India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: విశాఖ-విజయవాడ మధ్య కొత్తగా 2 విమాన సర్వీసులను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నేడు ప్రారంభించనున్నారు. ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్ ఉ.9.35కు విశాఖలో బయలుదేరి ఉ.10.35కు గన్నవరం చేరుకుంటుంది. తిరిగి రాత్రి 7.55కు విజయవాడ నుంచి బయలుదేరి రా.9 గంటలకు విశాఖకు చేరుతుంది. ఇండిగో సర్వీసు రా.7.15కు విజయవాడ నుంచి విశాఖకు వెళ్లి, తిరిగి రా.8.45కు అక్కడి నుంచి బయలుదేరి గన్నవరం చేరుకుంటుంది.
మహారాష్ట్రలో విపక్ష ఓట్లు చీలకుండా ఉండేందుకు వీలుగా అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని ఆప్ నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ నేత, ఎంపీ సంజయ్ సింగ్ వెల్లడించారు. మహా వికాస్ అఘాఢీ(MVA)లోకి పార్టీలకు మద్దతుగా ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం చేస్తారని తెలిపారు. 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. కాగా హరియాణాలో ఒంటరిగా పోటీ చేసిన ఆప్ ఖాతా తెరవని విషయం తెలిసిందే.
ఇరాన్ సైనిక స్థావరాలు, క్షిపణి తయారీ కేంద్రాలపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక <<14459066>>దాడి<<>> ‘ఆపరేషన్ ఒపేరా’ను గుర్తుచేస్తోంది. సాంకేతికత పెద్దగా అభివృద్ధి చెందని 1981లోనే దాదాపు 2000KM దూరంలో ఉన్న ఇరాక్‌లోని ఒసిరక్ న్యూక్లియర్ రియాక్టర్‌ను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. ఆ ఏడాది జూన్ 7న సా.4-5.30 మధ్య ఆపరేషన్ ముగిసింది. శత్రుదేశ రాడార్లకు దొరక్కుండా 14 ఫైటర్ జెట్స్(F16A) విజయవంతంగా ఆపరేషన్ పూర్తిచేశాయి.
✒ Abate× Aggravate
✒ Adhere× Condemn, disjoin
✒ Abolish× Setup, establish
✒ Acumen× Stupidity, ignorance
✒ Abash× Uphold, Discompose
✒ Absolve× Compel, Accuse
✒ Abjure× Approve, Sanction
✒ Abject× Commendable, Praiseworthy
✒ Abound× Deficient, Destitute
తన మ్యారేజ్ ప్లాన్స్ గురించి ఓ ఈవెంట్‌లో హీరోయిన్ రాశీ ఖన్నా ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘నాకు పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని ఉంది. కానీ దానికి సమయం ఉంది. అది నా పర్సనల్ మ్యాటర్. కాబట్టి ఇక్కడ దాని గురించి డిస్కస్ చేయాలనుకోవడం లేదు. వివాహాన్ని నా ప్రొఫెషన్‌తో ముడిపెట్టాల్సిన అవసరం లేదు’ అని చెప్పారు. ఆమె నటించిన ‘సబర్మతి రిపోర్ట్’ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఒక్కో జంతువు నోటి పట్టుకు ఒక్కో శక్తి ఉంటుంది. దీన్నే బైట్ ఫోర్స్ అంటారు. ఈ శక్తిని కొలిచేందుకు PSI అనే కొలమానాన్ని వాడతారు. నైలు నదిలో ఉండే మొసళ్లకు అత్యధికంగా 5000 పీఎస్ఐ పవర్ ఉంటుంది. వాటి తర్వాత ఉప్పునీటి మొసళ్లు(3700 PSI), అమెరికా మొసళ్లు(2125), హిప్పోపొటమస్(1800), జాగ్వార్(1500), బుల్ షార్క్(1350), గొరిల్లా(1300), ధ్రువపు ఎలుగుబంటి(1200 PSI) ఉన్నాయి. మనిషి బైట్ ఫోర్స్ 162 పీఎస్ఐ మాత్రమే!
కనకపు సింహాసనమున
శునకము గూర్చుండబెట్టి శుభలగ్నమునం
దొనరగ బట్టము గట్టిన
వెనుకటి గుణమేల మాను వినురా సుమతీ!
తాత్పర్యం: బంగారపు సింహాసనంపై కుక్కను కూర్చోబెట్టినా దాని బుద్ధిని విడిచిపెట్టదు. అలాగే హీనుని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టినా అతని బుద్ధి మారదు.
ఎటు చూసినా యుద్ధాలు, అశాంతి నెలకొన్న నేటి కాలంలో శాంతిభద్రతల్ని కలిగి ఉన్న దేశాలు చాలా తక్కువనే చెప్పాలి. అలాంటి ప్రశాంతమైన దేశాల జాబితాలో డెన్మార్క్ అగ్రస్థానంలో ఉన్నట్లు వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ రూపొందించిన సూచీ తెలిపింది. దాని ప్రకారం.. రెండో స్థానంలో నార్వే, మూడో స్థానంలో ఫిన్లాండ్, 4, 5 స్థానాల్లో స్వీడన్, జర్మనీ ఉన్నాయి. భారత్ 79వ ర్యాంకు దక్కించుకోగా చైనా 95, పాక్ 129వ స్థానాల్లో నిలిచాయి.
చెన్నై సూపర్ కింగ్స్‌లో ధోనీకి సరైన వారసుడు రిషభ్ పంతేనని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ అభిప్రాయపడ్డారు. ‘పంత్ గనుక ఢిల్లీని వదిలేసి వేలంలోకి వస్తే అతడిని దక్కించుకునేందుకు చెన్నై ఎంతవరకైనా వెళ్తుంది. ధోనీ తర్వాత సరైన ప్రత్యామ్నాయం అతడే. మరి రిషభ్‌ను ఢిల్లీ వదులుకుంటుందా లేదా అన్నది చూడాలి’ అని పేర్కొన్నారు. తాను వేలంలోకి వస్తే ఎంత ధర వస్తుందంటూ పంత్ ఇటీవల ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
TG: కొన్ని రోజులుగా ఆందోళన చేస్తోన్న బెటాలియన్ కానిస్టేబుళ్లపై పోలీస్ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసనలకు ప్రేరేపిస్తున్న 39 మందిని సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించింది. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి ఆందోళనలు చేయడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది.
Sorry, no posts matched your criteria.