news

News March 7, 2025

ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అమెరికా నుంచి మరో దేశానికి వెళ్లినట్లు సమాచారం. వీరిద్దరిని విచారిస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయని HYD పోలీసులు భావిస్తున్నారు. వారికి రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయడానికి కావాల్సిన ప్రక్రియను సీఐడీ పూర్తి చేసింది. రెడ్ కార్నర్ నోటీసులు జారీ కాగానే వాళ్లు ఎక్కడున్నా దొరికిపోతారని పోలీసులు చెబుతున్నారు.

News March 7, 2025

ఏపీ ప్రభుత్వ అప్పులు రూ.5.19 లక్షల కోట్లు: పయ్యావుల

image

AP: రాష్ట్ర అప్పులపై వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో రాతపూర్వక సమాధానమిచ్చారు. జూన్ 12, 2024 నాటికి ఏపీ ప్రభుత్వ అప్పులు రూ.5,19,192 కోట్లు, ప్రభుత్వ గ్యారంటీతో PSUల అప్పులు రూ.1,58,657 కోట్లు, GOVT గ్యారంటీ లేని PSU అప్పులు రూ.90,019 కోట్లు అని వెల్లడించారు. 2014 నుంచి సంవత్సరాల వారీగా అప్పుల వివరాల పీడీఎఫ్ కాపీ కోసం <>ఇక్కడ క్లిక్<<>> చేయండి.

News March 7, 2025

SHOCKING: వన్డే కెప్టెన్సీకి రోహిత్ గుడ్ బై?

image

ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన అనంతరం ODI కెప్టెన్సీకి రోహిత్ గుడ్ బై చెప్పే అవకాశం కనిపిస్తోంది. NDTV కథనం ప్రకారం.. చీఫ్ సెలక్టర్ అగార్కర్, కోచ్ గంభీర్‌తో జరిగిన సమావేశంలో రోహిత్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తర్వాతి ODI ప్రపంచకప్ సమయానికి టీమ్ ఇండియా కొత్త సారథిని తయారుచేసేందుకు ఇదే సమయమని ఆయన భావించినట్లు తెలుస్తోంది. ఫిట్‌నెస్ బాగున్నంత కాలం ప్లేయర్‌గా కొనసాగేందుకు ఆయన సుముఖత చూపించినట్లు సమాచారం.

News March 7, 2025

జెప్టో, బ్లింకిట్ యూజర్లు, సెల్లర్లకు షాక్!

image

లాభదాయకత, ఆదాయం పెంచుకొనేందుకు సెల్లర్లు, యూజర్లకు బ్లింకిట్, జెప్టో షాకివ్వబోతున్నట్టు తెలిసింది. యూజర్ల ఫీజు, సెల్లర్లు, బ్రాండ్ల కమీషన్ పెంచుతాయని సమాచారం. క్విక్ కామర్స్ వ్యాపారాలకు ఎక్కువ నగదు అవసరం అవుతోంది. ఇది ఇన్వెస్టర్లను కలవరపెడుతోంది. ఫలితంగా జొమాటో, స్విగ్గీ వంటి షేర్ల విలువలు పడిపోతున్నాయి. అందుకే యూనిట్ ఎకనామిక్స్‌ను బలోపేతం చేసుకోవాలని సదరు కంపెనీలు నిర్ణయించుకున్నాయి.

News March 7, 2025

ద్రవిడులు ఢిల్లీ నుంచి ఆదేశాలు తీసుకోరు: స్టాలిన్

image

కేంద్ర ప్రభుత్వంపై తమిళనాడు CM స్టాలిన్ విరుచుకుపడ్డారు. ద్రవిడులు జాతికి దిశానిర్దేశం చేస్తారు తప్ప ఢిల్లీ నుంచి ఆదేశాలు తీసుకోరని అన్నారు. ‘కేంద్ర విద్యామంత్రి మా రాష్ట్రంపై బలవంతంగా హిందీని రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. గెలుపనేదే లేని యుద్ధాన్ని ఆయన ప్రారంభించారు. చరిత్ర స్పష్టంగా ఉంది. తమిళనాడుపై హిందీని రుద్దడానికి ట్రై చేసినవారు ఓడిపోయారు లేదా తర్వాత మాతో కలిసిపోయారు’ అని గుర్తుచేశారు.

