news

News March 10, 2025

భారత జట్టుకు ప్రధాని అభినందనలు

image

ఛాంపియన్స్ ట్రోఫీ సాధించిన భారత జట్టుకు ప్రధాని మోదీ అభినందనలు తెలియజేశారు. టోర్నీ మొత్తం టీమ్ ఇండియా అద్భుతంగా ఆడిందని కొనియాడారు. ఆల్ రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టిందని ప్రశంసించారు. జట్టులోని ప్లేయర్లంతా స్ఫూర్తిదాయక ప్రదర్శన చేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. CT విజేతగా నిలిచిన భారత జట్టుకు సినీ నటులు చిరంజీవి, మహేశ్ బాబు, ఎన్టీఆర్ అభినందనలు తెలియజేశారు.

News March 10, 2025

KL రాహుల్.. ది అన్‌సంగ్ హీరో!

image

2023 వన్డే WC ఓడిపోవడానికి ఇతనే కారణం. పంత్ ఉండగా ఇతడినెందుకు ఆడిస్తున్నారు. కీపింగ్ సరిగా చేయట్లేదు. ఇవన్నీ CTలో KL రాహుల్‌పై వచ్చిన విమర్శలు. ‘నేను ఇంకేం చేయాలి?’ అని ఇటీవల రాహుల్ అన్నారంటే ఆ విమర్శల తీవ్రత ఏంటో అర్థం అవుతోంది. సెమీ ఫైనల్‌లో AUSతో మ్యాచులో సిక్స్ కొట్టి గెలిపించడమే కాకుండా ఫైనల్‌లో టీమ్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు రాహుల్(34*) ఆడిన తీరు అద్భుతం. జట్టును గెలిపించిన తీరు అద్వితీయం.

News March 10, 2025

కెప్టెన్‌గా రోహిత్ శర్మ గెలిచిన ట్రోఫీలు ఇవే

image

☞ IPL: 2013, 2015, 2017, 2019, 2020 (MI)
☞ CL టీ20: 2013
☞ ఆసియా కప్: 2018, 2023
☞ నిదహాస్ ట్రోఫీ-2018
☞ టీ20 వరల్డ్ కప్-2024
☞ ఛాంపియన్స్ ట్రోఫీ-2025

News March 10, 2025

NZ అంటే చాలు.. రెచ్చిపోతాడు!

image

వన్డే ఫార్మాట్‌లో న్యూజిలాండ్‌పై భారత బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆ జట్టుపై శ్రేయస్ వరుసగా 103, 52, 62, 80, 49, 33, 105, 79, 48 రన్స్ చేశారు. అలాగే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు (243) చేసిన భారత బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పారు. ఈ టోర్నీలో ఆయన 15, 56, 79, 45, 48 రన్స్ సాధించారు.

News March 9, 2025

భారత జట్టుకు అభినందనల వెల్లువ

image

ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర మంత్రులు, తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. టీమ్ ఇండియా మరోసారి తన సత్తా చాటిందని, గర్వపడేలా చేసిందని AP సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, మంత్రులు సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు.

News March 9, 2025

గంభీర్ నవ్వారు..!

image

CT ఫైనల్‌లో భారత్ విక్టరీ సాధించడంతో కోచ్ గౌతమ్ గంభీర్ నవ్వుతూ కనిపించారు. సాధారణంగా ప్లేయర్లు సెంచరీలు చేసినా, బౌండరీలు బాదుతున్నా సీరియస్‌గా కనిపించే ఆయన ఇవాళ జడేజా ఫోర్ కొట్టి మ్యాచ్ గెలిపించగానే నవ్వారు. కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో ఓటములు ఎదురైనా, విమర్శకులు మాటలతో ఒత్తిడిలోకి నెట్టినా జట్టును తనదైన శైలిలో నడిపించారు. చివరకు ఛాంపియన్స్ ట్రోఫీ అందించడంలో కీలక‌పాత్ర పోషించారు.

News March 9, 2025

టీమ్ఇండియా క్రికెట్ చరిత్రలో ముఖ్యమైన రోజులు

image

→ 25th జూన్ 1983(వన్డే WC)
→ 24th సెప్టెంబర్ 2007(T20 WC)
→ 30th సెప్టెంబర్ 2002(ఛాంపియన్స్ ట్రోఫీ)
→ 2nd ఏప్రిల్ 2011(వన్డే WC)
→ 23rd జూన్ 2013(ఛాంపియన్స్ ట్రోఫీ)
→ 29th జూన్ 2024(T20 WC)
→ 9th మార్చి 2025(ఛాంపియన్స్ ట్రోఫీ)

News March 9, 2025

ఐసీసీ ట్రోఫీలు గెలిచిన భారత కెప్టెన్లు

image

1983 వన్డే WC- కపిల్ దేవ్
2002 ఛాంపియన్స్ ట్రోఫీ- గంగూలీ
2007 టీ20 WC- ధోనీ
2011 వన్డే WC- ధోనీ
2013 ఛాంపియన్స్ ట్రోఫీ- ధోనీ
2024 టీ20 WC- రోహిత్ శర్మ
2025 ఛాంపియన్స్ ట్రోఫీ- రోహిత్ శర్మ

News March 9, 2025

సూపర్ భారత్.. ఒక్క ఓటమి లేకుండా..

image

2024 టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత్ సమష్టి కృషితో మరో ఐసీసీ ట్రోఫీ సొంతం చేసుకుంది. ఎవరో ఒకరిపై ఆధారపడకుండా జట్టులోని 11 మంది ప్లేయర్లు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. లీగ్ స్టేజీ, సెమీఫైనల్, ఫైనల్ ఇలా ప్రతి రౌండ్లో ఒక్క పరాజయం లేకుండా కప్పు ఎగరేసుకుపోయింది. టీమ్ ఇండియాకు ఇది మూడో ఛాంపియన్స్ ట్రోఫీ.

News March 9, 2025

మూడో సంతానంగా ఆడపిల్ల పుడితే రూ.50,000: టీడీపీ ఎంపీ

image

AP: మూడో బిడ్డకు జన్మనిచ్చే మహిళలకు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆఫర్ ప్రకటించారు. మూడో సంతానంగా ఆడపిల్లకు జన్మనిస్తే రూ.50,000, మగబిడ్డకు జన్మనిస్తే ఆవును బహుమానంగా ఇస్తానని ఓ కార్యక్రమంలో తెలిపారు. ఎక్కువ పిల్లల్ని కనాలని ప్రజలకు సీఎం చంద్రబాబు సూచిస్తున్న నేపథ్యంలో తాను ఈ ఆఫర్‌ను ప్రకటించినట్లు ఆయన పేర్కొన్నారు. దీనిపై మీ కామెంట్?