India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

డెలివరీ తర్వాత తెలుపు/పసుపు/గోధుమ రంగులో తల్లి పాలు ఉంటాయి. కొన్ని నెలల తర్వాత కొందరికి ఇవి పింక్‌గా మారుతాయి. పాలల్లో రక్తం కలవడం లేదా కొన్ని మెడిసిన్ల ప్రభావం లేదా ఇన్ఫెక్షన్లు ఉన్నా ఇలా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. కొన్నిసార్లు ఈ పింక్ మిల్క్‌తో తీవ్ర ముప్పు పొంచి ఉంటుంది. కాబట్టి మీరు ఇలా పింక్ రంగు బ్రెస్ట్ మిల్క్ గమనిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మేలు.
Share It

AP: అనకాపల్లి(D)లో జరిగిన ట్రాన్స్‌జెండర్ హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను CM చంద్రబాబు ఆదేశించారు. త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలన్నారు. బయ్యవరం కల్వర్టు వద్ద దుప్పటిలో చుట్టిన మృతదేహం కనిపించగా, పోలీసులు విచారణ చేపట్టారు. దీపు అనే ట్రాన్స్‌జెండర్‌ను చంపి శరీరాన్ని ముక్కలు చేసినట్లు గుర్తించి, నిందితులను అరెస్ట్ చేశారు. దీపు కొంతకాలంగా ఓ వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు సమాచారం.

* విద్యుత్ రంగం-రూ.21,221 కోట్లు
* పురపాలక రంగం- రూ.17,677 కోట్లు
* వైద్య రంగం-రూ.12,393 కోట్లు
* హోంశాఖ-రూ.10,188 కోట్లు
* రహదారులు, భవనాల శాఖ-రూ.5,907 కోట్లు
* అటవీ, పర్యావరణం-రూ.1,023 కోట్లు
* క్రీడలు- రూ.465 కోట్లు
* దేవాదాయ శాఖ- రూ.190 కోట్లు

* పశుసంవర్ధకం: రూ.1,674 కోట్లు
* పౌరసరఫరాల శాఖ: రూ.5,734 కోట్లు
* కార్మిక శాఖ-రూ.900 కోట్లు
* మహిళా శిశు సంక్షేమ శాఖ-రూ.2,862 కోట్లు
* బీసీ సంక్షేమ శాఖ-రూ.11,405 కోట్లు
* మైనార్టీ సంక్షేమ శాఖ-రూ.3,591 కోట్లు
* పరిశ్రమలు-రూ.3,527 కోట్లు
* ఐటీ రంగం-రూ.774 కోట్లు
* చేనేత రంగం-రూ.371 కోట్లు

*మొత్తం బడ్జెట్- రూ.3,04,965 కోట్లు
*రెవెన్యూ వ్యయం- రూ.2,26,982 కోట్లు
*మూలధన వ్యయం- రూ.36,054 కోట్లు
*ఎస్సీ సంక్షేమం- రూ.40,232 కోట్లు
*పంచాయతీ రాజ్ శాఖ- రూ.31,605 కోట్లు
*వ్యవసాయశాఖ- రూ.24,439 కోట్లు
*విద్యాశాఖ- రూ.23,108 కోట్లు
*ఎస్టీ సంక్షేమం- రూ.17,169 కోట్లు

వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. 10 ఏళ్లు పైబడిన డీజిల్, 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలను బ్యాన్ చేయాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే పాత వాహనాలకు ఇంధనం అమ్మరు. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇవ్వరు. ఇప్పటికే ఢిల్లీలో నిషేధం అమలవుతోంది. MHతో పాటు మరిన్ని రాష్ట్రాలు ఈ దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది.

TG: గత ప్రభుత్వం సృష్టించిన సవాళ్లను ఏడాదిలోనే దాటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ప్రజా సంక్షేమమే తమకు ముఖ్యమని చెప్పారు. పారదర్శకత, జవాబుదారీతనంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని పేర్కొన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేలా బడ్జెట్ ఉంటుందన్నారు.

AP: ఐదేళ్ల పాలనలో విద్యావ్యవస్థను వైసీపీ నాశనం చేసిందని మంత్రి లోకేశ్ విమర్శించారు. పాఠశాలల్లో 12 లక్షల మంది విద్యార్థులు తగ్గారని అన్నారు. లోకేశ్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అభ్యంతరం తెలిపారు. విద్యావ్యవస్థను భ్రష్టుపట్టించారనడం సరికాదని చెప్పారు. కాగా బొత్సతో చర్చకు సిద్ధమని లోకేశ్ చెప్పారు. ఐటీ సిలబస్ ఎక్కడ అమలు చేశారో చెప్పాలని ఆయనను డిమాండ్ చేశారు.

ఏప్రిల్ 6న ఈడెన్ గార్డెన్స్‌లో జరగాల్సిన KKRvsLSG మ్యాచ్ రీషెడ్యూల్ అయ్యే అవకాశముందని క్రీడా వర్గాలు తెలిపాయి. అదే రోజు శ్రీరామనవమి ఉండడంతో కోల్‌కతా వ్యాప్తంగా భారీగా ఊరేగింపులు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అటు ఊరేగింపులకు, ఇటు మ్యాచుకు భద్రత కల్పించడం పోలీసులకు సవాలుగా మారనుంది. ఈ కారణంతో మ్యాచును రీషెడ్యూల్ చేసే ఛాన్సుంది. గత ఏడాది KKRvsRR మ్యాచునూ ఇదే కారణంతో వాయిదా వేశారు.

క్రేజీ దర్శకుడు తరుణ్ భాస్కర్ కీలక అప్డేట్ ఇచ్చారు. ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి పార్ట్-2 తీయనున్నట్లు హింట్ ఇచ్చారు. ఈ మేరకు ఇన్‌స్టాలో ఈ సంవత్సరం కొన్ని బాకీలు తీర్చాలని పోస్ట్ చేశారు. దీంతో ENE2 రాబోతుందని సోషల్ మీడియాలో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2018లో విడుదలైన ఈ నగరానికి ఏమైంది మూవీ యువతను విశేషంగా ఆకట్టుకుంది.
Sorry, no posts matched your criteria.