India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: ఈ వేసవిలోనే తుమ్మిడిహట్టి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. వచ్చే నెలలో సీఎం రేవంత్ మహారాష్ట్రలో పర్యటించి అక్కడి సీఎంతో చర్చలు జరుపుతారని వెల్లడించారు. తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీటిని ఎలా తీసుకురావాలనేదానిపై పరిశీలన జరుగుతోందన్నారు. కాళేశ్వరం పంప్ హౌసులను సరైన ఎత్తులో నిర్మించకపోవడంతో భారీ వరదలు వస్తే మునిగిపోతున్నాయని చెప్పారు.

అనుమతి లేకుండా మహిళల ఫొటోల వినియోగం ఆందోళనకరమని, వాటిని ప్రభుత్వ ప్రకటనల్లో ఉపయోగించినా అది వాణిజ్య దోపిడీ కిందికే వస్తుందని బాంబే హైకోర్టు పేర్కొంది. అంగీకారం లేకుండా మహిళల ఫొటోలు ప్రకటనల్లో వాడుతున్నారనే నమ్రత అంకుశ్ అనే మహిళ పిటిషన్‌పై కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. దీనిపై ఈ నెల 24లోగా సమాధానం చెప్పాలని కేంద్రం, తెలంగాణ, MH, కర్ణాటక, ఒడిశా ప్రభుత్వాలు, కాంగ్రెస్ పార్టీ ఇతరులకు ఆదేశాలిచ్చింది.

భగవద్గీత తనకు ప్రశాంతతను, మనోస్థైర్యాన్ని ఇస్తుంటుందని అమెరికా నిఘా సంస్థల డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ అన్నారు. భారత పర్యటనలో ఉన్న ఆమె ANIతో ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘భారత్‌కు వస్తే సొంత ఇంటికి వచ్చినట్లుంటుంది. ప్రజలు ఎంతో సాదరంగా మాట్లాడుతారు. ఆహారం అత్యంత రుచికరంగా ఉంటుంది. నేను యుద్ధక్షేత్రంలో ఉన్న సమయంలో భగవద్గీత నాకు ఊరటనిచ్చేది’ అని వివరించారు. ఆమె హిందూమతాన్ని అనుసరిస్తున్న సంగతి తెలిసిందే.

TG: ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పదవీకాలం ఈ ఏప్రిల్‌తో ముగియనుంది. ఈ నేపథ్యంలో తదుపరి సీఎస్‌గా కె.రామకృష్ణారావు పేరును ప్రభుత్వం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 1980 బ్యాచ్‌కు చెందిన ఈయన ప్రస్తుతం
ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. రామకృష్ణారావు పదవీకాలం ఈ ఆగస్టుతో ముగియనుంది. ఈయన తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి 12 బడ్జెట్లను రూపొందించి రికార్డు సృష్టించారు.

శ్రీవారి ఆర్జిత సేవకు సంబంధించి జూన్ నెల టికెట్ల లక్కీడీప్ కోటాను TTD ఈరోజు ఉదయం 10గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు భక్తులు నమోదు చేసుకోవచ్చు. డిప్‌లో టికెట్లు దక్కిన భక్తులు ఈ నెల 20-22 తేదీల మధ్యలో పేమెంట్ పూర్తి చేసి టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇక 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, మధ్యాహ్నం గదుల కోటాను విడుదల చేయనుంది.

TG: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు రుణం అందించేందకు రాజీవ్ యువవికాసం పథకాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. <<15792006>>నిన్న దరఖాస్తుల ప్రక్రియ<<>> ప్రారంభమైంది. అర్హుల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలదేనని స్పష్టం చేశారు. నిజమైన నిరుద్యోగులకే ఈ పథకం అందాలని సూచించారు. ఐదంతస్తుల భవనం ఉన్నవారికి రూ.4 లక్షలు ఇస్తానంటే కుదరదని చెప్పారు. జూన్ 2న లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేయనున్నారు.
వెబ్‌సైట్: tgobmms.cgg.gov.in

AP: CM చంద్రబాబు ఇవాళ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులతోపాటు పలు అంశాలపై PMతో చర్చించనున్నారు. అలాగే అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి రావాల్సిందిగా మోదీని కోరనున్నట్లు సమాచారం. అనంతరం హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు.

TG: లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాలకు సరైన ప్రాతినిధ్యం ఉండేలా డీలిమిటేషన్ ప్రక్రియ ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షతన నియోజక వర్గాల పునర్విభజనపై అసెంబ్లీ కమిటీ హాల్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని వివిధ పార్టీల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అఖిలపక్ష సమావేశంపై ప్రభుత్వానికి స్పష్టత లేదని కేటీఆర్ విమర్శించారు.

చిరంజీవి- అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చే మూవీపై ఓ క్రేజీ అప్‌డేట్ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో చిరంజీవి విలేజ్ బ్యాక్ డ్రాప్ ఉన్న క్యారెక్టర్ చేయనున్నారని సమాచారం. అంతేకాకుండా ఇందులో హీరోయిన్‌గా అదితిరావు హైదరీని ఎంచుకున్నట్లు టాక్. గతంలోనూ మెగాస్టార్ విలేజ్ బ్యాక్ డ్రాప్‌తో నటించిన చిత్రాలు విజయం సాధించడంతో పాటు..అనిల్ రావిపూడి కాంబో కావడంతో ఈ చిత్రం పై అంచనాలు భారీగా పెరిగాయి.

బీసీ రిజర్వేషన్ల బిల్లుకు BRS మెుదటి నుంచి వ్యతిరేకంగా ఉందని మంత్రి సీతక్క విమర్శించారు. ఉదయం రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు ప్రకటించి సాయంత్రం మాట మారుస్తోందని మండిపడ్డారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా మైనార్టీ,ST రిజర్వేషన్లు పెంచలేదని ఆరోపించారు. రాహుల్ గాంధీ ఆలోచనతో న్యాయనిపుణుల సలహాలతోనే కులగణన చేశామని తెలిపారు.
Sorry, no posts matched your criteria.