India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రెబల్ స్టార్ ప్రభాస్‌తో ప్రశాంత్ వర్మ ఓ సినిమాను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. దానిపై ఓ ఇంట్రస్టింగ్ అప్‌డేట్ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. మూవీ స్టోరీ మహాభారతంలోని బకాసురుడి గురించి ఉంటుందని టాక్. ఆ పేరు మీదే ‘బకా’ అనే టైటిల్‌ను పెట్టాలని ప్రశాంత్ భావిస్తున్నారని సమాచారం. బకాసురుడిని భీముడు చంపాడు. మరి ప్రభాస్ భీముడి పాత్రను పోషిస్తారా లేక ఇది వేరే ఏదైనా కథనా అన్నది ఆసక్తికరంగా మారింది.

AP: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎల్లుండి ఉ.11 గంటలకు విజయవాడ ఆఫీస్‌కు విచారణకు రావాలని పేర్కొన్నారు. కాకినాడ పోర్ట్ వాటాల బదిలీ కేసులో కేవీ రావు ఫిర్యాదుతో 506, 384, 420, 109, 467, 120(బి) రెడ్ విత్ 34 సెక్షన్ల కింద VSRకు నోటీసులు ఇచ్చారు. కాగా ఇటీవల విజయసాయి రాజ్యసభ ఎంపీ పదవితో పాటు వైసీపీకి రాజీనామా చేశారు.

AP: హైదరాబాద్‌లో ఉన్నట్లుగానే బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిని అమరావతిలోనూ ప్రారంభిస్తామని CM చంద్రబాబు పేర్కొన్నారు. వైద్యుడు నోరి దత్తాత్రేయుడు రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడారు. ‘దత్తాత్రేయుడు వైద్యరంగంలో ఎన్నో అవార్డుల్ని దక్కించుకున్నారు. 50 ఏళ్లుగా క్యాన్సర్ చికిత్సలో సేవలందిస్తున్నారు. అమరావతిలోనూ క్యాన్సర్ ఆస్పత్రి ఉండాలని ఆయన సంకల్పించారు. త్వరలోనే కడతాం’ అని తెలిపారు.

తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. సెకండియర్ ఇంగ్లిష్ ప్రశ్నపత్రం ముద్రణలో ఏడో ప్రశ్న అస్పష్టంగా ఉండటంతో దానికి పూర్తి మార్కులు ఇవ్వనున్నట్లు తెలిపింది. జవాబు రాసేందుకు యత్నించిన వారికి 4 మార్కులు కలుపుతామని పేర్కొంది.

X(ట్విటర్) సేవలు మరోసారి నిలిచిపోయాయి. సైట్‌లోకి లాగిన్ కాలేకపోతున్నామని యూజర్లు ఇతర సోషల్ మీడియాలో ప్లాట్‌ఫామ్‌ల్లో కామెంట్స్ చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం కూడా ట్విటర్ మొరాయించింది. అయితే ఇప్పటివరకు దీనిపై సంస్థ ఎలాంటి ప్రకటన చేయలేదు.

TG: మరో రెండు రోజుల్లో గద్దర్ అవార్డులకు నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన విధివిధానాలను సీఎం రేవంత్ రెడ్డి ఆమోదించినట్లు తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు తెలిపారు. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాజు పేర్కొన్నారు. కాగా ఏప్రిల్‌లో అవార్డుల ప్రదానోత్సవం జరిగే అవకాశం ఉంది.

లిక్కర్ స్కాం కేసులో ఛత్తీస్‌గఢ్ మాజీ CM భూపేశ్ బఘేల్ ఇంట్లో ED సోదాల సందర్భంగా హైడ్రామా చోటు చేసుకుంది. బఘేల్, ఆయన కొడుకు చైతన్య నివాసాల్లో రైడ్స్ అనంతరం అధికారుల వాహనంపై INC కార్యకర్తలు రాళ్లు రువ్వారు. అటు తనపై కేసును SC కొట్టేసినా రైడ్స్ చేయడంపై బఘేల్ మండిపడ్డారు. తన ఇంట్లో రూ.33 లక్షల నగదు మాత్రమే దొరికిందని, కానీ పెద్ద సంఖ్యలో క్యాష్ కౌంటింగ్ మెషీన్లు తీసుకొచ్చి ED సెన్‌సేషన్ చేస్తోందన్నారు.

కొందరు భారతీయులు ఉదయం 6 గంటలకే మేల్కొంటే మరికొందరు 8 దాటినా బెడ్‌పైనే ఉంటుంటారు. అందరి యావరేజ్ ప్రకారం భారతీయులు 7:36 AMకు నిద్ర లేస్తారని ‘వరల్డ్ పాపులేషన్ రివ్యూ’ వెల్లడించింది. అందరి కంటే ముందుగా మేల్కొనేది సౌతాఫ్రికా ప్రజలే. వారు 6:24కే నిద్ర లేస్తారు. ఆ తర్వాత కొలంబియా 6:31, కోస్టారికా 6:38, ఇండోనేషియా 6:55, జపాన్ &మెక్సికో 7:09, ఆస్ట్రేలియా 7:13, USAలో 7:20AMకి లేచి పనులు స్టార్ట్ చేస్తారు.

అమ్మాయిలకు పీరియడ్స్ ఎలాగో అబ్బాయిలూ ప్రతి నెలా IMS(ఇర్రిటబుల్ మేల్ సిండ్రోమ్) వంటి హార్మోన్ సమస్యతో బాధపడతారని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన వారిలో ఇది కనిపిస్తుంటుంది. నెలలో IMS సమయంలో వీరు ఎవరితో మాట్లాడరు. చిరాకు పడటం, రీజన్ లేకుండా కోప్పడతారు. దేనిపైనా ఇంట్రెస్ట్ చూపరు. ఇలాంటి సమయంలో వారితో ఆర్గ్యుమెంట్ చేయొద్దని వైద్యులు సూచిస్తున్నారు. మీకు ఇలానే అనిపిస్తుందా? COMMENT

పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్ అంటూ ఆ మూవీలో డైలాగ్ ఉంటుంది. అదే డైలాగ్‌ను టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ జడేజా రిపీట్ చేశారు. నిన్న ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న అనంతరం బ్యాట్‌తో వీపుపై తన పేరును చూపించిన ఆయన, అదే ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. పక్కన అల్లు అర్జున్ ఫొటో జత చేసి ‘జాతీయ ఆటగాడు అనుకుంటివా..’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఆ ఫొటోను బన్నీ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.