news

News March 9, 2025

CPIకి MLC టికెట్ ఇవ్వడంపై కాంగ్రెస్ సమాలోచనలు!

image

TG: MLA కోటా MLC అభ్యర్థులపై CM రేవంత్ సహా ముఖ్య నేతలు ఇవాళ AICC పెద్దలతో ఫోన్‌లో చర్చించనున్నారు. అసెంబ్లీలో ఆ పార్టీకున్న బలాన్ని బట్టి 4 పదవులు దక్కొచ్చు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తమకో సీటు ఇవ్వాలని CPI పట్టుబడుతోంది. INCలోనే పోటీ తీవ్రంగా ఉండటంతో CPIకి ఇప్పుడే ఇవ్వాలా? లేక గవర్నర్ కోటాలో ఇద్దామా? అని ముఖ్య నేతలు సమాలోచనలు చేస్తున్నారని తెలుస్తోంది. దీనిపై రాత్రిలోపు క్లారిటీ రానుంది.

News March 9, 2025

ఆసుపత్రిలో చేరిన ఉప రాష్ట్రపతి ధన్‌ఖడ్

image

భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అస్వస్థతకు గురయ్యారు. అర్ధరాత్రి ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్పించారు. ప్రస్తుతం ధన్‌ఖడ్‌ను క్రిటికల్ కేర్ యూనిట్(CCU)లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కార్డియాలజీ విభాగం అధిపతి డా. రాజీవ్ నారంగ్ నేతృత్వంలోని వైద్యుల బృందం ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తోంది.

News March 9, 2025

రాష్ట్రంలో కొత్త స్కీం.. మొదలైన సర్వే

image

APలో P-4 పేరుతో కొత్త <<15600961>>పథకాన్ని <<>>ఉగాది నుంచి ప్రభుత్వం అమలు చేయనుంది. 16 జిల్లాల్లో నిన్నటి నుంచి సర్వే మొదలైంది. మొత్తం పేదల్లో అట్టడుగున ఉండే 20% పేదలను గుర్తించేందుకు ప్రభుత్వం సర్వే చేస్తోంది. 27 ప్రశ్నలు అడిగి వివరాలు సేకరిస్తోంది. ఇంటి యజమాని ఆధార్, ఫోన్ నంబర్, టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, ఏసీ, ల్యాప్‌టాప్, కంప్యూటర్ ఉందా? కరెంట్ బిల్లు ఎంత కడుతున్నారు? వంటి ప్రశ్నలు అడుగుతున్నారు.

News March 9, 2025

రెండు రోజులు జాగ్రత్త

image

ఏపీలో ఎండలు మండుతున్నాయి. నిన్న రాయలసీమలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలులో అత్యధికంగా 39.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు రానున్న రెండు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో పగటి ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీల మేర పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తెలంగాణలోనూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.

News March 9, 2025

కుల్‌భూషణ్ జాదవ్ కిడ్నాప్‌కు సహకరించిన వ్యక్తి హతం

image

పాకిస్థాన్ జైల్లో మగ్గుతున్న భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ కిడ్నాప్‌కు సహకరించిన ముఫ్తీ షా మిర్‌ను గుర్తుతెలియని దుండగులు బలూచిస్థాన్‌లో కాల్చి చంపారు. 2016లో కుల్‌భూషణ్‌‌ను ఇరాన్-పాకిస్థాన్ బార్డర్‌లో పాక్ ఆర్మీ కిడ్నాప్ చేసింది. ప్రస్తుతం ఆయన అక్కడి జైల్లో ఉన్నారు. జాదవ్‌ను కిడ్నాప్ చేసిన బృందంలో సభ్యుడు, జైష్-అల్-అదిల్ నేత ముల్లా ఒమర్ ఇరానీ సైతం 2020లో హతమవ్వడం గమనార్హం.

