news

News March 15, 2025

ఆయుర్దాయం పెరగాలంటే ఇలా చేయండి!

image

ఫ్యామిలీతో కలిసి ఎక్కువకాలం బతకాలని అందరూ కోరుకుంటారు. ఇది సాధ్యం కావాలంటే కొన్ని పనులు చేయాలని నిపుణులు చెబుతున్నారు. కడుపులో 80 శాతం నిండినంత వరకే తినాలి. టీవీ, ఫోన్ చూడకుండా నెమ్మదిగా కింద కూర్చునే తినాలి. హెర్బల్ టీ తాగాలి. రోజూ 7-8 గంటలు నిద్రపోవాలి. సమీపంలోని ప్రదేశాలకు నడక ద్వారానే వెళ్లాలి. క్రమం తప్పకుండా హెల్త్ చెకప్ చేయించుకుని వ్యాధులను గుర్తించి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.

News March 15, 2025

వాళ్లే జనసేన MLAలు: అంబటి రాంబాబు

image

AP: తన సిద్ధాంతం ఏంటో తెలియని స్థితిలో Dy.CM పవన్ ఉన్నారని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ‘పవన్ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు. 21 సీట్లు గెలిచి 100% స్ట్రైక్‌రేట్ అని మాట్లాడుతున్నారు. గెలిచిన వారిలో అసలైన జనసేన నేతలు ఎంతమంది? YCP టికెట్ రాని, చంద్రబాబు మనుషులే జనసేన MLAలు. 2 పార్టీలు వాపును చూసి బలం అనుకుంటున్నాయి. జనసేన MLAలు దోపిడీ చేస్తుంటే పవన్ చుక్కలు లెక్కబెడుతున్నారు’ అని విమర్శించారు.

News March 15, 2025

రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

image

TG: గోషామహల్ BJP MLA రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో BJP అధికారంలోకి వస్తే MIM పార్టీ అధినేత అసుదుద్దీన్ ఒవైసీ దేశాన్ని వదిలిపోయేలా చేస్తానని హెచ్చరించారు. ‘లేదంటే BJPలో చేరతానని మా నేతల కాళ్లు పట్టుకునేలా చేస్తాను. హోలీ జరగనివ్వకూడదని, నగరంలో హింస సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. సీఎం రేవంత్ ఆయనకు మెంటల్ హాస్పిటల్లో చికిత్స ఇప్పించాలి’ అని సూచించారు.

News March 15, 2025

వాళ్లకు కరెంట్, నీళ్లు కట్: సీఎం రేవంత్ హెచ్చరిక

image

TG: రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు CM రేవంత్ అన్నారు. డ్రగ్స్ కేసులో పట్టుబడిన వారి ఇళ్లకు కరెంట్, నీళ్లు కట్ చేస్తామని హెచ్చరించారు. మాదక ద్రవ్యాల విషయంలో ఎంతపెద్ద వారున్నా వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. ఫాంహౌస్‌లలో డ్రగ్స్ పార్టీలపై ఎప్పటికప్పుడు దాడులు చేస్తున్నామని వెల్లడించారు. కాలేజీల్లో గంజాయి, డ్రగ్స్ నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం వివరించారు.

News March 15, 2025

క్రోమ్ యూజర్లకు అర్జెంట్ వార్నింగ్!

image

గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను తక్షణమే అప్డేట్ చేసుకోవాలని యూజర్లకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. అందులో రెండు వల్నరబిలిటీస్‌ను గమనించామని CERT-In తెలిపింది. లేటెస్ట్ వెర్షన్‌కు అప్డేట్ అవ్వకపోతే రిమోట్ ఏరియాస్ నుంచి సైబర్ క్రిమినల్స్ అటాక్ చేసేందుకు అవకాశముందని తీవ్ర వార్నింగ్ ఇచ్చింది. ఒక ఆర్బిట్రారీ కోడ్‌ను పంపించి మోసగించొచ్చని, వ్యక్తిగత సమాచారం దొంగిలించొచ్చని వెల్లడించింది.

