news

News April 13, 2025

నేటి నుంచి అందుబాటులోకి హాల్ టికెట్స్

image

TG: మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల పాఠశాలల్లో 6, 7, 8, 9వ తరగతుల్లో బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీకి నిర్వహించే పరీక్ష హాల్ టికెట్లు నేటి నుంచి అందుబాటులో ఉండనున్నాయి. 6,835 సీట్లకు గానూ ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా ఎంట్రన్స్ ఎగ్జామ్ జరగనుంది. www.mjptbcwreis.telangana.gov.in లేదా https://mjptbcadmissions.org వెబ్‌సైట్ల నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని బీసీ గురుకుల సెక్రటరీ సైదులు తెలిపారు.

News April 13, 2025

ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధిపై ప్రణాళికకు CM ఆదేశం

image

AP: ఒంటిమిట్టను ఆధ్యాత్మిక గమ్యస్థానంగా మార్చేందుకు బృహత్తర ప్రణాళిక రూపొందించాలని CM చంద్రబాబు ఆదేశించినట్లు TTD ఛైర్మన్ BR నాయుడు తెలిపారు. పెరుగుతున్న యాత్రికుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలను సిద్ధం చేయాలని సమీక్షలో చెప్పారన్నారు. ఒంటిమిట్ట చెరువును సుందరీకరించి బోటింగ్ సౌకర్యం కల్పించాలని సూచించారని వివరించారు. అలాగే, నిత్యాన్నదానం కోసం భవనం నిర్మించాలని ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు.

News April 13, 2025

ఇందిరమ్మ ఇళ్లపై సీఎం కీలక సూచనలు

image

TG: ఇందిరమ్మ ఇళ్లను మొదటి దశలో అత్యంత నిరుపేదలకు, అర్హులకు మాత్రమే కేటాయించాలని CM రేవంత్ స్పష్టం చేశారు. ఈ పథకం పారదర్శకంగా, నిరుపేదలకు న్యాయం చేసేలా అమలు కావాలని ఉన్నతస్థాయి సమావేశంలో సూచించారు. లబ్ధిదారుల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీలు జాగ్రత్తగా పని చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు సిమెంట్, స్టీల్ తదితర సామగ్రిని సరసమైన ధరలకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

News April 13, 2025

ఇల్లు కొనాలనే తొందరలో తప్పులొద్దు!

image

సొంతిల్లు కొనాలనే తొందరలో కొందరు చేసే చిన్న తప్పులే మున్ముందు చాలా ఇబ్బందులు తెస్తాయి. ముందుగా అసలు ఇల్లు ఎందుకు కొనాలని అనుకుంటున్నామో స్పష్టత ఉండాలి. ఏ ప్రాంతంలో కొంటున్నాం? అక్కడ వృద్ధి ఎలా ఉంటుంది? అద్దెకు ఇస్తే ఆదాయం ఎంతొస్తుంది? ముందుగా అనుకున్న దాని కంటే ఎక్కువ మొత్తాన్ని వెచ్చిస్తున్నామా? తదితర ప్రశ్నలు వేసుకోకపోతే భవిష్యత్తు ఆర్థిక ప్రణాళికలు దెబ్బతింటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

News April 13, 2025

మటన్‌ను ఎంత తినాలి?

image

నాన్‌వెజ్ ప్రియులు మటన్‌ను ఇష్టంగా తింటారు. అయితే, అందులో కొవ్వులు ఎక్కువ ఉండటం వల్ల తగిన మోతాదులోనే తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్యవంతమైన వ్యక్తి వారానికి గ్రా.300, శారీరక శ్రమ చేసేవారు గ్రా.500 తినొచ్చని చెబుతున్నారు. గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు గ్రా.100 మించి తినకూడదు. అలాగే, సరిగా ఉడకని మటన్ తింటే ఫుడ్ పాయిజన్ అవుతుంది. కొందరికి అజీర్తి ఏర్పడి విరేచనాలు అవుతాయి.

