనేజ్‌మెంట్ ఛార్జీలు ఎక్కువైతే కార్డు తీసేయడం ఉత్తమం.

News March 19, 2025

ధాన్యాన్ని ప్రభుత్వానికే విక్రయించండి: మంత్రి నాదెండ్ల

image

AP: దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. ధాన్యాన్ని ప్రభుత్వానికి విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. అన్నదాతలకు అందుబాటులో 5 లక్షల గన్నీ సంచులున్నాయని తెలిపారు. ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్ల కోసం అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

News March 19, 2025

అనర్హుల రేషన్ కార్డులు రద్దు చేయండి: సుప్రీం

image

దేశంలోని చాలా రాష్ట్రాల్లో రేషన్ కార్డులు దుర్వినియోగం అవుతున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పేదలు అనుభవించాల్సిన ఫలాలు ధనికులు అనుభవిస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. వెంటనే అనర్హుల రేషన్ కార్డులను రద్దు చేయాలని జస్టిస్ సూర్యకాంత్, ఎన్.కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. దేశంలో దాదాపు 80 శాతం మంది నిరుపేదలు ఉన్నారని, వారందరికీ ఆహార భద్రత ఎంతో అవసరమని పేర్కొంది.

News March 19, 2025

కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే!

image

ఇవాళ జరిగిన కేంద్ర క్యాబినెట్ మీటింగ్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
✤ రూ.2 వేల కంటే తక్కువ లావాదేవీలకు (పర్సన్ టు మర్చంట్) యూపీఐ ఛార్జీలు ఉండవు
✤ అస్సాంలో రూ.10,601 కోట్లతో అమ్మోనియా, యూరియా ఫ్యాక్టరీ ఏర్పాటు
✤ మహారాష్ట్రలో రూ.4,500 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ హైవే
✤ గోకుల్ మిషన్‌కు రూ.3,400 కోట్లు.

News March 19, 2025

ఏప్రిల్ 1 నుంచి టీడీఎస్ కొత్త రూల్స్

image

ఏప్రిల్ 1 నుంచి TDS(మూలం వద్ద పన్నుకోత) కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. సీనియర్ సిటిజన్ల FD, RDపై వార్షిక ఆదాయం రూ.లక్ష వరకు ఉంటే TDS వర్తించదు. ప్రస్తుతం రూ.50వేల వరకే ఉంది. అలాగే సాధారణ ప్రజల వడ్డీ ఆదాయం రూ.50వేలు మించకుండా ఉంటే దానిపై బ్యాంకులు TDS కట్ చేయవు. బీమా ఏజెంట్లు, స్టాక్‌ బ్రోకర్లకు వార్షిక కమిషన్‌ ఆదాయం రూ.15,000 మించితే TDS వర్తించేది. ఇప్పుడు ఆ పరిమితిని రూ.20,000కు పెంచారు.

News March 19, 2025

మోహన్‌బాబుకు ‘కన్నప్ప’ టీమ్ విషెస్

image

మోహన్ బాబు బర్త్ డే సందర్భంగా ‘కన్నప్ప’ టీమ్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. ఈ చిత్రంలో మహాదేవ శాస్త్రి పాత్రలో నటిస్తున్న ఆయన ఫొటోను కుమారుడు మంచు విష్ణు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇటీవల మూవీ నుంచి విడుదలైన టీజర్‌, పాటకు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

News March 19, 2025

మరింత బాధ్యతగా పని చేసేలా జనసేన అడుగులు: పవన్

image

AP: పిఠాపురం చిత్రాడలో జనసేన 12వ ఆవిర్భావ సభ విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఆ పార్టీ అధినేత, Dy.CM పవన్ ధన్యవాదాలు తెలిపారు. ‘రానున్న రోజుల్లో ఇంకా బలమైన పార్టీగా జనసేన మారుతుంది. సామాన్యుల గొంతుకగా, రాష్ట్ర ప్రయోజనాలు, జాతీయ ఐక్యత లక్ష్యంగా మరింత బాధ్యతగా పని చేసే దిశగా అడుగులు వేయనుంది. పార్టీ బలోపేతం కోసం జనసేన శ్రేణులు ప్రజల పక్షాన నిలబడి పని చేయాలి’ అని పవన్ ట్వీట్ చేశారు.

News March 19, 2025

₹2.4-₹3 లక్షల జీతంతో ఉద్యోగాలు: సీడాప్

image

AP: జర్మనీలో నర్స్ ఉద్యోగాల కోసం అర్హులైన వారికి శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్ట్ర స్కిల్& ట్రైనింగ్ డిపార్ట్‌మెంట్, సీడాప్ ఓ ప్రకటనలో తెలిపాయి. అభ్యర్థులకు BSc, MSc నర్సింగ్ చదివి, 20-35yrs వయసు, సాధారణ ఆస్పత్రుల్లో పని అనుభవం, జర్మనీ భాష నేర్చుకునేందుకు ఆసక్తి ఉండాలి. ఈనెల 24 నుంచి VJAలోని భవానీపురం సెంటర్‌లో తరగతులు ప్రారంభం అవుతాయి. జీతం నెలకు ₹2.4-₹3L ఇస్తారు.
వివరాలకు ఫోన్: 9963074879, 9492719843

News March 19, 2025

ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ఫలితాలు విడుదల

image

TG: మహిళా, శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్-1 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు నిర్వహించిన పరీక్షల ఫలితాలను TGPSC విడుదల చేసింది. మెరిట్ జాబితాను <>https://www.tspsc.gov.in/<<>> వెబ్‌సైట్‌లో ఉంచింది. సర్టిఫికేట్ల పరిశీలనకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. 181 పోస్టులకు 16,729 మంది పరీక్ష రాసిన విషయం తెలిసిందే.