News March 7, 2025

‘తులం బంగారం’ హామీ అమలుపై మంత్రి క్లారిటీ

image

TG: ‘కళ్యాణ లక్ష్మీ’ పథకంలో భాగంగా తులం బంగారం ఇస్తామన్న హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మందగించడంతోనే దీనిని అమలు చేయడం ఆలస్యమవుతోందని తెలిపారు. అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇస్తామని, ఇప్పటికే పలు హామీలను నెరవేర్చామని పేర్కొన్నారు.

News March 7, 2025

హిందీపై స్టాలిన్ ప్రేలాపనలకు అర్థం లేదు: అన్నామలై

image

NEP అనుకూల సంతకాల సేకరణకు ప్రజల నుంచి సానుకూల స్పందన లభిస్తోందని TN BJP చీఫ్ అన్నామలై అన్నారు. హిందీపై CM స్టాలిన్‌ది నకిలీ ఉద్యమమని, ఆయన చెప్పేవన్నీ వ్యర్థ ప్రేలాపనలని విమర్శించారు. ‘https://puthiyakalvi.in/ ద్వారా మేం చేపట్టిన ఉద్యమానికి 36 గంటల్లోనే 2 లక్షల మందికి పైగా మద్దతిచ్చారు. రాష్ట్ర వ్యాప్త సంతకాల సేకరణకు ఊహించని స్పందన వస్తోంది. ఇక స్టాలిన్ ప్రేలాపనలకు అర్థంలేదు’ అని ట్వీట్ చేశారు.

News March 7, 2025

BREAKING: స్కూల్ విద్యార్థులకు GOOD NEWS

image

AP: విద్యార్థులపై బ్యాగ్ భారం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి లోకేశ్ అసెంబ్లీలో తెలిపారు. ఇకపై సెమిస్టర్ల వారీగా సబ్జెక్టుల పుస్తకాలను బైండ్ చేసి ఇస్తామన్నారు. అలాగే వారికి నాణ్యమైన యూనిఫామ్‌తో కూడిన కిట్ ఇస్తామని చెప్పారు. వన్ క్లాస్-వన్ టీచర్ విధానాన్ని 10K స్కూళ్లలో అమలు చేస్తామని వెల్లడించారు.

News March 7, 2025

త్వరలో టీచర్ల బదిలీల చట్టం: మంత్రి లోకేశ్

image

AP: విద్యావ్యవస్థలో టీచర్లది కీలక పాత్ర అని, వారిపై భారం ఉంటే పనిచేయలేరని మంత్రి లోకేశ్ చెప్పారు. ఉపాధ్యాయులపై ఒత్తిడి లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అసెంబ్లీలో తెలిపారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారి టీచర్ల బదిలీల చట్టం తీసుకొస్తున్నామని ప్రకటించారు. చాలా పారదర్శకంగా సీనియారిటీ జాబితాను టీచర్ల ముందు పెడతామని పేర్కొన్నారు. ఏదైనా తప్పులు ఉంటే వెంటనే కరెక్షన్ చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు.

News March 7, 2025

ఢిల్లీ బయల్దేరిన సీఎం రేవంత్

image

TG: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కోసం సీఎం రేవంత్ ఢిల్లీ బయల్దేరారు. అక్కడ ఏఐసీసీ పెద్దలతో చర్చించి అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు సమాచారం. అనంతరం ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం ఆయన హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. రేపు మహిళా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని అనంతరం మళ్లీ ఢిల్లీ వెళ్లనున్నారు.