news

News March 19, 2025

ఏప్రిల్ నుంచి ఎక్స్‌ట్రా చెల్లించాల్సిందే

image

దేశంలో APR నుంచి కార్ల ధరలు పెరగనున్నాయి. ఇటీవల మారుతీ సుజుకీ 4% పెంపు ప్రకటన చేయగా నిన్న టాటా మోటార్స్ కూడా 3% వరకు పెంచుతామంది. మిగతా ఆటో బ్రాండ్స్ కూడా కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త రేట్లతో సేల్స్‌కు రెడీ అవుతున్నాయి. ఒకవేళ మీకు రాబోయే కొన్ని వారాల్లో కారు కొనే ఆలోచన ఉంటే ఈనెల 31లోపు తీసుకుంటే ఎక్స్‌ట్రా చెల్లింపు తప్పుతుంది. డెలివరీ తీసుకొనే రోజు ఉన్న ధరనే కంపెనీ పరిగణిస్తుందని మరువొద్దు.

News March 19, 2025

పోసాని బెయిల్ పిటిషన్.. 21న తీర్పు

image

AP: చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సీఐడీ నమోదు చేసిన కేసులో పోసాని కృష్ణమురళి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. న్యాయమూర్తి ఈ నెల 21కి తీర్పును వాయిదా వేశారు. ఈ కేసులో గుంటూరు జైలులో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు నాలుగు కేసుల్లో ఆయనకు బెయిల్ వచ్చింది. సీఐడీ కేసులోనూ బెయిల్ వస్తే పోసాని విడుదలయ్యే అవకాశం ఉంది.

News March 19, 2025

మమ్మల్ని కూటమి సర్కార్ అవమానిస్తోంది: బొత్స

image

AP: శాసనమండలిలో వైసీపీ సభ్యుల పట్ల కూటమి ప్రభుత్వం అవమానకరంగా వ్యవహరిస్తోందని ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. MLA, MLC క్రీడా పోటీల్లో కూడా తమపై వివక్ష చూపారని ఆయన మండిపడ్డారు. ‘నిన్న జరిగిన ఫొటో సెషన్‌లో నాకు కుర్చీ వేయలేదు. ఇతరులకు కేటాయించిన కుర్చీలో కూర్చోమన్నారు. క్రీడా పోటీల సందర్భంగా CM, స్పీకర్ ఫొటోలు మాత్రమే వేశారు. మండలి ఛైర్మన్ మోషేన్ రాజు ఫొటో వేయలేదు’ అని ఫైర్ అయ్యారు.

News March 19, 2025

టీచర్ల బదిలీల చట్టంతో చరిత్ర సృష్టించబోతున్నాం: లోకేశ్

image

AP: ఏపీ ఉపాధ్యాయ బదిలీల క్రమబద్ధీకరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ బదిలీల చట్టం ఒక చరిత్రాత్మక నిర్ణయం అన్నారు. ‘YCP ప్రభుత్వంలో అడ్డగోలుగా బదిలీలు జరిగాయి. అందరితో చర్చించాకే టీచర్ల బదిలీల చట్టం తీసుకొచ్చాం. పారదర్శకంగా ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా ఉంటుంది. టీచర్ల బదిలీల చట్టం ద్వారా మా ప్రభుత్వం చరిత్ర సృష్టించబోతోంది’ అని లోకేశ్ అన్నారు.

News March 19, 2025

బడ్జెట్‌లో పేజీలే పెరిగాయి.. సంక్షేమం కాదు: హరీశ్ రావు

image

TG: మహిళలను ప్రభుత్వం మోసం చేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ‘బడ్జెట్‌లో అబద్ధాలు, అతిశయోక్తులే ఉన్నాయి. మహిళలకు రూ.5లక్షలు మాత్రమే వడ్డీలేని రుణం ఇస్తున్నారు. బడ్జెట్‌లో మాత్రం రూ.లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు ఇస్తున్నామన్నారు. బడ్జెట్ పేజీలు పెరిగాయి తప్ప పేదలకు సంక్షేమం పెరగలేదు. మహిళలకు రూ.2,500 హామీ ఊసే లేదు. కానీ అందాల పోటీలకు రూ.250 కోట్లు బడ్జెట్‌లో పెట్టారు’ అని విమర్శించారు.

