news

News March 18, 2025

సూపర్ స్టైలిష్‌గా మెగాస్టార్.. లుక్ చూశారా?

image

మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా నుంచి తాజాగా రిలీజైన స్టిల్స్ ఆకట్టుకుంటున్నాయి. చిరంజీవి యంగ్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. లుక్ సూపర్‌గా ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చిందని, ఒక సాంగ్ షూటింగ్ మాత్రమే పెండింగ్‌లో ఉన్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఈ ఏడాది వేసవిలో విడుదలకు సిద్ధమవుతోంది.

News March 18, 2025

తల్లి, సోదరుడి శవాలతో నెల రోజులుగా ఇంట్లోనే..

image

AP: తల్లి, సోదరుడి మృతదేహాలతో ఓ వ్యక్తి నెల రోజులుగా ఇంట్లోనే ఉంటున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కడప శాటిలైట్ సిటీలో నివాసముంటున్న వృద్ధురాలికి ఇద్దరు కొడుకులు(45,55 ఏళ్లు) ఉన్నారు. నెల కిందట ఆమె చనిపోగా, ఓ కొడుకు ఉరేసుకున్నాడు. ఈ ఇద్దరు కుమారులు ఎవరితో మాట్లాడేవారు కాదు. దీంతో ఆ ఇంటి నుంచి దుర్వాసన వచ్చే దాకా విషయం బయటకు రాలేదు. స్థానికులు మానసిక స్థితి లేని మరో కుమారుడిని ఆశ్రమానికి తరలించారు.

News March 18, 2025

ఇండియా గురించి ఈ విషయాలు తెలుసా?

image

మన దేశంలో 2024 నాటికి 143+ కోట్ల మంది జనాభా ఉండగా అందులో 136 కోట్ల మందికి ఆధార్ కార్డులున్నాయి. 95 కోట్ల ఓటర్లుంటే 120 కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. 65 కోట్ల మంది ఇ-కామర్స్, 80 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ యూజర్లు, 50 కోట్ల మంది ఓటీటీ సబ్‌స్క్రైబర్లున్నారు. UPI యూజర్లు 42 కోట్లు కాగా 28 కోట్ల మంది ఫుడ్ డెలివరీ యాప్స్ వాడుతున్నారు. అలాగే 39% మంది అర్బన్‌లో 61% మంది రూరల్ ఏరియాల్లో జీవిస్తున్నారు.

News March 18, 2025

NTR జిల్లా పేరు ఎందుకు మార్చలేదు?: షర్మిల

image

AP: చంద్రబాబు తీరు అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు ఉందని షర్మిల అన్నారు. ‘NTR పేరును జగన్ మారిస్తే, YSR పేరు మార్చి CBN ప్రతీకారం తీర్చుకుంటున్నారు. YSR జిల్లాను YSR కడప జిల్లాగా సవరించడంలో అభ్యంతరం లేదు. తాడిగడప మున్సిపాలిటీకి YSR పేరును తొలగించడాన్ని ఖండిస్తున్నాం. NTR జిల్లా పేరును NTR విజయవాడగా లేదా పాత కృష్ణా జిల్లా పేరును NTR కృష్ణా జిల్లాగా ఎందుకు మార్చలేదు?’ అని ప్రశ్నించారు.

News March 18, 2025

రేపు తెలంగాణ బడ్జెట్

image

TG: అసెంబ్లీ కమిటీ హాల్‌లో రేపు ఉదయం 9.30 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలపనుంది. ఉ.11.14 గంటలకు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసన సభలో, మంత్రి శ్రీధర్ బాబు మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కీలక పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులకు కేటాయింపులు చేసే అవకాశం ఉంది.

News March 18, 2025

పెద్ద దేవళాపురం@42.7 డిగ్రీలు

image

AP: ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచికొట్టాయి. నంద్యాల జిల్లా పెద్ద దేవళాపురంలో అత్యధికంగా 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉలిందకొండలో 42.6, ఖాజీపేటలో 41.8, దరిమడుగులో 41.5, నాగసముద్రం, వత్తలూరులో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీల పైనే నమోదవడం గమనార్హం. అలాగే 7 మండలాల్లో తీవ్ర వడగాలులు, 42 మండలాల్లో వడగాలులు వీచాయని APSDMA వెల్లడించింది.

News March 18, 2025

వ్యోమగాముల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు

image

వ్యోమగాములు అనారోగ్యానికి గురైతే చికిత్స అందించేందుకు టీమ్‌లో ఒక మెడికల్ ఆఫీసర్ ఉంటారు. అతనికి ప్రాథమిక చికిత్స, ఇంజెక్షన్లు ఇవ్వడం, గాయాలకు కుట్లు వేయడంపై శిక్షణ ఇస్తారు. ISSలోనే మెడికల్ కిట్ ఉంటుంది. అలాగే అక్కడి టాయిలెట్స్ కూడా భిన్నంగా ఉంటాయి. అందులో వాటర్ గన్‌కు బదులు వాక్యూమ్ క్లీనర్ ఉంటుంది. వ్యర్థాలు గాల్లో తేలియాడకుండా ఇది పీల్చుకుంటుంది. గొట్టంలాంటి వాక్యూమ్‌‌ను టాయిలెట్‌కు వాడతారు.

News March 18, 2025

చేనేత కార్మికుల ఇంటి నిర్మాణానికి రూ.50,000: సీఎం

image

AP: చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని CM చంద్రబాబు తెలిపారు. దీంతో 93వేల మంది చేనేతకారులకు, 10,534 మరమగ్గాల యజమానులకు లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. చేనేత కార్మికుల ఇంటి నిర్మాణానికి ₹50,000 సాయం చేస్తామని ప్రకటించారు. అలాగే వారికి GST రీయింబర్స్‌మెంట్ అమలు చేస్తామన్నారు. ప్రభుత్వ సహకారంతో నేతన్నలు వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు.

News March 18, 2025

ఆధార్- ఓటర్ కార్డు అనుసంధానానికి నిర్ణయం

image

ఆధార్- ఓటర్ కార్డు అనుసంధానించాలని ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేశ్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు త్వరలో చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్టికల్ 326, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950, సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అనుసంధానానికి గల సాంకేతిక అంశాలపై UIDAIతో సంప్రదింపులు జరుపుతామని స్పష్టం చేశారు. ఇవాళ పలు శాఖల కార్యదర్శులతో సమావేశమైన CEC ఈ మేరకు వెల్లడించారు.

News March 18, 2025

ప్రభుత్వ సంస్థల విద్యుత్ సర్‌ఛార్జీ రద్దు

image

AP: ప్రభుత్వ సంస్థలు, విభాగాల విద్యుత్ సర్‌ఛార్జీని మాఫీ చేస్తూ APERC ఉత్తర్వులు ఇచ్చింది. 2024-25కు గాను ఆయా సంస్థలు రూ.3,176 కోట్లు బకాయిపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో వన్ టైమ్ సెటిల్మెంట్ కింద సర్‌ఛార్జీని ఈఆర్సీ ఉపసంహరించుకుంది.