news

News March 11, 2025

శుభ ముహూర్తం (11-03-2025)

image

☛ తిథి: శుక్ల ద్వాదశి ఉ.9.29 వరకు
☛ నక్షత్రం: ఆశ్లేష రా.2.58 వరకు
☛ శుభ సమయం: ఏమి లేవు
☛ రాహుకాలం: ప.3:00-4.30 వరకు
☛ యమగండం: ఉ.9.00-10.30 వరకు
☛ దుర్ముహూర్తం: 1.ఉ.8.24-9.12 వరకు
2.రా.10.48-11.36 వరకు
☛ వర్జ్యం: మ.3.29-5.07 వరకు
☛ అమృత ఘడియలు: రా.1.19-2.57 వరకు

News March 11, 2025

TODAY’S HEADLINES

image

✈ అమరావతి రుణాలు AP అప్పుల పరిధిలోకి రావు: కేంద్రం
✈ AP: రైతులకు రూ.20 వేలు: అచ్చెన్నాయుడు
✈ AP: అమరావతి పునర్నిర్మాణానికి రేపు సీఎం శంకుస్థాపన
✈ AP: పవన్ వల్లే కూటమి అధికారంలోకి: మంత్రి నాదెండ్ల
✈ TG: రాష్ట్రం కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీకి: రేవంత్
✈ TG: కేసీఆర్ సభకు వస్తారు: KTR
✈ TG: గ్రూప్-1 ఫలితాలు విడుదల
✈ TG: ప్రణయ్ హత్య కేసు నిందితులకు శిక్ష ఖరారు
✈ NEPపై పార్లమెంటులో DMK, BJP మధ్య రచ్చ

News March 11, 2025

అనర్హులకు ఇళ్లు మంజూరైతే రద్దు చేస్తాం: పొంగులేటి

image

TG: గ్రామసభల్లో వచ్చిన ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులను వెంటనే పరిశీలించి అర్హులను ఎంపిక చేయాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు. మొదటి విడతలో ఎదురైన సమస్యలను పరిగణనలోకి తీసుకొని ప్రక్రియ చేపట్టాలన్నారు. అనర్హులకు ఇళ్లు మంజూరైనట్లు గుర్తిస్తే వాటి నిర్మాణం ఏ దశలో ఉన్నా రద్దు చేస్తామని హెచ్చరించారు. అర్హులకే ఇళ్లు అందాలని, అందుకు క్షేత్రస్థాయిలో తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.

News March 11, 2025

ఫైనల్ మ్యాచ్‌లో చాలా టెన్షన్ పడ్డా: KL రాహుల్

image

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమ్ ఇండియా విజయంలో కేఎల్ రాహుల్(34) కీలకంగా వ్యవహరించారు. అయితే ఆడుతున్నప్పుడు తాను చాలా టెన్షన్ పడ్డానని ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘నా తర్వాత మరో ఇద్దరు బ్యాటర్లున్నారు. అయినప్పటికీ టెన్షన్‌తోనే ఉన్నా. కానీ ఆ పరిస్థితుల్లో మైండ్‌ను స్థిరంగా ఉంచుకుని ఏకాగ్రతతో ఆడాలి. మన దేశీయ క్రికెట్‌లో చిన్నతనం నుంచే ఒత్తిడి అలవాటు అవుతుంది. అది హెల్ప్ అయింది’ అని పేర్కొన్నారు.

News March 11, 2025

ప్రభుత్వ సలహాదారుగా దత్తాత్రేయుడు: సీఎం

image

AP: ప్రముఖ క్యాన్సర్ వైద్యులు <<15716479>>దత్తాత్రేయుడిని <<>>ప్రభుత్వ సలహాదారుడిగా తీసుకోనున్నట్లు CM చంద్రబాబు చెప్పారు. సాధారణ కుటుంబంలో పుట్టి వైద్య రంగంలో ఎన్నో అవార్డులు పొందారని గుర్తుచేశారు. 50 ఏళ్లుగా క్యాన్సర్ వ్యాధికి సుదీర్ఘంగా సేవలు అందించారని వివరించారు. ఎన్నో పెద్ద యూనివర్సిటీల నుంచి చాలామంది దత్తాత్రేయుడి వద్ద వైద్యం నేర్చుకున్నారని తెలిపారు. ఆయన సలహాలతో క్యాన్సర్ నివారణ చర్యలు చేపడతామన్నారు.

News March 11, 2025

ఘోరం: పిల్లల్ని చంపి దంపతుల ఆత్మహత్య

image

TG: హైదరాబాద్‌లోని హబ్సిగూడలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లల్ని చంపి దంపతులు చంద్రశేఖర్(40), కవిత(35) ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆర్థిక ఇబ్బందులే కారణమని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

News March 11, 2025

బండి సంజయ్ జోక్యంతో భారతీయులకు విముక్తి

image

థాయ్‌లాండ్‌లో బందీలుగా మారిన 540 మంది భారతీయులకు విముక్తి లభించింది. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో 540 మందిని సైబర్ నేరగాళ్లు బందీలుగా చేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. కేంద్రమంత్రి బండి సంజయ్ జోక్యంతో బాధితులకు విముక్తి లభించగా, ప్రత్యేక విమానంలో వారంతా భారత్‌కు చేరుకున్నారు. బాధితుల్లో ఏపీ, తెలంగాణకు చెందిన యువత అధికంగా ఉన్నారు.

News March 11, 2025

విధ్వంసం.. 47 బంతుల్లో సెంచరీ

image

ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌ టీ20లో సెంచరీల మోత మోగుతోంది. తాజాగా ఇంగ్లండ్‌‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటర్ సంగక్కర శతకం బాదారు. అతడు 47 బంతుల్లోనే 106 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచారు. ఇందులో 19 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. సంగక్కర విధ్వంసంతో 147 రన్స్ టార్గెట్‌ను లంక 12.5 బంతుల్లోనే ఛేదించింది. కాగా ఈ టోర్నీలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ వాట్సన్ మూడు శతకాలు బాదిన విషయం తెలిసిందే.

News March 11, 2025

పడుకున్న వెంటనే నిద్ర పట్టాలంటే..

image

* సాయంత్రం వేళల్లో కెఫీన్ ఎక్కువగా ఉండే కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్ తాగకూడదు.
* రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. అలా మీ బ్రెయిన్, బాడీని సిద్ధం చేసుకోవాలి.
* నిద్రకు ముందు రిలాక్స్ అవ్వండి. వేడి నీటితో స్నానం చేస్తే కండరాలు రిలాక్స్ అవుతాయి.
* నైట్ అతిగా తినొద్దు. ఆయాసం వల్ల నిద్ర త్వరగా పట్టదు.

News March 10, 2025

కదిరి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్

image

AP: శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం వేదపండితులు ఆయనకు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో పాటు పలువురు టీడీపీ నేతలు లోకేశ్ వెంట ఉన్నారు. ఈ నెల 9న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 15 రోజులపాటు అంగరంగ వైభవంగా సాగనున్నాయి.