India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: హైడ్రా సైలెంట్ కాలేదని, మరింత బలోపేతం అవుతోందని హైడ్రా ఏర్పడి వందరోజులైన సందర్భంగా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఇకపై పక్కా ప్లాన్, ఆధారాలతో ముందడుగు వేస్తామన్నారు. త్వరలోనే చెరువులన్నింటికీ FTL, బఫర్ జోన్లు ఫిక్స్ చేస్తామని చెప్పారు. గడిచిన వంద రోజుల్లో ఆక్రమణదారులకు హైడ్రా సింహస్వప్నంలా మారిందని రంగనాథ్ వ్యాఖ్యానించారు. ప్రజలు కూడా అన్నీ చెక్ చేసుకున్నాకే స్థలాలు కొంటున్నారని తెలిపారు.
దీపావళి పండుగకు ముందు వంటనూనెల ధరలు అమాంతం పెరిగాయి. గత నెలలో ₹100గా ఉన్న లీటర్ పామాయిల్ ధర ₹137కి చేరగా, సోయాబీన్ ₹120 నుంచి ₹148, సన్‌ఫ్లవర్ ₹120 నుంచి ₹149, ఆవ నూనె ₹140 నుంచి ₹181, వేరుశనగ నూనె ₹180 నుంచి ₹184 మేర పెరిగాయి. దేశీయంగా నూనె గింజల సాగు పెద్దగా లేకపోవడం, దిగుమతి సుంకాల పెంపుతో ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. కొత్త పంట వచ్చే వరకూ ధరలు దిగిరావని అంచనా వేస్తున్నారు.
నవంబర్ 4 నుంచి తెలంగాణ ప్రభుత్వం కులగణన చేపట్టనుంది. 80వేల మంది ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తారు. ప్రతి ఎన్యుమరేటర్ 150 ఇళ్లలో సర్వే చేయనుండగా, NOV 19 వరకు ఇది కొనసాగుతుంది. మొత్తం 7 పేజీలలో 54 ప్రశ్నలతో ఫార్మాట్ రూపొందించారు. ఆధార్, కుటుంబ సభ్యుల వివరాలు, చదువు, వృత్తి, ఆస్తులు, రిజర్వేషన్లతో పొందిన ప్రయోజనాలు, ధరణి, రాజకీయ నేపథ్యం, బ్యాంక్ ఖాతా సహా మరిన్ని వివరాలు సేకరిస్తారు.
పచ్చని కొండలు, కృష్ణమ్మ పరవళ్లు, నల్లమల అటవీ ప్రాంతం గుండా ఆహ్లాదకరంగా సాగే నాగార్జున సాగర్-శ్రీశైలం లాంచీ ప్రయాణం NOV 2 నుంచి పునః ప్రారంభం కానుంది. ఒకవైపు టికెట్ ధర పెద్దలకు ₹2,000, పిల్లలకు ₹1,600గా నిర్ణయించారు. వెళ్లి రావడానికి పెద్దలకు ₹3,000, పిల్లలకు ₹2,400 చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు 7997951023, 9848540371, 9848125720 నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు.
పోలీస్ శాఖలో సివిల్, ఆర్మ్‌డ్ రిజర్వ్(AR), స్పెషల్ పోలీస్ విభాగాలున్నాయి. పోలీస్ స్టేషన్లలో ఉంటూ నేర విచారణ, శాంతిభద్రతల పరిరక్షణ విధులను సివిల్ పోలీసులు చేస్తుండగా, వారికి AR సిబ్బంది బందోబస్తు ఇస్తారు. స్పెషల్ పోలీసులు స్టేషన్ బయట శాంతిభద్రతల విధులు, ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల విధులు నిర్వహిస్తారు. తమను ఐదేళ్లలో AR, మరో ఐదేళ్లలో సివిల్ కానిస్టేబుళ్లుగా మార్చాలని TGSP సిబ్బంది కోరుతున్నారు.
TG: రాష్ట్ర స్పెషల్ పోలీస్(TGSP) కానిస్టేబుళ్లు ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. సివిల్ పోలీసుల మాదిరి 3-5ఏళ్లు ఒకే చోట పనిచేయించాలని, స్థానికత ఆధారంగా పోస్టింగ్ ఇవ్వాలని, ఏక్ స్టేట్- ఏక్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నారు. 15రోజులు డ్యూటీ చేస్తే 4రోజులు సెలవుల విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసి 26రోజుల డ్యూటీకి 4రోజుల సెలవును ప్రకటించింది. ఆందోళనలతో ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకుంది.
AP: ఈ నెలాఖరు నుంచి ఉచిత గ్యాస్ <<14449463>>సిలిండర్<<>> పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గ్యాస్ కనెక్షన్‌తోపాటు రేషన్, ఆధార్ కార్డులను ప్రాతిపదికగా నిర్ణయిస్తూ ఉత్తర్వులిచ్చింది. తొలుత పూర్తి సొమ్ము చెల్లిస్తే 2 రోజుల తర్వాత ప్రభుత్వం లబ్ధిదారుని ఖాతాలో తిరిగి జమ చేస్తుంది. OCT 31 నుంచి మార్చి వరకు మొదటి సిలిండర్ పంపిణీకి ఖర్చయ్యే రూ.895 కోట్లను చెక్కు రూపంలో సీఎం CBN విడుదల చేయనున్నారు.
TG: రాష్ట్రంలో కొత్తగా విధుల్లో చేరిన 10వేల మంది టీచర్లకు జీతాల చెల్లింపుపై నెలకొన్న సందిగ్ధతకు ప్రభుత్వం తెరదించింది. అపాయింట్‌మెంట్ ఆర్డర్ ఇచ్చిన ఈ నెల 10వ తేదీని ప్రాతిపదికగా తీసుకుంటామని తెలిపింది. టీచర్లు ఆ తేదీన విధుల్లో చేరి ఉండాలంది. కౌన్సెలింగ్ ఆలస్యమవడంతో ఆలస్యంగా రిపోర్టు చేసిన వారికి ఆయా తేదీల నుంచి జీతం ఇస్తామని పేర్కొంది.
AP: ఈ నెల 3 నుంచి 21 వరకు జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్షల ఫైనల్ కీ నేడు విడుదల కానుంది. https://aptet.apcfss.in/ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నవంబర్ 2న తుది ఫలితాలను అధికారులు రిలీజ్ చేస్తారు. ఈసారి టెట్‌కు 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా 3,68,661 (86.28 శాతం) మంది హాజరయ్యారు.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ప్రతీకార దాడులపై భారత ప్రభుత్వం స్పందించింది. ‘పశ్చిమాసియాలో పరిణామాలను మేం పరిశీలిస్తున్నాం. ఇరు దేశాలు సంయమనం పాటించి దౌత్య మార్గాలపై దృష్టిసారించాలి. ఉద్రిక్తతలు, శత్రుత్వాలతో ఎవరికీ ప్రయోజనం ఉండదు. అమాయక పౌరులు, బందీలు బాధపడుతూనే ఉంటారు’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ ఓ ప్రకటన విడుదల చేశారు.
Sorry, no posts matched your criteria.