news

News March 8, 2025

ఆ ఘటన తలిస్తే బాధేస్తుంది: చిరంజీవి

image

తాను ఆరోతరగతి చదువుతున్న సమయంలో తన సోదరికి అనారోగ్యం ఉండటంతో ఆసుపత్రిలో చేర్పించామని.. అయినప్పటికీ తన ప్రాణాలు దక్కలేదని చిరంజీవి అన్నారు. అమ్మతో కలిసి తానే సోదరి మృతదేహాన్ని తీసుకెళ్లానని తెలిపారు. నాన్న వచ్చేటప్పటికే కార్యక్రమాలు అయిపోయాయని, ఆ ఘటన తలుచుకుంటే ఇప్పటికీ బాధగా అనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మరో ఇద్దరు తోబుట్టువులు చిన్నతనంలోనే చనిపోయారని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

News March 8, 2025

రాష్ట్రానికి పదేళ్లు ‘చంద్ర గ్రహణం’ పట్టింది: సీఎం రేవంత్

image

TG: పదేళ్లుగా రాష్ట్రానికి పట్టిన చంద్ర గ్రహణం ఆడబిడ్డల ఆశీర్వాదంతో తొలగిపోయిందని CM రేవంత్ అన్నారు. దీంతో మహిళలు స్వేచ్ఛగా ఆత్మగౌరవంతో నిలబడ్డారని పేర్కొన్నారు. ‘మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేస్తేనే రాష్ట్రం 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అవుతుంది. వారు తల్చుకుంటే దానిని సాధించడం కష్టమేం కాదు. KCR పాలన, కాంగ్రెస్ పాలనకు మధ్య తేడాను మహిళలు గమనిస్తున్నారు’ అని పరేడ్ గ్రౌండ్ సభలో వ్యాఖ్యానించారు.

News March 8, 2025

AI ప్రిడిక్షన్: ఛాంపియన్స్ ట్రోఫీ విజేత ఎవరంటే?

image

రేపు జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో విజేత ఎవరనే దానిపై AI చాట్‌బోట్స్‌ను ప్రశ్నించగా భారత్‌ వైపే మొగ్గు చూపాయి. ఇరు జట్ల మధ్య టఫ్ ఫైట్ ఉన్నా ఇండియాకే ఎడ్జ్ ఉంటుందని ‘గూగుల్ జెమిని’ తెలిపింది. కచ్చితంగా భారతే గెలుస్తుందని ‘ ఓపెన్AI Chat GPT’, ‘మైక్రోసాఫ్ట్ కాపిలాట్’ స్పష్టం చేశాయి. తీవ్ర ఉత్కంఠ నెలకొన్న ఈ మ్యాచ్ విజేతను అంచనా వేయలేమని ‘డీప్ సీక్’ పేర్కొంది. మరి మీ ప్రిడిక్షన్ ఏంటి?

News March 8, 2025

తెలంగాణకు హైదరాబాద్, ఏపీకి CBN: లోకేశ్

image

విశాఖపట్నంలో ఎట్టి పరిస్థితుల్లో డేటాసెంటర్ ఏర్పాటు చేస్తామని మంత్రి లోకేశ్ అన్నారు. Y2K విప్లవంతో హైదరాబాద్ లబ్ధిపొందిందని, ప్రస్తుతం ఏపీ అభివృద్ధి చెందుతోందని తెలిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కేజీ టు పీజీ వరకూ మార్పులు చేపడుతున్నామని తెలిపారు. నైపుణ్య గణన కంటే కులగణన చాలా తేలికని, తెలంగాణకు హైదరాబాద్ బలమైతే ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు నాయుడు అడ్వాంటేజని మంత్రి పేర్కొన్నారు.

News March 8, 2025

రాత్రికి ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్

image

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి హస్తిన బాట పట్టనున్నారు. ఇవాళ రాత్రి శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఆయన ఢిల్లీ వెళ్తారు. రేపు ఏఐసీసీ పెద్దలను కలిసి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై తుది చర్చలు జరపనున్నారు. ఆయన భేటీ అనంతరం అభ్యర్థులు ఎవరనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అటు క్యాబినెట్ విస్తరణపైనా రేవంత్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.

