news

News March 16, 2025

శ్రీశైలంలో ఆన్‌లైన్ గదుల పేరుతో భక్తులకు టోకరా..!

image

AP: శ్రీశైలం క్షేత్రంలో ఆన్‌లైన్ మోసగాళ్లు వసతి గదుల పేరుతో నకిలీ వెబ్‌సైట్‌లు సృష్టించి భక్తులను మోసం చేస్తున్నారు. ఒక భక్తుడు మల్లికార్జున సదన్ పేరుతో ఉన్నవెబ్‌సైట్‌లో గదులు బుక్ చేసుకున్నారు. దీనికిగాను రూ.7000 చెల్లించాడు. తీరా గదుల కోసం విచారించగా నకిలీదని తేలింది. హైదరాబాద్‌కు చెందిన మరో వ్యక్తి ఈ విధంగానే మోసపోయాడు. అధికారులు స్పందించి మోసాలను అరికట్టాలని భక్తులు కోరుతున్నారు.

News March 16, 2025

IPL: ఆ జట్టుకు బ్యాడ్ న్యూస్

image

మరో వారంలో ఐపీఎల్ ప్రారంభం కానుండగా రాజస్థాన్ రాయల్స్‌కు షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్‌కు బెంగళూరులోని ఎన్సీఏ ఇంకా క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. దీంతో 23న SRHతో మ్యాచుకు ఆయన దూరమయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఆడినా బ్యాటింగ్ మాత్రమే చేస్తారు. వికెట్ కీపింగ్ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. లేదంటే ఆయన స్థానంలో ధ్రువ్ జురెల్ బరిలోకి దిగొచ్చని వార్తలు వస్తున్నాయి.

News March 16, 2025

కమెడియన్లతో నటించేందుకు ఇష్టపడరు: సప్తగిరి

image

కమెడియన్లతో నటించేందుకు హీరోయిన్లు ఇష్టపడరని నటుడు సప్తగిరి అన్నారు. తాను ప్రధాన పాత్రలో నటించిన ‘పెళ్లి కాని ప్రసాద్’ మూవీ ప్రమోషన్లలో ఆయన మాట్లాడారు. ‘కమెడియన్ల పక్కన హీరోయిన్లు దొరకడం కష్టం. చాలా మంది కమెడియన్ పక్కనా? అంటారు. తన పక్కన నటించడానికి ఒప్పుకున్న ప్రియాంక శర్మకు ధన్యవాదాలు’ అని తెలిపారు. అలాగే, సినిమా వాళ్లకు ఎంత పేరొచ్చినా, మంచి అలవాట్లు ఉన్నా పిల్లను ఇవ్వరని తెలిపారు.

News March 16, 2025

ఈ రోజు నమాజ్ వేళలు

image

మార్చి 16, ఆదివారం ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు సూర్యోదయం: ఉదయం 6.23 గంటలకు దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు అసర్: సాయంత్రం 4.45 గంటలకు మఘ్రిబ్: సాయంత్రం 6.26 గంటలకు ఇష: రాత్రి 7.38 గంటలకు NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News March 16, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి

News March 16, 2025

మార్చి 16: చరిత్రలో ఈరోజు

image

*1764: తెలుగు భాష తొలి నిఘంటు కర్త మామిడి వెంకటాచార్యులు జననం * 1901: ప్రత్యేకాంధ్ర కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు జననం *1917 ఆంధ్రప్రదేశ్ మెుదటి లోకాయుక్త ఆవుల సాంబశివరావు జననం *1963: భారత దేశ రెండవ ప్రధాన న్యాయమూర్తి ఎం. పతంజలి శాస్త్రి మరణం * 1993: ముంబైలో బాంబు పేలుళ్లు *1995: జాతీయ టీకా దినోత్సవం

News March 16, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News March 16, 2025

శుభ ముహూర్తం (16-03-2025)

image

☛ తిథి: బహుళ విదియ మ.2.51 వరకు తదుపరి తదియ
☛ నక్షత్రం: హస్త ఉ.10.05 తదుపరి చిత్త
☛ శుభ సమయం: ఉ.08.06 నుంచి 8.44 వరకు మ.2.32 నుంచి 2.44 వరకు
☛ రాహుకాలం: సా.4.30 నుంచి 6.00 వరకు
☛ యమగండం: మ12నుంచి 1.30 వరకు
☛1.దుర్ముహూర్తం: సా.4.25 నుంచి 5.13వరకు
☛ వర్జ్యం: సా.6.56నుంచి 8.42 వరకు
☛ అమృత ఘడియలు: తె.5.35

News March 16, 2025

TODAY HEADLINES

image

* రాష్ట్రం కోసం ఎన్ని సార్లైనా ఢిల్లీ వెళ్తా: రేవంత్
* BRS కంటే మా పాలనలోనే ఎక్కువ రుణమాఫీ: భట్టి
* కాంగ్రెస్ పాలన దేశ చరిత్రలోనే మాయని మచ్చ: KTR
* హిందీని నేనెప్పుడూ వ్యతిరేకించలేదు: పవన్
* కోటరీ వల్ల రాజూ పోయేవాడు.. రాజ్యమూ పోయేది: VSR
* గుంటూరు మేయర్ మనోహర్ రాజీనామా
* తగ్గిన బంగారం ధరలు
* హమాస్‌కు మద్దతు.. USలో భారతీయ విద్యార్థిని వీసా రద్దు

News March 16, 2025

Congratulations: ముంబైదే WPL ట్రోఫీ

image

ఉత్కంఠ పోరులో WPL టైటిల్‌ను ముంబై గెలిచింది. 8 పరుగుల తేడాతో ఢిల్లీపై విజయం సాధించి మూడేళ్ల లీగ్ చరిత్రలో రెండో‌సారి కప్ అందుకుంది. ముంబై నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 9 వికెట్లు కోల్పోయి 141 పరుగులే చేయగలిగింది. నికీ ప్రసాద్ (25*)పోరాడినా ఫలితం లేకపోయింది. కాప్ 40 పరుగులతో రాణించారు. బ్రంట్ 3 వికెట్లతో సత్తా చాటారు. 2023లోనూ ముంబై కప్ గెలిచిన విషయం తెలిసిందే.