news

News January 7, 2025

పాస్‌పోర్ట్ కోసం హైకోర్టులో జగన్ పిటిషన్

image

AP: లండన్ పర్యటనకు అనుమతి కోరుతూ CBI కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన YCP చీఫ్ జగన్ తాజాగా హైకోర్టునూ ఆశ్రయించారు. తన కుమార్తె డిగ్రీ ప్రదానోత్సవం కార్యక్రమానికి వెళ్లాల్సి ఉందన్నారు. అందువల్ల తాజా పాస్‌పోర్ట్ కోసం NOC ఇచ్చేలా విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టును ఆదేశించాలని కోరారు. దీంతో న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు.

News January 7, 2025

CHECK: ఈ లిస్టులో మీ పేరుందా?

image

AP, TGకి సంబంధించి ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ-2025 తుది జాబితాను ఎన్నికల కమిషనర్లు నిన్న ప్రకటించారు. APలో మొత్తం 4,14,40,447 మంది ఓటర్లుండగా కొత్తగా 5.14 లక్షల మంది చేరారు. TGలో మొత్తం 3,35,27,925 మంది ఓటర్లుండగా కొత్తగా 2.19 లక్షల మంది నమోదయ్యారు. వీరికి త్వరలోనే పోస్టు ద్వారా ఎపిక్ కార్డులను అందజేయనున్నారు. కాగా ఫైనల్ <>జాబితాలో<<>> మీ పేరును చెక్ చేసుకోండి.

News January 7, 2025

రాష్ట్రంలో పెరిగిన సముద్ర తీరం

image

AP: 1970 లెక్కలతో పోల్చితే రాష్ట్ర సముద్రతీరం పొడవు పెరిగింది. గతంలో 973.7కి.మీ. ఉన్న సాగర తీరం 8.15శాతం పెరిగి 1053.07కి.మీలకు చేరినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. మలుపులు, ఒంపులనూ లెక్కించడంతో తీరం పొడవు పెరిగింది. దీంతో మన రాష్ట్రం దేశంలోనే మూడో స్థానం(గతంలో 2వస్థానం)లో నిలిచింది. అటు 2,340.62 కి.మీలతో గుజరాత్ దేశంలోనే తొలిస్థానం, 1068.69 కి.మీ.లతో తమిళనాడు 2వ స్థానంలో నిలిచాయి.

News January 7, 2025

12న అరకులో సుప్రీం జడ్జిల బృందం పర్యటన

image

AP: పర్యాటక ప్రాంతం అరకులో ఈ నెల 12న సుప్రీంకోర్టు జడ్జిలు పర్యటించనున్నారు. CJI, 25మంది జడ్జిలు, రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి రానుండటంతో అల్లూరి జిల్లా జేసీ ఏర్పాట్లు చేస్తున్నారు. వారు ఆదివారం విశాఖ నుంచి రైలులో బయలుదేరి ఉ.10.30కు అరకులోయకు చేరుకుంటారు. హరిత వేలీ రిసార్టులో విశ్రాంతి అనంతరం గిరిజన మ్యూజియం, గిరి గ్రామదర్శిని, అనంతగిరి కాఫీ తోటలు, బొర్రా గుహలు సందర్శిస్తారని జేసీ తెలిపారు.

News January 7, 2025

శుక్రవారం నుంచే స్కూళ్లకు సంక్రాంతి సెలవులు

image

AP: రాష్ట్రంలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ముందుగా ప్రకటించినట్లుగానే ఈనెల 10(శుక్రవారం) నుంచి హాలిడేస్ ప్రారంభం అవుతాయని తెలిపింది. సెలవులు 19న ముగిసి, 20 నుంచి పాఠశాలలు పున:ప్రారంభం అవుతాయని పేర్కొంది. అటు క్రిస్టియన్ స్కూళ్లకు మాత్రం 11 నుంచి 15 వరకు హాలిడేస్ ఉంటాయని వెల్లడించింది. కాగా సంక్రాంతి సెలవులు కుదిస్తారని తొలుత ప్రచారం జరిగింది.

