India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: పొట్టి శ్రీరాములు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి గౌరవం ఉందని సీఎం రేవంత్ తెలిపారు. ఆయన గొప్ప దేశభక్తుడని కొనియాడారు. అయితే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత విముక్తికి పోరాడిన గొప్ప వ్యక్తుల పేర్లను యూనివర్సిటీలకు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే పలు వర్సిటీలకు పేర్లు మార్చినట్లు గుర్తు చేశారు. ఆ కోవలోనే తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరును పెట్టాలని నిర్ణయించామన్నారు.

ప్రధాని నరేంద్రమోదీపై US ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి అభిమానం చాటుకున్నారు. US పాడ్‌కాస్టర్, AI పరిశోధకుడు లెక్స్ ఫ్రైడ్‌మన్‌కు ఇచ్చిన సుదీర్ఘ ఇంటర్వ్యూ వీడియోను తన సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో షేర్ చేశారు. మూడు గంటల నిడివి ఉన్న ఈ పాడ్‌కాస్ట్‌లో RSSతో అనుబంధం, భారత్‌కు నిర్వచనం, సంస్కృతి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ట్రంప్ పాలన సహా అనేక అంశాలపై మోదీ తన అభిప్రాయాలు పంచుకున్నారు.

కస్టమర్లకు మారుతీ సుజుకీ షాకిచ్చింది. 2025, APRIL నుంచి కార్ల ధరలను 4% వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. ముడి వనరుల ధరలు, ఆపరేషనల్ కాస్ట్ పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది. మోడల్‌ను బట్టి కస్టమర్లపై తక్కువ భారం వేసేందుకే ప్రయత్నించామని వెల్లడించింది. 2025లో ఈ కంపెనీ ధరలు పెంచడం ఇది మూడోసారి. గత DEC ప్రకటించిన 4% పెంపు JANలో అమల్లోకి వచ్చింది. FEBలో మోడల్‌ను బట్టి రూ.1500-32,500 వరకు పెంచింది.

TG: అసెంబ్లీలో ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టింది. మంత్రి దామోదర రాజనర్సింహ ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టారు. ఇందులో ఎస్సీలను మూడు గ్రూపులుగా విభజించారు. జనాభా ప్రాతిపదికన మొదటి గ్రూపులో 15 కులాలు, రెండో గ్రూపులో 18, మూడో గ్రూపులో 26 కులాలను చేర్చింది.

కంగన ఇందిరాగాంధీ పాత్రలో నటించిన ‘ఎమర్జెన్సీ’కి OTTలో మంచి ఆదరణ వస్తోంది. దీంతో ఆ సినిమాను ఆస్కార్లకు పంపించాలని, కచ్చితంగా అవార్డులు గెలుచుకుంటుందని ఓ అభిమాని ట్వీట్ చేయగా కంగన స్పందించారు. ‘తన అసలు ముఖాన్ని చూపించినా, ఇతరులపై చేసే అణచివేతను గుర్తుచేసినా అమెరికా తట్టుకోలేదు. సిల్లీ ఆస్కార్లను వారి దగ్గరే ఉంచుకోమనండి. మనకు మన జాతీయ పురస్కారాలున్నాయి’ అని స్పష్టం చేశారు.

AP: గ్రామ, వార్డు వాలంటీర్లపై మంత్రి డీబీవీ స్వామి అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం వాలంటీర్లు ఎవరూ పని చేయట్లేదని స్పష్టం చేశారు. వారిని 2023 ఆగస్టు వరకే కొనసాగిస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తు చేశారు. ఆగస్టు తర్వాత వాలంటీర్ల పదవి పొడిగింపునకు జగన్ ప్రభుత్వం జీవో ఇవ్వలేదని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక వాలంటీర్లు విధుల్లో ఉండి ఉంటే రెగ్యులరైజ్ చేసేవాళ్లమని వివరించారు.

AP: పోలవరం ప్రాజెక్టు కోసం 2014 నుంచి ఇప్పటివరకు రూ.19,396 కోట్లు ఖర్చు చేశామని మంత్రి నిమ్మల రామానాయుడు అసెంబ్లీలో తెలిపారు. ఇందులో కేంద్రం రూ.17,860 కోట్లు చెల్లించిందన్నారు. తొలి దశ R&Rను 2026 జూన్ లోపు పూర్తి చేస్తామని చెప్పారు. పోలవరం ఎత్తును జగన్ హయాంలోనే రెండుగా విభజించారని, 41.15 మీటర్ల ఎత్తు ప్రతిపాదన పెట్టింది ఆయనేనని విమర్శించారు. పోలవరం ఎత్తును ఎందుకు తగ్గించారో జగన్‌నే అడగాలన్నారు.

తమ మిత్రదేశం పాకిస్థాన్‌కు చైనా మరో జలాంతర్గామిని అందించింది. 5 బిలియన్ డాలర్ల ఒప్పందంలో భాగంగా మొత్తం 8 హ్యాంగర్ క్లాస్ సబ్‌మెరైన్లను ఇస్లామాబాద్‌కు బీజింగ్ ఇవ్వాల్సి ఉండగా గతంలో ఒకటి ఇచ్చేసింది. ఈ రెండూ కాక అత్యాధునిక ఫ్రిగేట్ నౌకలు నాలుగింటిని కూడా సమకూర్చింది. అరేబియా సముద్రంలో భారత్‌ను అడ్డుకునేందుకు పాక్‌ను వాడుకోవాలనేది చైనా వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే పాక్ నేవీని బలోపేతం చేస్తోంది.

బాలీవుడ్ స్టార్ కిడ్స్ క్లోజ్ ఫ్రెండ్, ఇన్‌ఫ్లుయెన్సర్ ఒర్హాన్ అవత్రమణిపై JK పోలీసులు కేసు నమోదు చేశారు. మాతా వైష్ణోదేవీ యాత్రలో ఆయన మద్యం సేవించారు. నిషేధం ఉన్నా రష్యన్ సిటిజన్ అనస్టాలియా సహా మరో ఏడుగురితో కలిసి కాట్రాలోని హోటల్లో మద్యం తాగినట్టు రియాసీ పోలీసులు గుర్తించారు. BNSS 223 కింద FIR నమోదు చేశారు. Call Me Bae, MyFitness – Orry x Khali వంటి సిరీసులు, Nadaaniyan సినిమాలో ఆయన నటించారు.

వయసు పెరిగినా తాను స్ట్రాంగ్‌గానే ఉంటానని నటి విజయశాంతి అన్నారు. ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ టీజర్ రిలీజ్ ఈవెంట్లో ఆమె మాట్లాడారు. తన విషయంలో కళ్యాణ్ రామ్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పారు. ఈ సినిమాతో అభిమానులకు ఫుల్ మీల్స్ దొరుకుతుందన్నారు. తానే స్వయంగా ఫైట్ సీన్స్ చేసినట్లు పేర్కొన్నారు. అవి చూసి సెట్లో వారంతా షాక్ అయ్యారని తెలిపారు.
Sorry, no posts matched your criteria.