News April 13, 2025

2026 ఎన్నికల్లో గెలుపు ఎన్డీయేదే: అన్నామలై

image

2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో NDA అధికారంలోకి వస్తుందని ఆ రాష్ట్ర బీజేపీ మాజీ చీఫ్ అన్నామలై ధీమా వ్యక్తం చేశారు. డీఎంకేను అధికారం నుంచి దించడమే లక్ష్యంగా AIADMK, బీజేపీ కలిసి పని చేస్తాయని తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల అమిత్ షా పర్యటన తర్వాత పార్టీ మరింత బలపడిందని చెప్పారు. తాను పార్టీ కోసం పని చేసే సాధారణ కార్యకర్తనని, తమ కొత్త అధ్యక్షుడిని బలోపేతం చేసే దిశగా పని చేస్తానని ఆయన వివరించారు.

News April 13, 2025

అన్యాయంపై ప్రశ్నిస్తే నోటీసులిస్తారా?: హరీశ్ రావు

image

TG: గ్రూప్-1 అభ్యర్థులకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించిన <<16075233>>రాకేశ్ రెడ్డి<<>>కి పరువు నష్టం దావా నోటీసులిస్తారా? అని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. అన్యాయాలను, అక్రమాలను నిలదీస్తే కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటూనే నియంతృత్వ పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోపణలు చేస్తే వాస్తవాలు బయటపెట్టాల్సింది పోయి నిరంకుశంగా వ్యవహరించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు.

News April 13, 2025

ఆ హీరోతో హీరోయిన్ అనుపమ డేటింగ్?

image

తమిళ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ డేటింగ్‌లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. స్పాటిఫైలో వీరిద్దరి పేరిట ‘బ్లూ మూన్’ అనే ప్లే లిస్ట్ కనిపించడం, వారు ముద్దు పెట్టుకున్నట్లుగా ప్రొఫైల్ పిక్చర్ ఉండడంతో డేటింగ్ వార్తలు పుట్టుకొచ్చాయి. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ‘బిసన్’ అనే సినిమా చేస్తున్నారు. దాని ప్రమోషన్ కోసమే ఇలా చేసి ఉంటారని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

News April 13, 2025

కీవ్‌లోని భారతదేశ ఫార్మా గౌడౌన్‌పై రష్యా దాడులు: ఉక్రెయిన్

image

తమ దేశంలోని కీవ్‌లో ఉన్న భారత్‌కు చెందిన ఓ ఫార్మా గో‌డౌన్‌పై రష్యా క్షిపణి దాడి చేసిందని ఉక్రెయిన్ ఆరోపించింది. భారత్‌తో మైత్రి ఉందని చెబుతూనే ఉద్దేశపూర్వకంగా ఆ దేశ వ్యాపారాలను మాస్కో టార్గెట్ చేస్తోందని INDలోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం పేర్కొంది. ఈ దాడితో పిల్లలు, వృద్ధుల కోసం ఉద్దేశించిన మందులు నాశనం అయినట్లు వివరించింది. కాగా, ఉక్రెయిన్ ఆరోపణలపై భారత్, రష్యా ప్రభుత్వాలు ఇంకా స్పందించలేదు.

News April 13, 2025

ALERT: నేడు 30 మండలాల్లో తీవ్ర వడగాలులు

image

AP: ఇవాళ రాష్ట్రంలోని 30 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని APSDMA తెలిపింది. అలాగే 67 మండలాల్లో వడగాలులు వీస్తాయని అంచనా వేసింది. శ్రీకాకుళం-7, విజయనగరం-11, మన్యం-10, ఏలూరు-1, ఎన్టీఆర్ జిల్లాలోని 1 మండలంలో తీవ్ర వడగాలులు వీస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలంది. స్థానిక వాతావరణం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ జాగ్రత్త పడాలని సూచించింది.