News March 15, 2025

గిరిజనేతర మహిళతో పెళ్లి.. మాజీ ఎంపీకి షాక్!

image

ఒడిశాలోని బీజేడీ నేత, మాజీ ఎంపీ ప్రదీప్ మాఝీకి షాక్ తగిలింది. గిరిజనేతర అగ్రకుల మహిళను ఆయన పెళ్లి చేసుకోవడాన్ని నేరంగా పరిగణించిన ఆయన తెగ ‘భటారా సమాజ్‌’ ప్రదీప్‌ను వెలివేస్తున్నట్లు ప్రకటించింది. తమ సమావేశంలో ఆ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. తెగ నిబంధనల్ని ఆయన ఉల్లంఘించారని, అందుకే వెలివేయాల్సి వస్తోందని వివరించింది. ప్రదీప్ 2009లో కాంగ్రెస్ ఎంపీగా గెలుపొందారు.

News March 15, 2025

ఆ బ్యాంకు డిపాజిటర్లు భయపడొద్దు: RBI

image

ఇండస్‌ఇండ్ బ్యాంకుపై వదంతులను RBI కొట్టిపారేసింది. ‘డిపాజిటర్లు వాటిని నమ్మొద్దు. భయపడాల్సిన అవసరం లేదు. బ్యాంకు ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంది. తగినంత మూలధనమూ ఉంది. ఇప్పటికే మా ఎక్స్‌టర్నల్ ఆడిట్ టీమ్‌తో కలిసి A/Cను బ్యాంకు సమగ్రంగా సమీక్షిస్తోంది’ అని తెలిపింది. బ్యాంకు డెరివేటివ్ పోర్టుఫోలియోలో Rs1580 CR అవకతవకలు జరగడం, మొత్తం నెట్‌వర్త్‌పై దాని ప్రభావం 2.35% ఉంటుందన్న వార్తలపై స్పందించింది.

News March 15, 2025

హిందీపై పవన్ కామెంట్స్.. జనసేన శతఘ్ని క్లారిటీ

image

గతంలో పవన్ హిందీని వ్యతిరేకించారని జరుగుతున్న ప్రచారంపై జనసేన శతఘ్ని టీమ్ క్లారిటీ ఇచ్చింది. ‘పవన్ హిందీని మాత్రమే నేర్చుకోవాలనే నిబంధనను వ్యతిరేకించారు. త్రిభాషా విధానంలో హిందీని కచ్చితంగా అమలు చేయాలనే రూల్ లేదు. NEP-2020 ప్రకారం విద్యార్థులు మాతృభాషతో పాటు ఏదైనా భారతీయ భాష, విదేశీ భాష నేర్చుకునే సౌలభ్యం ఉంది. రాజకీయాల కోసం హిందీని రుద్దుతున్నారనే ప్రచారం చేస్తున్నారు’ అని ట్వీట్ చేసింది.

News March 15, 2025

గ్రహాంతరవాసులపై షాకింగ్ విషయాలు

image

గ్రహాంతరవాసులున్నారా అన్న ప్రశ్నకు అమెరికా మాజీ నిఘా, సైనికాధికారులు ‘ది ఏజ్ ఆఫ్ డిస్‌క్లోజర్’ అనే డాక్యుమెంటరీలో సంచలన విషయాలు వెల్లడించారు. ‘1940ల నాటి నుంచీ గ్రహాంతరవాసులు గుర్తుతెలియని ఎగిరే వాహనాల్లో(UAP) భూమిపైకి వస్తున్నారు. మన సాంకేతిక పురోగతిని పరిశీలిస్తున్నారు. వారు వచ్చే వాహనాలు గంటకు 50వేల కి.మీ పైగా వేగంతో ప్రయాణిస్తున్నాయి. వాటిని మానవమాత్రులు తయారుచేయలేరు’ అని స్పష్టం చేశారు.

News March 15, 2025

బస్సులు, మెట్రో వినియోగం పెరగాలి: CM రేవంత్

image

TG: హైదరాబాద్‌లో రోజురోజుకూ ట్రాఫిక్ సమస్య పెరుగుతోందని CM రేవంత్ అన్నారు. ‘నగరంలో రోజుకు 1,600 వాహనాలు కొత్తగా రోడ్ల మీదకు వస్తున్నాయి. వాటి రిజిస్ట్రేషన్లతో ఆదాయం వస్తున్నా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. HYDలో ఒక వ్యక్తి వెళ్లినా ప్రత్యేకంగా కారులోనే వెళ్తున్నారు. బస్సులు, మెట్రోను ఉపయోగించుకునే వారి సంఖ్య పెరగాలి. దిల్లీలో కాలుష్యం పెరిగి విద్యాసంస్థలు, కార్యాలయాలు మూసివేశారు’ అని గుర్తుచేశారు.