news

News March 19, 2025

ఈ నగరాల్లో జీవనం కాస్ట్లీ గురూ!

image

ఇండియాలోని బెంగళూరులో జీవించడం చాలా కాస్ట్లీ అని ఓ అధ్యయనంలో వెల్లడైంది. నగరాలు అక్కడి ఖర్చులను పోల్చుతూ నెలకు ఎంత డబ్బు అవసరం అవుతుందో తెలిపింది. బెంగళూరులో నివసించేందుకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి నెలకు ₹35,887 అవసరమని పేర్కొంది. ముంబైలో ₹33,321, ఢిల్లీలో ₹33,308, పుణేలో ₹32,306, HYDలో ₹31,253, అహ్మదాబాద్‌లో ₹31,048, చెన్నైలో ₹29,276 అవసరం. కాగా వ్యక్తుల అవసరాలను బట్టి ఇందులో మార్పులుండొచ్చు.

News March 19, 2025

ఐపీఎల్‌లో రాణిస్తే టెస్టుల్లో చోటు ఎలా?: అశ్విన్

image

ఆటగాళ్ల ప్రదర్శనను ఆయా ఫార్మాట్ల వారీగా పరిగణనలోకి తీసుకోవాలని అశ్విన్ అన్నారు. ‘T20ల్లో రాణిస్తే ODI/టెస్టులకు, టెస్టుల్లో రాణిస్తే T20లకు తీసుకోవాలని జనం అంటుంటారు. ఇది కరెక్ట్ కాదు. IPLలో రాణిస్తే T20Iకు మాత్రమే తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. శ్రేయస్ గురించి మాట్లాడుతూ ‘IPLలో కెప్టెన్‌గా రాణిస్తే టెస్టుల్లో చోటు ఎలా దక్కుతుంది? CTలో అతను బాగా ఆడాడు. IPLలోనూ రాణిస్తాడు’ అని పేర్కొన్నారు.

News March 19, 2025

వేసవిలో కూల్ వాటర్ తాగుతున్నారా?

image

వేసవిలో రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన నీటిని తాగవద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎండవేడికి తాళలేక చల్లగా ఉన్న నీటిని తాగితే శరీరం వాటిని తీసుకోలేదు. దీంతో తలనొప్పి, అలసట వంటి సమస్యలు వస్తాయి. జీర్ణాశయం పనితీరు నెమ్మదించి మలబద్ధకం, అజీర్తి సమస్యలు ఏర్పడుతాయి. ఎండ నుంచి వచ్చిన వెంటనే చల్లటి నీరు తాగితే జలుబు, గొంతు మంట వచ్చే అవకాశముంది. దంతాలు దెబ్బతినే ఛాన్స్ ఉంది. మట్టికుండలోని నీరు తాగడం ఉత్తమం.

News March 19, 2025

బైడెన్ మా ప్రతిపాదనలు స్వీకరించలేదు: మస్క్

image

సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌ క్షేమంగా భూమిపైకి చేరుకున్న నేపథ్యంలో స్పేస్ ఎక్స్ ఫౌండర్ ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలోనే సునీత, విల్మోర్‌ను భూమి‌పైకి తీసుకొచ్చేందుకు తాము చేసిన ప్రతిపాదనలను రాజకీయ కారణాలతో బైడెన్ స్వీకరించలేదని అన్నారు. ఆయన తమ సూచనలు తీసుకొని ఉంటే వ్యోమగాములు ముందుగానే భూమిపైకి వచ్చేవారన్నారు. గతేడాది స్పేస్ షిప్‌లో సమస్యలు రావడంతో సునీత, విల్మోర్ రాక ఆలస్యమైంది.

News March 19, 2025

విద్యార్థులకు షాక్.. ఫీజులు భారీగా పెంపు

image

TG: పాలిటెక్నిక్ కోర్సు గరిష్ఠంగా రూ.39వేలకు పెరిగింది. దశాబ్ద కాలం నుంచి ఫీజుల పెంపు లేదని కాలేజీల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించగా రూ.40వేల వరకు వసూలు చేయవచ్చని హైకోర్టు పేర్కొంది. 2023-24 విద్యా సంవత్సరం నుంచే వర్తిస్తుందని పేర్కొంది. కాగా ప్రభుత్వం ఫీజు‌ రీయింబర్స్‌మెంట్ కింద రూ.14,900 చెల్లిస్తోంది. మరోవైపు నేటి నుంచి పాలిసెట్ <>అప్లికేషన్లు<<>> స్వీకరించనున్నారు. మే 13న ఎంట్రన్స్ పరీక్ష జరగనుంది.

News March 19, 2025

ఢిల్లీ వీధుల్లో న్యూజిలాండ్ ప్రధాని గల్లీ క్రికెట్

image

న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ఇండియా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ వీధుల్లో అక్కడి పిల్లలతో క్రికెట్ ఆడుతూ సరదాగా గడిపారు. ఆయనతో పాటు కివీస్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్‌ కూడా ఉన్నారు. ఇండియా, న్యూజిలాండ్‌ను ఏకం చేయడంలో క్రికెట్‌ను మించినది లేదని క్రిస్టోఫర్ ట్వీట్ చేశారు.

News March 19, 2025

2025-26 బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం

image

TG: 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కాసేపట్లో అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు నల్లపోచమ్మ గుడిలో బడ్జెట్ ప్రతులను ఉంచి భట్టి ప్రత్యేక పూజలు చేయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇదే తొలి సారి. కాగా బడ్జెట్ రూ.3లక్షల కోట్లకు పైగా ఉండొచ్చని అంచనా.

News March 19, 2025

రికార్డు దిశగా గోల్డ్ ధరలు!

image

బంగారం ధరలు పెరుగుతుండటం చూస్తుంటే త్వరలోనే రూ.లక్షకు చేరేలా కనిపిస్తోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.400 పెరిగి రూ.82,900లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.440 పెరగడంతో రూ.90,440కు చేరింది. అటు వెండి ధర కూడా రూ.1000 పెరిగి ఆల్ టైమ్ హైకి చేరింది. కేజీ సిల్వర్ రేటు రూ.1,14,000గా ఉంది. శుభకార్యాల నేపథ్యంలో బంగారానికి భారీ డిమాండ్ నెలకొంది.

News March 19, 2025

వైసీపీకి ఎమ్మెల్సీ రాజీనామా

image

AP: వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. ఇప్పటికే వైసీపీకి నలుగురు ఎమ్మెల్సీలు(పోతుల సునీత, కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ) రాజీనామా చేశారు. రాజశేఖర్ 2004లో చిలకలూరిపేటలో స్వతంత్ర MLA అభ్యర్థిగా గెలిచారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్ వైసీపీని స్థాపించాక ఆ పార్టీలో జాయిన్ అయ్యారు.

News March 19, 2025

సన్న వడ్లకు రూ.500 బోనస్‌‌పై UPDATE

image

TG: సన్న రకం వడ్లకు రూ.500 బోనస్‌పై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన చేశారు. వానకాలం పంటకు సంబంధించి రూ.1200 కోట్ల నిధులకు ఆర్థిక శాఖ నిన్న ఆమోదం తెలిపిందని ట్వీట్ చేశారు. దీంతో త్వరలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది. సన్నరకం వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. డబ్బులు ఎప్పుడు జమ అవుతాయా అని రైతులు ఎదురుచూస్తున్నారు.