news

News March 17, 2025

బంగ్లా, రోహింగ్యాల నెట్‌వర్క్‌పై దర్యాప్తునకు సిద్ధమైన హోంశాఖ

image

అక్రమ వలసదారులు, వారు స్థిరపడేందుకు సాయపడుతున్న వారిపై దర్యాప్తునకు కేంద్ర హోంశాఖ సిద్ధమైంది. ఇప్పటికే ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా బంగ్లాదేశీయులు, రోహింగ్యాల గుర్తింపు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. NIA, పోలీసులు చాలామందిని అరెస్టు చేసి డిటెన్షన్ క్యాంపులకు తరలించారు. అసలు వారెలా దేశంలో చొరబడ్డారు, వారికి ఎవరు సాయం చేశారు, గుర్తింపు పత్రాలు ఎవరు ఇప్పించారన్న కోణంలో దర్యాప్తు చేపట్టనున్నారు.

News March 17, 2025

బట్టతలపై భార్య హేళన.. భర్త బలవన్మరణం

image

కర్ణాటకలోని చామరాజనగర ప్రాంతానికి చెందిన పరాశివమూర్తి, మమత భార్యాభర్తలు. పెళ్లినాటికే బట్టతల ఉన్నప్పటికీ మమత అతడిని వివాహం చేసుకుంది. కానీ పెళ్లయ్యాక మాత్రం ‘నీతో బయటికి వెళ్లాలంటే అవమానంగా ఉంటోంది. తలపై జుట్టూ లేదు చేతిలో డబ్బూ లేదు’ అంటూ నరకం చూపించేది. వరకట్నం కేసు పెట్టి అతడిని నెలన్నరపాటు జైలుకు పంపించింది. తాజాగా బెయిల్‌పై బయటికొచ్చిన మూర్తి, ఆ బాధల్ని తట్టుకోలేక తనువు చాలించాడు.

News March 17, 2025

మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి మాతృవియోగం

image

AP: వైసీపీ రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి ఎర్రం పిచ్చమ్మ(85) ఒంగోలులోని ఓ ఆసుపత్రిలో ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఆమె గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. మాతృమూర్తి మృతితో వైవీ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి.

News March 17, 2025

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు ఎక్కడా?: వైసీపీ

image

AP: అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తానని ప్రచారం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు గెలిచాక మాట మరచిపోయారని వైసీపీ విమర్శించింది. దేశంలో అన్నిరాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్రోల్, డీజిల్ రేట్లు అధికంగా పెరిగాయంది. అధికారంలోకి వచ్చి 10 నెలలు గడుస్తున్నా ఇంధన ధరల్ని కూటమి ప్రభుత్వం ఎందుకు తగ్గించట్లేదని X వేదికగా వైసీపీ ప్రశ్నించింది.

News March 17, 2025

పార్లమెంట్, అసెంబ్లీ ప్రాంగణాల్లో అరకు కాఫీ స్టాల్స్

image

పార్లమెంటు, AP అసెంబ్లీ ప్రాంగణాల్లో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు కానున్నాయి. స్పీకర్ ఓం బిర్లా అనుమతించిన నేపథ్యంలో నేటి నుంచి పార్లమెంటు ప్రాంగణంలో స్టాళ్లను ప్రారంభిస్తున్నామని గిరిజన సహకార సంస్థ అధికారులు వెల్లడించారు. ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులందరికీ ప్రత్యేక గిఫ్ట్ ప్యాక్‌లను ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇక AP అసెంబ్లీ ప్రాంగణంలో మరో రెండు రోజుల్లో స్టాల్స్ ఏర్పాటయ్యే అవకాశం ఉంది.

