news

News March 17, 2025

నియోజకవర్గానికి 4-5వేల మందికి సాయం: సీఎం రేవంత్

image

TG: ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని SC, ST, BC, మైనార్టీ నిరుద్యోగులకు అర్హత ప్రకారం అమలు చేస్తామని CM రేవంత్ తెలిపారు. ఒక్కొక్కరికి ₹50వేల నుంచి ₹4లక్షల వరకు మంజూరు చేస్తామన్నారు. ‘రాబోయే 2 నెలల్లో డబ్బులు మీ చేతుల్లో పెడతాం. జూన్ 2న 5లక్షల మంది లబ్ధిదారులను ప్రకటిస్తాం. నియోజకవర్గానికి 4-5వేల మందిని ఎంపిక చేస్తాం’ అని పేర్కొన్నారు.

News March 17, 2025

‘ఫ్యామిలీ రూల్‌’పై అనుష్క శర్మ పోస్ట్.. వైరల్

image

బీసీసీఐ ప్రవేశపెట్టిన ‘ఫ్యామిలీ రూల్‌’పై టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ పరోక్షంగా స్పందించారు. ‘నువ్వు తెలిసిన ప్రతి ఒక్కరి మనసులో నీ గురించి వేర్వేరు అభిప్రాయాలు ఉంటాయి. కానీ నువ్వేంటో నీకు మాత్రమే తెలుసు’ అంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కాగా టూర్లలో క్రికెటర్లతోపాటు వారి కుటుంబాలు, సన్నిహితులు ఉంటే బాగుంటుందని విరాట్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

News March 17, 2025

అత్యధిక పన్ను చెల్లించే నటుడు ఎవరంటే?

image

బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇన్కమ్‌ట్యాక్స్ చెల్లించడంలో ఎప్పుడూ ముందుంటారు. తాజాగా ఆయన అడ్వాన్స్‌ ట్యాక్స్ రూ.52.50కోట్లు చెల్లించినట్లు సినీవర్గాలు తెలిపాయి. కాగా, 2024-2025 ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ.350 కోట్లు సంపాదించినట్లు పేర్కొన్నాయి. తద్వారా రూ.120 కోట్లు పన్ను చెల్లించి అత్యధికంగా పన్ను చెల్లించిన నటుడిగా నిలిచినట్లు వెల్లడించాయి. 85 సంవత్సరాల వయసులోనూ ఆయన ఎంతో డిమాండ్ ఉన్న నటుడిగా ఉన్నారు.

News March 17, 2025

11 మంది సెలబ్రిటీలపై కేసులు

image

TG: బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న పలువురు సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. 11 మందిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. విష్ణుప్రియ, సుప్రిత, రీతూ చౌదరి, హర్షసాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్‌, శ్యామల, కిరణ్ గౌడ్‌, సన్నీ యాదవ్‌, సుధీర్ రాజు, అజయ్‌పై కేసులు నమోదయ్యాయి.

News March 17, 2025

తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు

image

రెండు తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోయారు. అత్యధికంగా ఇవాళ ఏపీలోని మన్యం జిల్లా వీరఘట్టంలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 42.6, ప్రకాశం జిల్లా పెద్దారవీడు, నంద్యాల జిల్లా గోనవరంలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు తెలంగాణలోని భద్రాద్రి, ఆదిలాబాద్‌లో 42 డిగ్రీలు, కొమురంభీంలో 41.8, మెదక్‌లో 39.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News March 17, 2025

ఉగాది నుంచి పీ4 విధానం అమలు: సీఎం చంద్రబాబు

image

AP: ఉగాది నుంచి పీ4 విధానం అమలు చేస్తామని CM చంద్రబాబు అన్నారు. పేదలకు చేయూత ఇచ్చేందుకు వీలుగా జాబితా చేస్తామని తెలిపారు. 2029లో ప్రజలకు ఏం చేస్తామో చెప్పి ఎన్నికలకు వెళతామని వివరించారు. నియోజకవర్గాల వారీగా పీ4 అమలు కావాలని ప్రజాప్రతినిధులను ఆదేశించారు. పేదరిక నిర్మూలనకు 10 సూత్రాలను లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఉమ్మడి APలో 2020 విజన్ వల్ల చెప్పిన దానికంటే ఎక్కువ ప్రయోజనం కలిగిందని చెప్పారు.

News March 17, 2025

రేపు మేదరమెట్లకు వైఎస్ జగన్

image

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ రేపు బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. మేదరమెట్లలో వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ అంత్యక్రియల్లో ఆయన పాల్గొంటారు. ఆమె మృతదేహానికి నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. మరోవైపు పార్లమెంట్ సమావేశాల్లో ఉన్న వైవీ సుబ్బారెడ్డి తల్లి మరణవార్త తెలియగానే హుటాహుటిన ఢిల్లీ నుంచి ఒంగోలుకు బయల్దేరారు.

News March 17, 2025

OTTలోకి వచ్చేసిన 5 ఆస్కార్‌లు గెలిచిన మూవీ

image

5 ఆస్కార్ అవార్డులు పొందిన రొమాంటిక్ కామెడీ మూవీ ‘అనోరా’ ఓటీటీలోకి వచ్చేసింది. జియో హాట్‌స్టార్‌లో ఈ సినిమా ఇంగ్లిష్, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. రష్యాలోని రిచ్ ఫ్యామిలీ యువకుడు USలో ఒక వేశ్యను ప్రేమ వివాహం చేసుకుంటాడు. ఈ విషయం తెలియడంతో అతడిని పేరెంట్స్ ఇంటికి తీసుకెళ్లిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఈ మూవీ కథ. ‘అనోరా’ ఒక లాటిన్ పదం. దీనికి తెలుగులో గౌరవం అని అర్థం.

News March 17, 2025

తప్పు మీది కాదు.. EVMలది: ఆర్కే రోజా

image

AP: మెడికల్ కాలేజీలకు మంగళం పాడిన కూటమి ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఎత్తేసిందని, ఇప్పుడు బడుల వంతు అని మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. ‘అయినా విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అని ముందే మీరు చెప్పారు లేండి. తప్పు మీది కాదు.. తప్పంతా EVMలదే. 5 కిలోమీటర్ల పరిధిలో గ్రామంలో ఒకే పాఠశాల ఉండాలా? గ్రామంలో ఎన్ని బ్రాందీ, బెల్ట్ షాపులైనా ఉండొచ్చా?’ అని ప్రభుత్వాన్ని నిలదీస్తూ ట్వీట్ చేశారు.

News March 17, 2025

చైతూ జ్ఞాపకాలను చెరిపేస్తున్న సమంత!

image

నాగచైతన్యతో విడిపోయిన సమంత ఒక్కొక్కటిగా ఆయనతో ఉన్న జ్ఞాపకాలను చెరిపేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఎంగేజ్మెంట్ రింగ్‌లోని డైమండ్‌ను లాకెట్‌గా మార్చుకున్న సామ్ చైతూతో కలిసి వేయించుకున్న టాటూను తొలగించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా ఆమె పోస్టు చేసిన ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. తన జీవితంలోని చేదు అనుభవాల నుంచి బయటకొచ్చేందుకు ఆమె ఇలా చేస్తున్నట్లు సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది.