India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: అంగన్వాడీ కేంద్రాలను రేపటి నుంచి ఒంటిపూట నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎండల తీవ్రత పెరగడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కేంద్రాలు నిర్వహించాలని ఉత్తర్వులిచ్చింది. అటు పాఠశాలలు కూడా రేపటి నుంచి ఒంటిపూట నడవనున్నాయి.

ఈనెల 24, 25 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు దిగనున్నట్లు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(UFBU) ప్రకటించింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(IBA)తో జరిగిన చర్చలు విఫలమవడంతో సమ్మె నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. దీంతో ఆ 2 రోజులు బ్యాంకులు బంద్ అయ్యే అవకాశం ఉంది. అన్ని క్యాడర్లలో నియామకాలు, వారంలో 5 రోజుల పని తదితర డిమాండ్ల సాధనకు UFBU సమ్మె చేస్తోంది.

ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా’ సినిమా ఇప్పటివరకు రూ.550 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. హిందీలో 4 వారాల్లో రూ.540.38 కోట్లు, తెలుగులో తొలి వారంలో రూ.11.80 కోట్లు వసూలు చేసింది. హోలీ హాలిడే, వీకెండ్ కావడంతో ఈ మూడు రోజుల్లో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశముందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. విక్కీ కౌశల్, రష్మిక నటించిన ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు.

AP: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికైన జనసేన నేత నాగబాబుకు ఆయన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘తొలిసారి ఏపీ శాసనమండలిలో అడుగుపెట్టబోతున్న నా తమ్ముడు నాగేంద్రబాబుకు అభినందనలు, ఆశీస్సులు. ప్రజా సమస్యలపై గళం విప్పుతూ, వారి అభివృద్ధికి ఎల్లప్పుడూ పాటుపడుతూ విజయం సాధించాలి. ప్రజల అభిమానాన్ని మరింతగా చూరగొనాలి’ అని చిరు ట్వీట్ చేశారు.

హోలీ పండుగ వేళ పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు మూడు ఆటోలను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. వీరిలో ముగ్గురు మహిళలు, ఓ చిన్నారి ఉంది. మరో 8 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

<<15652905>>బంగారం స్మగ్లింగ్ కేసులో <<>>అరెస్టైన కన్నడ నటి రన్యారావు బెయిల్ పిటిషన్‌ను బెంగళూరు ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. ఆమెపై నమోదైన కేసులు చాలా తీవ్రమైనవంటూ DRI న్యాయవాది చేసిన వాదనలతో ఏకీభవించింది. ఈ కేసులో పలువురు బడాబాబులు ఆమె వెనుక ఉన్నారన్న అనుమానాలున్నాయి. దీంతో రన్యా ఎవరి పేరు చెబుతారోనని బ్యూరోక్రాట్లు, బడా రాజకీయ నేతల్లో గుబులు నెలకొన్నట్లు కర్ణాటక రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

టీవీ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ని అమితాబ్ బచ్చన్ వదిలేస్తున్నారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం నడుస్తోంది. దానిపై 16వ సీజన్ చివరి ఎపిసోడ్‌లో బచ్చన్ క్లారిటీ ఇచ్చేశారు. ‘హోస్ట్‌గా ఆడియన్స్ నుంచి నాకు చాలా మద్దతు లభించింది. వచ్చే సీజన్‌లో మిమ్మల్ని మళ్లీ కలుస్తాను. మీ కష్టాన్ని నమ్ముకోండి. కలల్ని సజీవంగా ఉంచుకోండి’ అని ముగించారు. మళ్లీ బచ్చనే ఉంటారని తెలియడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు.

మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(MPSC) పరీక్షలన్నింటినీ మరాఠీలోనే నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆ రాష్ట్ర CM ఫడణవీస్ ప్రకటించారు. ‘ఇంజినీరింగ్ కోర్సులు సహా అన్ని సాంకేతిక సబ్జెక్టులూ మరాఠీలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. MPSC పరీక్షల మరాఠీ నిర్వహణ విషయంలో ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం’ అని శాసనమండలిలో తెలిపారు. ఇంగ్లిష్ మాట్లాడలేని విద్యార్థుల కోసం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

భార్య తన సెక్స్ లైఫ్ గురించి పరపురుషులతో చాటింగ్ చేస్తే ఏ భర్తా భరించలేడని MP హైకోర్టు తెలిపింది. ‘పెళ్లయ్యాక దంపతులు మొబైల్లో తమ మిత్రులతో అనేక అంశాలపై చాటింగ్ చేసుకోవచ్చు. ఆ సంభాషణలు గౌరవంగా ఉండాలి. ప్రత్యేకించి అపోజిట్ జెండర్‌తోనైతే జీవిత భాగస్వామి గురించి అస్సలు అభ్యంతరకరంగా ఉండొద్దు’ అని పేర్కొంది. ఆ భార్య సవాల్ చేసిన పిటిషన్‌ను కొట్టేస్తూ కుటుంబ కోర్టు మంజూరు చేసిన విడాకులను ఆమోదించింది.

భారత యంగ్ షట్లర్ లక్ష్యసేన్ దూకుడుకు తెరపడింది. ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి ఆయన నిష్క్రమించారు. బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన క్వార్టర్ ఫైనల్లో తన కన్నా మెరుగైన ర్యాంకర్, చైనా ఆటగాడు లీ షి ఫెంగ్ చేతిలో ఓటమి చవిచూశారు. వరుసగా రెండు గేముల్లో 10-21, 16-21 తేడాతో పరాజయం పాలయ్యారు. ఆటలో అతడు ఏ దశలోనూ లయ అందుకోలేదు. 2022లో లక్ష్య ఇక్కడ ఫైనల్‌కు చేరడం గమనార్హం.
Sorry, no posts matched your criteria.