News March 17, 2025

రాష్ట్రానికి రూ.1,698 కోట్లు ఇవ్వనున్న కేంద్రం

image

TG: రాష్ట్రానికి సమగ్ర శిక్ష స్కీమ్ కింద 2025-26 విద్యాసంవత్సరానికి గానూ రూ.1,698 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. 2024-25లో రూ.1,930 కోట్లు ఇవ్వగా ఈ సారి రూ.230 కోట్లు కోత పెట్టింది. దీంతో మరో రూ.300 కోట్లు ఇవ్వాలని అధికారులు కేంద్రాన్ని కోరినా ఒప్పుకోనట్లు తెలుస్తోంది.

News March 17, 2025

విద్యుత్ సంస్థల గుడ్ న్యూస్.. ట్రూడౌన్‌కు ప్రతిపాదన

image

AP: రాష్ట్ర ప్రజలకు విద్యుత్ సంస్థలు గుడ్ న్యూస్ చెప్పాయి. రూ.1,059 కోట్లు డిస్కంలకు సర్దుబాటు చేయాలని ఐదేళ్ల తర్వాత ట్రాన్స్‌కో APERCలో పిటిషన్ దాఖలు చేసింది. 2019-24 మధ్య పెట్టుబడి వ్యయం కింద వివిధ పనులకు APERC అనుమతించిన ఖర్చు, వాస్తవ ఖర్చు మధ్య వ్యత్యాసాన్ని ట్రూడౌన్ కింద సర్దుబాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ మేరకు వినియోగదారులకు కరెంట్ ఛార్జీలు తగ్గే అవకాశం ఉంటుంది.

News March 17, 2025

నేడు వార్డెన్ పోస్టుల తుది జాబితా

image

TG: సంక్షేమ హాస్టళ్లలో 581 అధికారుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను నేడు టీజీపీఎస్సీ వెల్లడించనుంది. గత ఏడాది జూన్ 24 నుంచి 29 వరకు ఆన్‌లైన్ విధానంలో (సీబీఆర్టీ) నిర్వహించిన పరీక్షలకు 82,873 మంది హాజరయ్యారు. కమిషన్ ఇప్పటికే ఫలితాలను వెల్లడించి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసింది. ఇటీవల గ్రూప్-1, 2, 3 జనరల్ ర్యాంకింగ్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

News March 17, 2025

Stock Markets: భారీ లాభాల్లో మొదలవుతాయా!

image

దేశీయ స్టాక్‌మార్కెట్లు రేంజుబౌండ్ నుంచి పాజిటివ్‌గా మొదలవ్వొచ్చు. గిఫ్ట్‌నిఫ్టీ 150 పాయింట్ల లాభంతో ట్రేడవుతుండటం దీనినే సూచిస్తోంది. జకార్తా మినహా ఆసియా మేజర్ సూచీలన్నీ ఎగిశాయి. నిఫ్టీ రెసిస్టెన్సీ 22,513, సపోర్టు 22,375 వద్ద ఉన్నాయి. మెటల్, కమోడిటీస్, చమురు, CPSE, ఎనర్జీ, ఇన్ఫ్రా రంగాల్లో మూమెంటమ్ కనిపిస్తోంది. Stocks to Focus: ఇండస్‌ఇండ్, KEC, వెల్‌స్పన్, ఆల్కెమ్, శిల్పా మెడికేర్, Dr రెడ్డీస్

News March 17, 2025

పరీక్షలే జీవితం కాదు.. ఆల్ ది బెస్ట్: హోంమంత్రి

image

AP: పబ్లిక్ పరీక్షల వేళ విద్యార్థులు టెన్షన్ పడొద్దని హోంమంత్రి అనిత సూచించారు. ‘జీవితంలో పదోతరగతి పరీక్షలు కీలకమే. కానీ అవే జీవితం కాదు. ఏడాదిపాటు నిద్రపోకుండా చదివిన మీ కష్టాన్ని ప్రతిబింబించేలా ప్రతి ప్రశ్నకు నైపుణ్యంతో జవాబు రాయండి. కేంద్రానికి ముందుగానే వెళ్లి మనసుని ప్రశాంతంగా ఉంచుకుని పరీక్షలు బాగా రాయండి. ఆల్ ది బెస్ట్’ అని ట్వీట్ చేశారు.