India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రముఖ హాలీవుడ్ నటుడు నిక్కీ కేట్(54) కన్నుమూశారు. అతని మరణానికి గల కారణాలు వెల్లడి కాలేదు. 1980లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నిక్కీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. డేజ్డ్ అండ్ కన్ఫ్యూజ్డ్, అమెరికన్ యకుజా, ఫాంటమ్స్, ఇన్సోమేనియా, ది బేబీ సిట్టర్ తదితర 40 చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. అలాగే దాదాపు 30 టీవీ సిరీస్‌లలోనూ నటించారు. హాలీవుడ్‌లో కల్ట్ యాక్టర్‌గా గుర్తింపు పొందారు.
బెంగాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీనిపై ఆ రాష్ట్ర LOP, BJP నేత సువేందు అధికారి స్పందిస్తూ రాష్ట్రంలో హిందువులకు రక్షణ లేదని వ్యాఖ్యానించారు. ఇది సీఎం మమత చేతకానితనానికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర చీఫ్ మజూందార్ విమర్శించారు. కాగా ముర్షీదాబాద్ సహా పలు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు, బీఎస్‌ఎఫ్ జవాన్లు పహారా కాస్తున్నారు. అల్లర్ల ఘటనకు సంబంధించి ఇప్పటివరకు 150 మందిని అరెస్టు చేశారు.
CSKతో మ్యాచ్‌లో 61 డాట్ బాల్స్ వేసిన KKR 30,500 మొక్కలను నాటినట్లు ప్రకటించింది. అలీ, నరైన్, వరుణ్, హర్షిత్, వైభవ్ మొక్కలను నాటుతున్నట్లు రూపొందించిన ఫొటోను షేర్ చేసింది. ఒక ఇన్నింగ్సులో ఇన్ని డాట్స్ వేయడం IPL చరిత్రలోనే తొలిసారి. దీంతో చెపాక్ స్టేడియంలో చెట్లతో నిండిపోయిన మీమ్స్ వైరలయ్యాయి. కాగా పర్యావరణ సంరక్షణలో భాగంగా ఒక్కో డాట్‌కు 500 చెట్లు నాటే కార్యక్రమానికి 2023లో BCCI శ్రీకారం చుట్టింది.
వేసవి వచ్చింది. ఎండలతో పాటు మామిడి పండ్లనూ తెచ్చింది. దేశంలో విరివిగా కాసే మామిడిలో ఎన్నో రకాలున్నాయి. బంగినపల్లి, మల్లికా(AP), ఇమామ్ పసంద్(TG), అల్ఫాన్సో(MH), మాల్గోవా, సింధూర, పైరి, తోతాపురి(KN), బాంబే గ్రీన్(MP), ఫజ్లి, గులాభాస్, చౌసా, జర్దాలు(BH), లంగ్రా, దశరి(UP), నీలం, కేసర్(GT), కిషన్ భోగ్, హిమసాగర్(WB)తో పాటు మరెన్నో రకాలున్నాయి. వీటిలో మీరు టేస్ట్ చేసినవి, మీకు తెలిసినవి కామెంట్ చేయండి.
తజికిస్థాన్‌లో ఇవాళ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.4గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. 16 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించారు. ఆస్తి, ప్రాణ నష్టంపై సమాచారం రావాల్సి ఉంది. మయన్మార్‌లోనూ ఇవాళ మరోసారి భూమి కంపించిన విషయం తెలిసిందే.
మహాయుతి కూటమిలో విభేదాలు తలెత్తాయని ప్రచారానికి తాజాగా మహారాష్ట్రలో జరిగిన ఘటన బలం చేకూరుస్తుంది. ఛత్రపతి శివాజీ వర్ధంతి సందర్భంగా NCP ఎంపీ సునీల్ తత్కరీ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అమిత్‌షా పాల్గొనగా శివసేన నేతలెవరూ హాజరుకాలేదు. కాగా తాను ఆహ్వానించినప్పటికీ నేతలెవరూ విందుకు రాలేదని NCP ఎంపీ అన్నారు. దీంతో భాజపా నేతృత్వంలోని మహాయుతి కూటమిలో ముసలం పుట్టిందని వార్తలు ప్రచారమవుతున్నాయి.
TG: <<15856039>>రాజీవ్ యువ వికాసం<<>> పథకానికి నిన్నటి వరకు దాదాపు 14 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలతో దరఖాస్తుదారులు ఇబ్బందిపడుతున్నారు. రేపటితో గడువు ముగియనుండగా మరిన్ని రోజులు పొడిగించాలని కోరుతున్నారు. ఈ స్కీమ్‌కు అప్లై చేసుకునేందుకుగాను క్యాస్ట్, ఇన్‌కమ్ సర్టిఫికెట్ల కోసం మార్చి 24-ఏప్రిల్ 11 మధ్య 13.08 దరఖాస్తులు వచ్చాయి. మీసేవ చరిత్రలో ఇదే రికార్డని తెలుస్తోంది.
TG: నాగర్‌కర్నూల్ జిల్లాలో జరుగుతున్న సలేశ్వరం జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తారు. సెలవులతో పాటు జాతర చివరి రోజు కావడంతో తరలొస్తున్నారు. దీంతో శ్రీశైలం హైవేపై 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. సిద్ధాపూర్ క్రాస్ వరకు వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చైత్రపౌర్ణమి సందర్భంగా ఏటా మూడు రోజుల పాటు సలేశ్వరం లింగమయ్య జాతర నిర్వహిస్తారు.
తన కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, కోలుకుంటున్నాడని Dy.CM పవన్ ప్రకటించారు. సింగపూర్‌లోని స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన తన కొడుకు కోసం ప్రార్థనలు చేసిన వారందరికీ Xలో ధన్యవాదాలు తెలిపారు. ఈ కష్టసమయంలో అండగా నిలిచిన జనసేన పార్టీ కార్యకర్తలు, నేతలు, శ్రేయోభిలాషులు, సినీ, రాజకీయ ప్రముఖులకు కృతజ్ఞతలు చెప్పారు. కాగా కొడుకుతో కలసి పవన్ నిన్న ఇండియాకు తిరిగొచ్చారు.
వరుస భూకంపాలతో మయన్మార్ వణికిపోతోంది. ఇవాళ ఉదయం దేశంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.5గా నమోదైంది. కాగా ఇటీవల సంభవించిన భారీ భూకంపంతో మయన్మార్ అతలాకుతలం అయింది. 3వేల మందికి పైగా మరణించారు. శిథిలాల తొలగింపు ఇంకా కొనసాగుతోంది. రూ.వేల కోట్ల ఆస్తులు ధ్వంసం అయ్యాయి. ఆ తర్వాత కూడా తరచూ భూకంపాలు వస్తుండటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
Sorry, no posts matched your criteria.