India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: ఉపరితల ద్రోణి ప్రభావంతో 2 రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల ఓ మోస్తరు వానలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. మంచిర్యాల, జయశంకర్ భూపాల్ పల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
బిల్లులపై నిర్ణయానికి రాష్ట్రపతి, గవర్నర్లకు సుప్రీంకోర్టు గడువు విధించిన విషయం తెలిసిందే. దీనిని స్వాగతిస్తూ BRS నేత KTR ట్వీట్ చేశారు. పాలనలో అడ్డంకులు సృష్టించేందుకు BJP, కాంగ్రెస్ లెక్కలేనన్ని సార్లు గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేశాయని ఆరోపించారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ఫిరాయింపులకు పాల్పడుతున్న ఎమ్మెల్యేలపై చర్యలకు అసెంబ్లీ స్పీకర్లకూ గడువు విధించాలని సుప్రీంకోర్టును కేటీఆర్ కోరారు.
TG: SLBC టన్నెల్ ప్రమాద ఘటనకు 50 రోజులు పూర్తయినా సహాయక చర్యల్లో పురోగతి లేదని BRS MLA హరీశ్ రావు విమర్శించారు. హెలికాప్టర్‌లో వెళ్లి మంత్రులు పెట్టిన డెడ్‌లైన్లు మారాయే తప్ప ప్రయోజనం లేదని ఫైరయ్యారు. ఇది INC ప్రభుత్వానికి చరిత్రలో నిలిచిపోయే అప్రతిష్ఠ అని పేర్కొన్నారు. వారి మృతదేహాలను ఎప్పటికి బయటకు తీసుకొస్తారని ప్రశ్నించారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
భారత ఆర్మీ ఇవాళ సియాచిన్ డే సందర్భంగా జవాన్ల సేవలను స్మరించుకుంది. ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ భూమిగా పేరుగాంచిన సియాచిన్‌లో భారత ఆర్మీ 1984లో ఇదే రోజున ఆపరేషన్ మేఘదూత్ చేపట్టి కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది. పాక్ సరిహద్దులోని సియాచిన్‌పై పూర్తి పట్టు సాధించింది. దశాబ్దాలుగా అక్కడి విపరీత వాతావరణ పరిస్థితులను తట్టుకుని రక్షణగా నిలుస్తున్న జవాన్ల ధీరత్వానికి సెల్యూట్.
SRH-PBKS మ్యాచ్ సందర్భంగా ఆయా జట్ల ఓనర్లు కావ్యా మారన్, ప్రీతి జింటా ఉప్పల్‌లో సందడి చేశారు. తమ ప్లేయర్లు సిక్సర్లు, ఫోర్లు కొట్టినప్పుడు, వికెట్లు పడినప్పుడు వారు ఇచ్చిన హావభావాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అభిషేక్ శర్మ సెంచరీ చేయగానే కావ్యా అతని పేరెంట్స్ దగ్గరికెళ్లి అభినందనలు తెలిపారు. మ్యాచ్ తర్వాత అభిషేక్ ట్రేడ్ మార్క్ సెలబ్రేషన్‌ను గుర్తుచేస్తూ ప్రీతి కంగ్రాట్స్ చెప్పడం విశేషం.
భారత జావెలిన్ త్రోయర్ డీపీ మనుపై NADA నాలుగేళ్ల నిషేధం విధించింది. గతేడాది ఏప్రిల్‌లో జరిగిన గ్రాండ్ ప్రిక్స్-1 సందర్భంగా అతడి నుంచి శాంపిల్స్ సేకరించగా నిషేధిత పదార్థం వాడినట్లు తేలింది. ఆ పోటీల్లో మను విజేతగా నిలవడం గమనార్హం. అయితే డోపింగ్ టెస్టులో విఫలం కావడంతో అతడిపై నాడా తాత్కాలిక నిషేధం విధించింది. మనుపై 2028 వరకు నిషేధం కొనసాగించనున్నట్లు తాజాగా ప్రకటించింది.
AP: ఇంటర్‌లో <<16068539>>ఫెయిలయ్యామనే<<>> బాధలో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. విశాఖ కొండపేటలో చరణ్‌తేజ్‌కు సెకండియర్ ఫిజిక్స్‌లో 10 మార్కులే రావడంతో ఉరివేసుకున్నాడు. ఫస్టియర్‌లో ఫెయిలవడంతో నంద్యాల(D) బండిఆత్మకూరులో చిన్నమస్తాన్, నెల్లూరు(D) చింతారెడ్డిపాలెంలో మరో విద్యార్థి సూసైడ్ చేసుకున్నారు. కర్నూలు(D) ఆదోనిలో 2 సబ్జెక్టులు ఫెయిలైన ఓ బాలిక ఫినాయిల్ తాగింది. ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటోంది.
IPL2025: PBKSపై సంచలన విజయంతో SRH పాయింట్ల పట్టికలో కాస్త ముందుకెళ్లింది. 6 మ్యాచ్‌లలో 2 విజయాలతో ఎనిమిదో స్థానానికి చేరింది. దీంతో తన ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఐదు సార్లు ట్రోఫీ విన్నర్లయిన MI, CSK 9, 10వ స్థానాల్లో నిలిచాయి. రేపు లక్నోతో జరిగే మ్యాచ్‌లో ఓడితే చెన్నై ఇంటిబాట పట్టడం దాదాపు ఖాయమే. ఇవాళ DCతో మ్యాచ్‌లో MI ఓడిపోతే ప్లేఆఫ్స్ అవకాశం సంక్లిష్టంగా మారుతుంది.
TG: ప్రస్తుత DGP జితేందర్ ఈ ఏడాది SEPలో పదవీ విరమణ చేయనున్నారు. దీంతో కొత్త పోలీస్ బాస్ ఎంపికపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సుప్రీం మార్గదర్శకాల ప్రకారం 30ఏళ్ల సర్వీసు పూర్తయిన ఏడుగురి పేర్లను పరిశీలిస్తోంది. వారిలో రవిగుప్తా, సీవీ ఆనంద్, శివధర్‌రెడ్డి, సౌమ్యామిశ్రా, షికాగోయల్ ముందువరుసలో ఉన్నారు. ఆ పేర్ల నుంచి ముగ్గురిని UPSC ఎంపిక చేయనుండగా, అందులో ఒకరిని ప్రభుత్వం డీజీపీగా నియమిస్తుంది.
బర్డ్ ఫ్లూ భయం వీడుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో చికెన్ వినియోగం మళ్లీ పెరుగుతోంది. దీంతో రేట్లు కూడా స్వల్పంగా పెరిగాయి. తెలంగాణలో కేజీ కోడి మాంసం ధర స్కిన్‌లెస్ రూ.240-260 వరకు పలుకుతోంది. అంతకుముందు ఇది రూ.230కే పరిమితం అయింది. అటు ఏపీలో కేజీ రూ.270-300 వరకు విక్రయిస్తున్నారు. ప్రాంతాన్ని బట్టి రేట్లలో హెచ్చుతగ్గులున్నాయి. మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయి?
Sorry, no posts matched your criteria.