news

News March 19, 2025

సునీత రెండుసార్లు స్పేస్ వాక్ చేశారు: నాసా

image

అంతరిక్షం నుంచి వచ్చిన నలుగురు వ్యోమగాములు ఆరోగ్యంగా ఉన్నారని నాసా వెల్లడించింది. అన్ డాకింగ్ నుంచి సాఫ్ట్ ల్యాండింగ్ వరకు అన్నీ అనుకున్నట్లు జరిగాయని తెలిపింది. స్పేస్ ఎక్స్, నాసా సమష్టి కృషితో వారిని భూమిపైకి తీసుకొచ్చామని పేర్కొంది. ఈ యాత్రను విజయవంతం చేయడంలో స్పేస్ ఎక్స్ కీలకపాత్ర పోషించిందని ప్రశంసించింది. ఈ యాత్రలో సునీత రెండుసార్లు స్పేస్ వాక్ చేశారని వివరించింది.

News March 19, 2025

ఉపాధి కూలీలకు రూ.400 వేతనం ఇవ్వండి: సోనియా

image

గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలకు రోజువారీ కనీస వేతనాన్ని రూ.400 ఇవ్వాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ డిమాండ్ చేశారు. ప్రతి కుటుంబానికి 150 పనిదినాలు కల్పించాలన్నారు. పార్లమెంటులో జీరో అవర్‌లో ఆమె మాట్లాడారు. 2005లో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం దీనిని నిర్వీర్యం చేయాలని చూడటం ఆందోళనకరమని చెప్పారు.

News March 19, 2025

హృతిక్ విషయంలో ఫీలయ్యే వాడిని: రాకేశ్ రోషన్

image

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ బాల్యం గురించి ఆయన తండ్రి రాకేశ్ రోషన్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. హృతిక్‌కు చిన్నప్పుడు నత్తి ఉండేదని దీంతో ఏ విషయం చెప్పాలన్నా సందేహించేవాడని అన్నారు. ఆ విషయంలో హృతిక్‌ను చూసి ఫీలయ్యే వాడినని రాకేశ్ రోషన్ తెలిపారు. అయితే నత్తిని అధిగమించేందుకు రోజూ ఉదయం గంట పాటు వివిధ భాషల పత్రికలు గట్టిగా చదివేవాడని పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు.

News March 19, 2025

నేడు బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న ఆర్థిక మంత్రి

image

TG: ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క నేడు ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో 2025-26 కు సంబంధించి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ ఏడాది పద్దులు రూ.3లక్షల కోట్లకు పైగానే ఉండనున్నట్లు సమాచారం. 2024-25 పద్దు రూ.2.90 లక్షల కోట్లు కాగా ఆశించిన స్థాయిలో ఆదాయం రాలేదని తెలుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ ఇదే.

News March 19, 2025

యాదగిరిగుట్టలో మిస్‌ వరల్డ్

image

TG: యాదగిరిగుట్ట నరసింహస్వామి క్షేత్రాన్ని మిస్‌ వరల్డ్ క్రిస్టినా పిజ్కోవా దర్శించుకున్నారు. భారతీయత ఉట్టిపడేలా బొట్టు పెట్టుకొని, సంప్రదాయ చీరలో కనిపించారు. ఆలయ నిర్మాణ శైలికి ముగ్ధులయ్యారు. నరసింహుడిని దర్శించుకోవడం ఆనందాన్నిస్తోందన్నారు. కాగా చెక్ రిపబ్లికన్‌కు చెందిన ఈమె 2024లో టైటిల్ గెలిచారు. ఇక ఈ ఏడాది మే 7 నుంచి 31 వరకు HYDలో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి.

