news

News March 17, 2025

ఫస్ట్ మ్యాచ్.. RCB తుది జట్టు ఇదేనా?

image

IPL-2025 కోసం అన్ని జట్లు రెడీ అవుతున్నాయి. మార్చి 22న జరిగే తొలి మ్యాచులో ఆర్సీబీ, కేకేఆర్ తలపడనున్నాయి. అందులో ఆర్సీబీ ప్లేయింగ్ -11 ఎలా ఉంటుందో ESPNcricinfo అంచనా వేసింది.
టీమ్: ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పాటీదార్ (C), లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ, బెథెల్/టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్, యశ్ దయాల్, హేజిల్‌వుడ్, సుయాశ్.

News March 17, 2025

నటి రన్యారావుపై బీజేపీ MLA అసభ్య వ్యాఖ్యలు

image

బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టైన <<15652905>>నటి రన్యా రావుపై<<>> బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె శరీరంలోని అంగాంగంలో ప్రతీ చోట బంగారం పెట్టుకొని స్మగ్లింగ్ చేసిందన్నారు. ఈ వ్యవహారంలో ప్రమేయమున్న మంత్రుల పేర్లను అసెంబ్లీ సమావేశాల్లో వెల్లడిస్తానని చెప్పారు. ఆమెకు సంబంధించిన పూర్తి సమాచారం తన దగ్గర ఉందన్నారు.

News March 17, 2025

ఆ బాధ్యత ఎమ్మెల్యేలదే: సీఎం చంద్రబాబు

image

AP: 2047 కల్లా రాష్ట్ర తలసరి ఆదాయం రూ.55లక్షలు ఉండాలని, 2.4 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థకు చేరాలని CM చంద్రబాబు ఆకాంక్షించారు. అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘దేశంలో అధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ. వికసిత్ భారత్-2047 కల్లా దేశం 30 ట్రిలియన్ డాలర్ల GDPకి చేరాలి. రాష్ట్రంలో నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్ అమలుపరిచే బాధ్యత MLAలదే. ఉమెన్ వర్క్ ఫోర్స్ పెరిగితే వేగవంతమైన అభివృద్ధి సాధ్యం’ అని తెలిపారు.

News March 17, 2025

ప్రతిపక్ష నేతలకు భట్టి ఫోన్.. అఖిలపక్ష భేటీపై ఆరా

image

TG: సరైన షెడ్యూల్ లేని కారణంగా పునర్విభజనపై అఖిలపక్ష సమావేశానికి అన్ని పార్టీల ఎంపీలు డుమ్మా కొట్టారు. దీంతో ప్రతిపక్ష నేతలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫోన్ చేశారు. తేదీని ఖరారు చేయడం కోసం ఆరా తీశారు. సాయంత్రం భేటీ అవుదామని కోరగా రాజకీయ పార్టీల నుంచి స్పష్టత రాలేదు.

News March 17, 2025

తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి గొప్పతనం ఇదే..

image

TG రాజకీయ, సాంఘిక చైతన్యానికి మరోపేరు సురవరం ప్రతాపరెడ్డి. పత్రికా సంపాదకుడు, పరిశోధకుడు, పండితుడు, రచయిత, నిజాం వ్యతిరేక ఉద్యమ నేతగా ఆయన సుపరిచితుడు. ‘నిజాం రాష్ట్రంలో ఆంధ్ర కవులు పూజ్యము’ అన్న నిందను సవాల్‌గా తీసుకొని 354 కవులతో ‘గోల్కొండ కవుల సంచిక’ గ్రంథం ప్రచురించారు. గోల్కొండ పత్రికనూ నడిపారు. ఆంధ్రుల సాంఘిక చరిత్ర, రామాయణ విశేషాలు, హిందువుల పండుగలు, హైందవ ధర్మవీరులు వంటి పుస్తకాలు రాశారు.

News March 17, 2025

తెలుగువారి చరిత్రను తెలుగువారికి చాటిన సురవరం

image

ఆంధ్రము అంటే తెలుగు. ఆంధ్రులు అంటే తెలుగువారు. మన చరిత్రను మనకు తెలిపిన, ప్రపంచానికి చాటిన వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి. ఆయన రాసిన ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ మన గొప్పేంటో, తప్పేంటో వివరించింది. ఆంధ్రుల సంస్కృతి, రాజులు, పంటలు, పండుగలు, కవులు, యాసలు, భాష, వేషం గురించి ఇందులో తెలుసుకోవచ్చు. ముక్కుపుల్ల, అష్టాచెమ్మ, గుజ్జనగూళ్లు సహా మన పూర్వీకుల బాల్యపు ఆటల గురించి తెలిస్తే అమ్మో అనాల్సిందే. SHARE.

News March 17, 2025

పొట్టిశ్రీరాములు వర్సిటీ పేరు మార్పు బిల్లుకు ఆమోదం

image

TG: పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరును ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.

News March 17, 2025

బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన పొన్నం

image

TG: బీసీ రిజర్వేషన్ల బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. విద్య, ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లకు వేర్వేరుగా బిల్లులను తీసుకొచ్చింది. త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

News March 17, 2025

ఫేక్ పాస్‌పోర్టు, వీసాతో ప్రవేశిస్తే 7 ఏళ్లు జైలు, ఫైన్!

image

సరికొత్త ఇమ్మిగ్రేషన్ బిల్లును పార్లమెంటు ఆమోదిస్తే దేశంలోకి అక్రమంగా ప్రవేశించేవారికి చుక్కలు కనిపించడం ఖాయమే. ఫేక్ పాస్‌పోర్టు లేదా వీసాతో దేశంలోకి ప్రవేశించేవారు, ఉండేవారు, విడిచివెళ్లే వారు గరిష్ఠంగా ఏడేళ్లు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అలాగే రూ.10 లక్షల వరకు జరిమానా చెల్లించాల్సి వస్తుంది. ఎయిర్‌లైన్స్, షిప్స్ ముందస్తుగా ప్రయాణికులు, స్టాఫ్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.

News March 17, 2025

చర్లపల్లి టర్మినల్‌కు పొట్టిశ్రీరాములు పేరు పెట్టండి: రేవంత్

image

TG: చర్లపల్లి టర్మినల్‌కు పొట్టిశ్రీరాములు పేరు పెట్టాలని CM రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై కేంద్ర మంత్రి బండి సంజయ్, కిషన్ రెడ్డికి లేఖ రాస్తామని చెప్పారు. టర్మినల్‌కు ఆయన పేరు పెట్టి దేశభక్తి చాటుకోవాలని కోరారు. బల్కంపేటలోని ప్రకృతి వైద్య చికిత్స ఆలయానికి రోశయ్య పేరు పెడతామన్నారు. మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.