News March 19, 2025

IPL: కోహ్లీ బ్యాటింగ్.. సహచరుడు అంపైరింగ్

image

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చిన్ననాటి సహచరుడు తన్మయ్ శ్రీవాస్తవ IPLలో అంపైరింగ్ చేయనున్నారు. వీరిద్దరూ కలిసి 2008 అండర్-19 వరల్డ్ కప్‌లో ఆడారు. ఆ టోర్నీ ఫైనల్లో శ్రీవాస్తవ (46) టాప్ స్కోరర్. ఆయన IPL (PBKS తరఫున) కూడా ఆడారు. శ్రీవాస్తవ క్రికెట్‌కు రిటైర్మెంట్ పలికి అంపైరింగ్ చేస్తున్నా కోహ్లీ ఇంకా క్రికెటర్‌గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం కోహ్లీ కెరీర్ పీక్స్‌లో ఉన్న విషయం తెలిసిందే.

News March 19, 2025

ఇండియాలో 6 అడుగుల ఎత్తున్న వారు ఎందరంటే?

image

‘ఆరడుగుల అందగాడు’ అని చెప్తూ ఎత్తును ఎందుకు కన్సిడర్ చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే మన దేశంలో 6 ఫీట్ కటౌట్ కలిగిన వ్యక్తులు చాలా తక్కువ. ఇండియాలో 1శాతం మంది మాత్రమే 6 లేదా అంతకంటే ఎక్కువ ఎత్తును కలిగి ఉన్నారు. భారతీయ మగవారి సగటు ఎత్తు 5.5 అడుగులు (164.94 సెం.మీ) కాగా ఆడవారి సగటు ఎత్తు 5 అడుగులు. అలాగే USAలో 14.5% మంది పురుషులు ఆరు అడుగుల కంటే ఎత్తు ఉన్నారు. మీ హైట్ ఎంత? COMMENT

News March 19, 2025

దేశంలోనే అత్యంత ధనిక MLA ఇతనే

image

దేశంలోని 4,092 MLAల ఆస్తులపై ఏడీఆర్ ఓ నివేదిక విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం ముంబైలోని ఘాట్కోపర్ ఈస్ట్ శాసనసభ్యుడు పరాగ్ షా(BJP) దేశంలోనే ధనిక ఎమ్మెల్యేగా నిలిచారు. రూ.3,400 కోట్లతో అగ్రస్థానంలో ఉన్నారు. రూ.1,413 కోట్లతో కర్ణాటక Dy.CM DK శివకుమార్(INC) రెండో స్థానంలో నిలిచారు. రూ.1,700తో దేశంలోనే అత్యంత పేద ఎమ్మెల్యేగా పశ్చిమ బెంగాల్‌లోని ఇండస్ శాసనసభ్యుడు నిర్మల్ కుమార్ ధారా(BJP) నిలిచారు.

News March 19, 2025

ఈ నెల 25, 26 తేదీల్లో కలెక్టర్ల సదస్సు

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 25, 26 తేదీల్లో సచివాలయంలో కలెక్టర్ల సదస్సు జరగనుంది. గతంలో తీసుకున్న నిర్ణయాల అమలు తీరు, పీ4 విధానంపై చర్చించనున్నారు. వాట్సాప్ గవర్నెన్స్, అర్హులకు పథకాల అందజేత, ఇతర అంశాలపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.

News March 19, 2025

ఎంతిస్తారో కూడా నాకు చెప్పలేదు: శశాంక్ సింగ్

image

రిటెన్షన్‌లో తనకు ఎంత ఇస్తారో కూడా తెలియకుండానే సంతకం చేశానని PBKS ప్లేయర్ శశాంక్ సింగ్ తెలిపారు. తాను వేలంలో లేకపోవడంతో ప్రశాంతంగా ఉన్నానని చెప్పారు. ‘గతంలో చాలాసార్లు నన్ను వేలంలో తిరస్కరించారు. తీసుకున్నా అవకాశాలు వచ్చేవి కావు. గత సీజన్‌లో మెరుగైన ప్రదర్శన చేయడంతో రిటైన్ చేసుకున్నారు. రిటైన్ సమయంలో నాకు ఎంత ఇచ్చేది వారు చెప్పలేదు. నేనూ బేరమాడలేదు. ఫామ్‌పై సంతకం చేశా అంతే’ అని చెప్పుకొచ్చారు.