India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. పుట్లూరు నుంచి వెళ్తున్న బస్సు చింతకుంట వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. స్టీరింగ్ స్టక్ కావడంతో ఇలా జరిగినట్లు సమాచారం. బస్సులో ఎక్కువగా ఆదర్శ పాఠశాల, జడ్పీ పాఠశాల విద్యార్థులు ఉన్నారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

వివిధ అవసరాలకు వాడే సేఫ్టీ పిన్ (పిన్నీసు/ కాంట) ఊర్లో జరిగే సంతలో, దుకాణాల్లో రూ.5కే డజను లభిస్తాయి. అయితే వాటికి దారాలు చుట్టి భారీ ధరకు అమ్మేస్తోంది లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ ‘ప్రడా’ (Prada). చిన్న మెటల్ సేఫ్టీ పిన్ బ్రోచ్ ధర 775 డాలర్లు (సుమారు రూ. 69,114) ఉండటంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అతి సాధారణ వస్తువులనూ బ్రాండింగ్ చేస్తూ సంపన్నులను ఆకర్షిస్తున్నాయి ఈ కంపెనీలు. దీనిపై మీరేమంటారు?

తల్లికి షుగర్ నియంత్రణలో లేకపోతే ఉమ్మనీరు ఎక్కువగా ఉంటుంది. అలాగే అల్ట్రా సౌండ్ గైడెడ్ ఆమ్నియోసెంటెసిస్ ద్వారా కూడా ఉమ్మనీరును కొంతవరకు నియంత్రణలో ఉంచవచ్చు. తల్లికి డెలివరీ కాంప్లికేషన్లు వస్తే డాక్టర్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. కొన్నిసార్లు అధిక ఉమ్మనీరు కాన్పు సమయంలో బిడ్డకు ప్రాణాంతకమై నియోనేటల్ సేవలు అవసరమవుతాయి. కాబట్టి అన్ని వసతులు ఉన్న ఆసుపత్రిలో కాన్పు చేయించుకుంటే మంచిది.

AP: నైరుతి బంగాళాఖాతం నుంచి ఉ.కేరళ వరకు తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ MD ప్రఖర్ జైన్ తెలిపారు. రేపు కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొన్నారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందన్నారు.

TG: జూ.పంచాయతీ కార్యదర్శుల ఎంపికలో భాగంగా 2 రోజులపాటు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయనున్నట్లు పంచాయతీ రాజ్ శాఖ వెల్లడించింది. 2019లో కోర్టు వివాదాల నేపథ్యంలో స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన కార్యదర్శులను తొలగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వారితో పాటు కొత్తగా ఎంపికైన 172 మంది ధ్రువపత్రాలను ఈ నెల 10, 11 తేదీల్లో ఉ.10.30 గంటల నుంచి సా.5 గంటల వరకు పరిశీలించనున్నట్లు తెలిపింది.

AP: రాష్ట్రంలో మొంథా తుఫాన్ వల్ల నష్టపోయిన పంటల నమోదుకు గడువును మరో 2 రోజులు పొడిగించినట్లు వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. తుఫానుతో నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఈ-క్రాప్ నమోదు వంద శాతం జరిగిందని పేర్కొన్నారు. దీనిపై జగన్ అబద్ధాలు చెబుతున్నారని, ఆయన వస్తే ఈ-క్రాప్ నమోదు అయిందో లేదో చూపిస్తానని సవాల్ చేశారు.

<<18185953>>సమీకృత వ్యవసాయం<<>>లో ఏ భూములు వేటి పెంపకానికి అనుకూలమో చూద్దాం ☛ బీడుభూములు – పశువులు, కోళ్లు, మేకలు, గొర్రెల పెంపకం, వ్యవసాయ అడవుల పెంపకం, వ్యవసాయ చెరువులకు అనుకూలం. ☛ తోట భూములు – పశువుల పెంపకం, కోళ్ల పెంపకం, పందుల పెంపకం, పుట్టగొడుగులు, తేనె తయారీ, పట్టు పురుగుల పెంపకానికి అనుకూలం. ☛ తడి భూములు – పంటలు, చేపలు, బాతులు, కోళ్లు, మేకలు, గొర్రెలు, పశువుల పెంపకానికి అనుకూలం.

AIని అడాప్ట్ చేసుకుంటున్న కంపెనీలు సిబ్బంది సంఖ్యను తగ్గించుకొనే పనిలో పడ్డాయి. మొన్న అమెజాన్ 14వేల మంది ఉద్వాసనకు నిర్ణయం తీసుకోగా తాజాగా IBM ఈ ఏడాది చివరి నాటికి వేలాది మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. ఆ సంస్థలో ప్రస్తుతం 2.7 లక్షల మంది పనిచేస్తుండగా సింగిల్ డిజిట్లో 1% అనుకున్నా 2700 మందికి లేఆఫ్ తప్పదని అంచనా వేస్తున్నారు. కాగా ఈ సంస్థలు భారత్‌లోనే పెద్ద కార్యాలయాలు నిర్వహిస్తున్నాయి.

బంగ్లాదేశ్ ఉమెన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ నిగర్ సుల్తానా జోటీ జట్టులోని జూనియర్లను కొట్టిందని మాజీ సహచరురాలు జహనారా ఆలం ఆరోపించారు. కొట్టడం ఆమెకు అలవాటని, దుబాయ్ టూర్లోనూ రూముకు పిలిచి మరీ జూనియర్ని కొట్టిందని చెప్పారు. ICC వరల్డ్ కప్‌లో బంగ్లా టీమ్ లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. ఈ నేపథ్యంలో జట్టులోని అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. కాగా ఇవి నిరాధార ఆరోపణలంటూ ఆ దేశ క్రికెట్ బోర్డు ఖండించింది.

TG: PVT కాలేజీల యాజమాన్యాలను సాంకేతిక విద్యా కమిషనర్ దేవసేన బెదిరిస్తున్నారని సమాఖ్య ఛైర్మన్ రమేష్‌బాబు ఆరోపించారు. ఆమెను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. బకాయిల కోసం 3 రోజులుగా బంద్ కొనసాగుతుండగా చర్చలకు పిలిచి ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించలేదని మండిపడ్డారు. ట్రస్ట్ బ్యాంక్ ఏర్పాటుకు వేసిన కమిటీలో సంబంధం లేని ఇద్దరిని తొలగించాలన్నారు. ఫీజు బకాయిలు చెల్లించే వరకు బంద్ విరమించేది లేదని తేల్చి చెప్పారు.
Sorry, no posts matched your criteria.