News March 8, 2025

బండి సంజయ్ = విరాట్ కోహ్లీ.. ఫొటోలు వైరల్

image

TG: కేంద్రమంత్రి బండి సంజయ్‌ను క్రికెటర్ విరాట్ కోహ్లీతో పోల్చుతూ కరీంనగర్‌లో బ్యానర్లు వెలిశాయి. IND టీమ్‌కు విరాట్ కోహ్లీ లాగా BJPకి సంజయ్ ఉన్నారని పలువురు నేతలు బ్యానర్లు ఏర్పాటు చేశారు. ‘బండి సంజయ్ = BJP’s విరాట్ కోహ్లీ, PAKపై కోహ్లీ, కాంగ్రెస్‌పై సంజయ్ బెస్ట్ పెర్ఫార్మర్స్’ అంటూ ఆ బ్యానర్లపై రాసుకొచ్చారు. ఇటీవల ఇక్కడ జరిగిన MLC ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచిన సంగతి తెలిసిందే.

News March 8, 2025

గ్రూప్స్ ఫలితాలు నిలిపివేయండి.. సీఎంకు మందకృష్ణ లేఖ

image

TG: SC వర్గీకరణ జరిగే వరకూ అన్ని రకాల ఉద్యోగ పరీక్ష ఫలితాలను నిలిపివేయాలని CM రేవంత్‌కు మందకృష్ణ మాదిగ లేఖ రాశారు. ‘SC వర్గీకరణను అమలు చేస్తామని, గతంలో ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్లకూ వర్తింపజేస్తామని చెప్పారు. ఈనెల 12 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో SC వర్గీకరణ చట్టం చేస్తామని చెప్పి, మరోవైపు గ్రూప్-1, 2, 3 ఫలితాలను వెల్లడించేందుకు సిద్ధమయ్యారు. ఇలా చేస్తే మాదిగలు నష్టపోతారు’ అని పేర్కొన్నారు.

News March 8, 2025

హోలీ ఎప్పుడంటే?

image

‘హోలీ’ పండుగ ఎప్పుడనే అయోమయం నెలకొంది. పండితుల ప్రకారం దేశవ్యాప్తంగా ఈనెల 14న హోలీ జరగనుంది. 13న ‘హోలికా దహనం’ నిర్వహించనున్నారు. దీన్నే ‘చోటి హోలీ’, ‘కాముని దహనం’ అని కూడా అంటారు. హోలీ సందర్భంగా 14న పబ్లిక్ హాలిడే ఉండనుంది. ఈ పండుగకు సంబంధించి వివిధ పురాణ కథలు ప్రాచుర్యంలో ఉన్నా ఆనందాన్ని, ఐక్యత కలగలిసిన రంగుల పండుగే ‘హోలీ’. నేచురల్ కలర్స్‌తో పండుగ జరుపుకుందాం.. ప్రకృతిని కాపాడుదాం.

News March 8, 2025

ఛెత్రీ రిటైర్మెంట్ వెనక్కి: మాజీ కెప్టెన్ ఏమన్నారంటే?

image

సునీల్ ఛెత్రీ రిటైర్మెంటును వెనక్కి తీసుకోవడంపై ఫుట్‌బాల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇది టీమ్ఇండియాకు షార్ట్‌టర్మ్‌లో మేలు చేసినా లాంగ్‌టర్మ్‌లో కీడేనని మాజీ Capt బైచుంగ్ భుటియా అంటున్నారు. దేశ ఫుట్‌బాల్ ఎదగాలంటే బాల్యం నుంచే ఫార్వర్డ్స్‌కు దూకుడుగా శిక్షణనిచ్చే బ్రెజిల్, స్పెయిన్ విధానం అనుసరించాలని సూచించారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో సౌకర్యాలు కల్పించి, పటిష్ఠ ఎంపిక విధానం సృష్టించాలని కోరారు.

News March 8, 2025

ఉన్నత పదవులను మహిళలకు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్: రేవంత్

image

దేశ రాజకీయాలలో రాష్ట్రపతి, ప్రధాని, స్పీకర్ లాంటి ఉన్నత పదవులను మహిళలకు కట్టబెట్టిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలుతో దేశ, రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని కోరారు. మహిళా దినోత్సవం సందర్భంగా చాకలి ఐలమ్మ యూనివర్సిటీలో సీఎం ప్రసంగించారు. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం ఉచిత బస్సుతో పాటు మరెన్నో పథకాలు అమలు చేస్తోందని తెలిపారు.