News March 9, 2025

మళ్లీ కమ్‌బ్యాక్ ఇవ్వనున్న వీవీ వినాయక్?

image

స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ గత కొన్నేళ్లుగా సైలెంట్ అయిపోయారు. ఎట్టకేలకు ఆయన మళ్లీ మెగాఫోన్ పట్టనున్నారని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. విక్టరీ వెంకటేశ్‌తో ఓ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వెంకీ ఇప్పటికే స్క్రిప్ట్‌కు ఓకే చెప్పారని సమాచారం. నల్లమలుపు బుజ్జి నిర్మించొచ్చని సినీ వర్గాలంటున్నాయి. ఈ ముగ్గురి కాంబోలో 2006లో వచ్చిన ‘లక్ష్మీ’ సూపర్ హిట్టైన సంగతి తెలిసిందే.

News March 9, 2025

కేజీ చికెన్ ధర ఎంతంటే?

image

తెలుగు రాష్ట్రాల ప్రజలు బర్డ్‌ఫ్లూ భయం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. కొన్ని రోజులుగా కొత్త కేసులేవీ నమోదు కాకపోవడంతో చికెన్‌కు డిమాండ్ పెరుగుతోంది. హైదరాబాద్, ఆదిలాబాద్‌లో KG స్కిన్ లెస్ చికెన్ రూ.160-180గా ఉంది. ఖమ్మంలో రూ.150-170 ధర ఉంది. అటు ఏపీలోని విజయవాడలో కేజీ రూ.200, కాకినాడలో రూ.170-190, విశాఖలో రూ.190 వరకు పలుకుతోంది. మరి మీ ఏరియాలో చికెన్ రేట్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News March 9, 2025

19న అశోక్ లేల్యాండ్ యూనిట్ ప్రారంభం

image

AP: కృష్ణా(D) బాపులపాడు(మ) మల్లవల్లిలో అశోక్ లేల్యాండ్ బాడీబిల్డింగ్ తయారీ యూనిట్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 19న మంత్రి లోకేశ్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2018లో అప్పటి ప్రభుత్వం ఎకరం రూ.16.50 లక్షల చొప్పున 75 ఎకరాలు కేటాయించింది. ఇటీవలే పెండింగ్ పనులన్నీ పూర్తికాగా, ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. ఈ యూనిట్‌లో BS-6 ప్రమాణాలతో ఏటా 4,800 బాడీలు తయారుచేయగలరు.

News March 9, 2025

ఆలస్యమవుతున్న ‘రాజాసాబ్’? అదే కారణమా?

image

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ మూవీ ‘ది రాజాసాబ్’. ఈ సినిమా సింహభాగం షూటింగ్ పూర్తయింది. అయితే ఓ విచిత్రమైన పరిస్థితి కారణంగా పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యమవుతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకూ పూర్తైన ఫుటేజీ ఏకంగా మూడున్నర గంటలు ఉన్నట్లు తెలుస్తోంది. దాన్ని తగ్గించేందుకు మూవీ టీం చెమటోడుస్తోందని సినీవర్గాలంటున్నాయి. ప్రభాస్ ఇందులో తాత, మనవడి పాత్రల్లో కనిపిస్తారని టాక్.

News March 9, 2025

రూ.40వేల కోట్లతో అమరావతి పునర్నిర్మాణం

image

AP: రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు ఈ నెల 12-15 మధ్య అట్టహాసంగా తిరిగి ప్రారంభం కానున్నాయి. ₹48వేల కోట్లతో 73 పనులకు ప్రభుత్వం పరిపాలనా ఆమోదం తెలిపింది. వీటిలో ₹40వేల కోట్ల విలువైన 62 పనులకు టెండర్లు పిలవగా, ఫైనాన్షియల్ బిడ్ల పరిశీలన అనంతరం ఏజెన్సీలు ఖరారయ్యాయి. రేపటి సమీక్షలో సీఎం CBN వీటికి ఆమోదముద్ర వేయనున్నారు. ఈ పనుల కోసం వరల్డ్ బ్యాంక్, ADB, హడ్కోల ద్వారా GOVT ₹31వేల కోట్ల రుణం తీసుకోనుంది.