News March 19, 2025

వడదెబ్బ తాకకుండా ఈ చిట్కాలు పాటించండి

image

కాటన్ వస్త్రాలను ధరించాలి, బయటకు వెళ్లేటప్పుడు వెంట గొడుగు తీసుకెళ్లండి లేదా టోఫి ధరించండి. రోజుకు 3నుంచి 4లీటర్ల నీరు తప్పనిసరిగా తాగుతూ ఉండాలి. ఎండలో పనిచేసేవారు మరింత అధికంగా నీటిని తీసుకోవాలి. కొబ్బరినీళ్లు, ఉప్పు, పంచదార కలిపిన వాటర్ తీసుకుంటూ ఉంటే శరీరం డీ హైడ్రేట్ కాకుండా ఉంటుంది. పండ్ల రసాలు, మజ్జిగ లాంటివి తాగుతూ ఉండండి. అత్యవసరమైతే తప్ప ఎండలో బయటకి వెళ్లకూడదు.

News March 19, 2025

ఐమాక్స్ ఫార్మాట్‌లో.. మోహన్‌ లాల్ చిత్రం

image

మోహన్‌లాల్ హీరోగా ప్రుథ్వీ రాజ్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎల్ 2 ఎంపురాన్’. లూసిఫర్ కు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీని మార్చి 27న ఐమాక్స్ ఫార్మాట్‌లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో మలయాళంలో ఐమాక్స్ ఫార్మాట్‌లో వస్తున్న తొలి చిత్రంగా ‘ఎల్ 2 ఎంపురాన్’ రికార్డు సృష్టించింది. ‘ఐమాక్స్ ఫార్మాట్‌లో విడుదల చేయటం సంతోషంగా ఉందని’ ప్రుథ్యీరాజ్ Xలో పోస్ట్ చేశారు.

News March 19, 2025

సునీతా విలియమ్స్ కోసం ప్రత్యేక పూజలు

image

సునీతా విలియమ్స్ క్షేమంగా భూమిమీదకు చేరుకోవాలని గుజరాత్‌లోని ఝాలసన్‌లో ఆమె పూర్వీకులు పూజలు నిర్వహించారు. సునీతా భూమి మీదకు రాకకోసం కుటుంబమంతా ఎదురుచూస్తుందని తన సోదరుడు తెలిపారు. ఆమె క్షేమంగా చేరుకోవాలని ప్రత్యేకంగా యజ్ఞం చేశామన్నారు. భారత్ సంతతికి చెందిన సునీతా విలియమ్స్ గతేడాది అంతరిక్షంలో చిక్కుకుంది. 9నెలల తర్వాత నేడు వ్యోమనౌకలో భూమి మీదకు రానుంది.

News March 19, 2025

చిరంజీవికి ముద్దు పెట్టిన మహిళా అభిమాని

image

మెగాస్టార్ చిరంజీవికి ఓ మహిళ ముద్దుపెట్టిన ఫొటో వైరలవుతోంది. రేపు UK పార్లమెంట్‌లో లైఫ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకోవడానికి ఆయన లండన్ చేరుకున్నారు. అక్కడి ఎయిర్‌పోర్టులో మెగాస్టార్‌‌కు ఘనస్వాగతం లభించగా, ఓ మహిళా అభిమాని ఆయన బుగ్గపై ముద్దు పెట్టారు. కాగా, ‘చిన్నప్పుడు చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లాలని అల్లరి చేసిన నేనే, మా అమ్మను చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లా’ అని ఆ అభిమాని కొడుకు ట్వీట్ చేశారు.

News March 19, 2025

IPL: మిడిలార్డర్‌లో KL బ్యాటింగ్?

image

ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్న KL రాహుల్ బ్యాటింగ్ పొజిషన్‌పై చర్చ జరుగుతోంది. టీ20ల్లో ఓపెనర్‌గా ఆడే అతను ఈసారి టీమ్ కోసం మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయినట్లు వార్తలొస్తున్నాయి. మెక్‌గుర్క్, డూప్లెసిస్ ఓపెనర్లుగా, అభిషేక్ పోరెల్ మూడో స్థానంలో, KL, అక్షర్, స్టబ్స్ మిడిలార్డర్‌లో ఆడతారని సమాచారం. DC తన తొలి మ్యాచును ఈనెల 24న వైజాగ్ వేదికగా LSGతో ఆడనుంది.