News January 7, 2025

కరవు మండలాల్లో కేంద్ర బృందం పర్యటన రేపటి నుంచి..

image

AP: రాష్ట్రంలోని కరవు మండలాల్లో రేపటి నుంచి కేంద్ర బృందం పర్యటించనుంది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో రేపు, ఎల్లుండి పర్యటించి కరవు పరిస్థితులను తెలుసుకోనుంది. అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లోని 27మండలాల్లో తీవ్ర కరవు, మరో 27మండలాల్లో మధ్యస్థ కరవు పరిస్థితులు ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. అధికారులు 3బృందాలుగా విడిపోయి పర్యటించనున్నారు.

News January 7, 2025

వాలంటీర్లు వద్దే వద్దు: నిరుద్యోగ జేఏసీ

image

AP: వాలంటీర్లను అడ్డం పెట్టుకొని వైసీపీ కార్యక్రమాలు నిర్వహించిందని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్ధిక్ అన్నారు. ఆ వ్యవస్థను తిరిగి ప్రవేశపెట్టొద్దని ఆయన డిమాండ్ చేశారు. YCP హయాంలో వాలంటీర్లకు చెల్లించిన రూ.700కోట్లను మాజీ CM జగన్ నుంచి రాబట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. వారికి డబ్బులిచ్చి ప్రజాధనం వృథా చేస్తున్నట్లు గతంలోనే హైకోర్టులో పిల్ దాఖలు చేసినట్లు సిద్ధిక్ గుర్తుచేశారు.

News January 7, 2025

hMP వైరస్ వ్యాప్తి.. గాంధీ ఆసుపత్రి సిద్ధం!

image

TG: hMPV కరోనా అంత ప్రమాదకరం కాదని గాంధీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఇది సాధారణ ఇన్‌ఫ్లూయెంజా మాత్రమేనని, 4 నుంచి 7 రోజుల్లో తగ్గిపోతుందన్నారు. అటు బాధితులకు గాంధీలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. సుమారు 600 ఆక్సిజన్ బెడ్స్, 450కి పైగా వెంటిలేటర్లు, 400 మానిటర్లు, 40వేల కి.లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు, వందలాది ఆక్సిజన్ సిలిండర్లు, పీడియాట్రిక్ వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయన్నారు.

News January 7, 2025

ఇంగ్లండ్‌తో సిరీస్.. బుమ్రాకు రెస్ట్!

image

ఈనెల 22 నుంచి ఇంగ్లండ్‌ ప్రారంభమయ్యే సిరీస్‌కు భారత స్టార్ పేసర్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అతడిపై విపరీతమైన పనిభారం పడటమే అందుకు కారణం. గత 4 నెలల్లో బుమ్రా 10 టెస్టులు ఆడారు. BGTలో మొత్తం 150 ఓవర్లు వేయగా.. మెల్‌బోర్న్ టెస్టులోనే 53.2 ఓవర్లు బౌలింగ్ చేశారు. ఇప్పటికే బుమ్రా AUSతో చివరి టెస్ట్‌లో గాయపడ్డారు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్ధమయ్యేందుకు అతడికి విశ్రాంతి ఇవ్వనున్నారు.

News January 7, 2025

hMPV గురించి సౌమ్య స్వామినాథన్ ఏమన్నారంటే?

image

ప్రస్తుతం భారత్‌లో వ్యాపిస్తున్న hMP వైరస్ గురించి ఆందోళన వద్దని WHO మాజీ చీఫ్ సైంటిస్ట్ డా.సౌమ్య స్వామినాథన్ తెలిపారు. ఇది కొత్తగా వచ్చిందేమీ కాదని, గతంలోనే ఉందన్నారు. ఈ వైరస్ వల్ల రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందని, జలుబు చేసినప్పుడు నార్మల్‌గా తీసుకునే అన్ని జాగ్రత్తలు తీసుకుంటే దీని నుంచి బయటపడొచ్చని వెల్లడించారు. కాగా 2019లో కరోనా సమయంలో సౌమ్య WHOలో చీఫ్ సైంటిస్ట్‌గా పనిచేశారు.