India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘ది ప్యారడైజ్’ మూవీ ఇప్పటికే సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా నుంచి మరో న్యూస్ వైరలవుతోంది. ఇందులో నాని ట్రాన్స్ జెండర్‌గా కనిపిస్తారని టాక్. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌లో రెండు జడలతో ఊర మాస్ లుక్‌లో నాని దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ ప్రచారంపై మూవీ యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

ఇంటర్నేషనల్ మాస్టర్ లీగ్ T20లో విండీస్‌పై ఇండియా మాస్టర్స్ విజయం సాధించింది. ముందుగా భారత్ బ్యాటింగ్ చేయగా రాయుడు(63), సౌరభ్(60), యువరాజ్(49) విధ్వంసంతో 20 ఓవర్లలో 253 పరుగులు చేసింది. ఛేదనలో విండీస్ మాస్టర్స్ పోరాడినా 246 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టులో స్మిత్(79), పెర్కిన్స్(52) రాణించారు. ఈ విజయంతో భారత జట్టు సెమీస్‌కు దూసుకెళ్లింది.

మహిళలు లిప్ స్టిక్‌తో పాటు తమకు రక్షణగా కత్తి, కారం పొడి వెంట ఉంచుకోవాలని మహారాష్ట్ర మంత్రి గులాబ్ రావు పాటిల్ సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్నా ఇప్పటికీ వారిపై అరాచకాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యువతులు స్వీయరక్షణ కోసం వీటిని వెంట తీసుకెళ్లాలని అభ్యర్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

1935: దిగ్గజ భారతీయ గణిత శాస్త్రవేత్త గణేశ్ ప్రసాద్ మరణం
1951: ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ జననం
1964: కవి కిరికెర రెడ్డి భీమారావు మరణం
1972: తెలుగు సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ జననం
1994: సినీ నటి దేవికారాణి మరణం
1997: ఉమ్మడి ఏపీ రెండో సీఎం బెజవాడ గోపాలరెడ్డి మరణం

విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఛావా’ మూవీ కలెక్షన్ల వర్షం కొనసాగుతోంది. విడుదలైన 22 రోజుల్లోనే రూ.502.7 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టినట్లు మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. తెలుగులోనూ రిలీజైన ఈ చిత్రం మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో రష్మిక, అక్షయ్ ఖన్నా కీలక పాత్రలు పోషించారు. మరాఠా యోధుడు శంభాజీ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

WPL 2025లో ప్లే ఆఫ్ ఆడే జట్లు ఖరారయ్యాయి. నిన్నటి మ్యాచులో పరాజయంతో ఆర్సీబీ ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. అంతకుముందు యూపీ వారియర్స్ సైతం నిష్క్రమించిన సంగతి తెలిసిందే. దీంతో ఢిల్లీ, ముంబై, గుజరాత్ ప్లే ఆఫ్ చేరాయి. ముంబై ఇంకా రెండు, గుజరాత్ ఒక లీగ్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. వీటి ఫలితాలతో పాయింట్ల ఆధారంగా ఎలిమినేటర్, ఫైనల్ ఆడే జట్లు ఖరారు కానున్నాయి.

గిగ్‌వర్కర్లు ఈ-శ్రమ్ పోర్టల్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని కేంద్రం తెలిపింది. ప్లాట్‌ఫామ్ అగ్రిగేటర్లు ఈ సమాచారాన్ని తమ వర్కర్లకు అందజేయాలని సూచించింది. గిగ్ వర్కర్లకు ఆయుష్మాన్ భారత్ పథకం కింద రూ.5లక్షల వరకూ ఆరోగ్య బీమా సదుపాయం కల్పించనున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారికి గుర్తింపు కార్డులు జారీ చేయనుంది.

మార్చి 9, ఆదివారం
ఫజర్: తెల్లవారుజామున 5.17 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.29 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.27 గంటలకు
అసర్: సాయంత్రం 4.45 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.25 గంటలకు
ఇష: రాత్రి 7.37 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Sorry, no posts matched your criteria.