news

News March 6, 2025

ప్రియుడితో తమన్నా బ్రేకప్.. కారణమిదే?

image

హీరోయిన్ తమన్నా, విజయ్ శర్మ <<15649806>>విడిపోయారంటూ <<>>జరుగుతున్న ప్రచారానికి వాళ్ల మధ్య వచ్చిన మనస్పర్థలే కారణంగా తెలుస్తోంది. మిల్కీ బ్యూటీ త్వరగా పెళ్లి చేసుకుని సెటిల్ కావాలనుకుంటుండగా విజయ్ నుంచి సానుకూలత రాలేదని సమాచారం. అలాగే ఆమె నియంత్రించే స్వభావం కారణంగా ఇరువురి మధ్య తరచూ విభేదాలు వస్తున్నాయని టాక్. ఈ కారణాలతోనే వారు విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

News March 6, 2025

మిల్లర్ సిక్స్.. బంతితో స్టేడియం నుంచి పరార్!

image

ఛాంపియన్స్ ట్రోఫీ రెండో సెమీఫైనల్లో విచిత్రమైన సంఘటన జరిగింది. సౌతాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ డీప్ కవర్ వైపు భారీ సిక్సర్ కొట్టారు. దీంతో బంతిని పట్టుకున్న ఇద్దరు వ్యక్తులు లాహోర్ స్టేడియం నుంచి బయటకు పరుగులు తీశారు. ఐసీసీ ఈవెంట్లో ఇలా జరగడం మొదటిసారి అని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, టీమ్‌ను గెలిపించేందుకు మిల్లర్ చేసిన పోరాటం అనిర్వచనీయమని నెట్టింట ప్రశంసలొస్తున్నాయి.

News March 6, 2025

ఎమ్మెల్సీగా నాగబాబు.. అంబటి సెటైర్లు

image

AP: ఎమ్మెల్యే కోటాలో జనసేన నేత <<15658136>>నాగబాబును<<>> ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు Xలో సెటైర్లు వేశారు. ‘అన్నను దొడ్డిదారిలో మంత్రివర్గంలోకి తీసుకురావడంలో ఘన విజయం సాధించిన తమ్ముడికి శుభాకాంక్షలు’ అని రాసుకొచ్చారు. నాగబాబు, పవన్ కళ్యాణ్‌లను ట్యాగ్ చేశారు.

News March 6, 2025

తొలి 5 సెంచరీలు ఐసీసీ టోర్నీల్లోనే.. రచిన్ రికార్డ్

image

న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర వన్డేల్లో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. తన తొలి 5 సెంచరీలనూ ఐసీసీ టోర్నీల్లోనే చేసిన తొలి ఆటగాడిగా నిలిచారు. 2023 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌పై 123*, ఆసీస్‌పై 116, పాక్‌పై 108, CT-2025లో బంగ్లాపై 112, నిన్న సౌతాఫ్రికాపై 108 రన్స్ బాదారు. కాగా ఇప్పటివరకు 32 వన్డేలు ఆడిన రచిన్ 44.29 యావరేజ్, 108.72 స్ట్రైక్ రేటుతో 1,196 పరుగులు చేశారు.

News March 6, 2025

ఘోర ప్రమాదాలు.. 10 మంది మృతి

image

AP వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి జరిగిన 4 వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 10 మంది మృతి చెందారు. HYD నుంచి కాకినాడ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు ఏలూరు(మ) సోమవరప్పాడులో లారీని ఢీకొని ముగ్గురు చనిపోయారు. చిత్తూరు ఇరువారం జంక్షన్ వద్ద బైకును కారు ఢీకొట్టడంతో ఇద్దరు, విశాఖ కంచరపాలెంలో చెట్టును బైక్ ఢీకొట్టి ఇద్దరు, నిన్న రాత్రి గువ్వలచెరువు ఘాట్‌లో కారును తప్పించబోయి లారీ లోయలో పడి ముగ్గురు మృతి చెందారు.

News March 6, 2025

రాహుల్‌పై కోర్టు ఆగ్రహం.. జరిమానా ఎంతంటే?

image

లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీకి ఉత్తరప్రదేశ్‌లోని లక్నో‌కోర్టు రూ.200 జరిమానా విధించింది. సావర్కర్‌పై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో బుధవారం విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే వేరే కార్యక్రమాలు ఉన్నందున రాలేరని రాహుల్ తరపు న్యాయవాది తెలిపారు. దీంతో కోర్టు ఆగ్రహాం వ్యక్తం చేసింది. ఏప్రిల్ 14న తప్పనిసరిగా హాజరుకావాలని లేనిచో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీచేసింది.

News March 6, 2025

Stock Markets: అప్రమత్తంగా ఇన్వెస్టర్లు..

image

దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాటుగా చలిస్తున్నాయి. నిఫ్టీ 22,271 (-62), సెన్సెక్స్ 73,502 (-231) వద్ద ట్రేడవుతున్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. US జాబ్‌డేటా, వడ్డీరేట్ల తగ్గింపు ప్రకటన కోసం వేచి చూస్తున్నారు. O&G, మీడియా, మెటల్, ఎనర్జీ, బ్యాంకు, రియాల్టి షేర్లు ఎగిశాయి. కన్జూమర్ డ్యురబుల్స్, ఫైనాన్స్, FMCG షేర్లు స్వల్పంగా ఎరుపెక్కాయి.

News March 6, 2025

దువ్వాడపై కేసు నమోదు

image

AP: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై గుంటూరు నగరపాలెం స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రశ్నించకుండా ఉండేందుకు Dy.CM పవన్‌కు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నెలకు రూ.50 కోట్లు ఇస్తున్నారని ఆయన ఇటీవల <<15565359>>ఆరోపించారు.<<>> ఇవి అనుచిత వ్యాఖ్యలంటూ జనసేన నేత అడపా మాణిక్యాలరావు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదైంది. మరికొన్ని చోట్ల కూడా జనసేన కార్యకర్తలు దువ్వాడపై ఫిర్యాదులు చేస్తున్నారు.

News March 6, 2025

AIRPORT EFFECT.. ఎకరం రూ.2 కోట్లపైనే!

image

TG: వరంగల్ మామూనూరులో ఎయిర్‌పోర్టు అందుబాటులోకి రానుండటంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. నిర్వాసిత ప్రజలు భూములు ఇచ్చేందుకు అంగీకరించడం లేదు. ఎకరానికి రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు చెల్లించేందుకు అధికారులు కసరత్తు చేస్తుండగా రైతులు ససేమిరా అంటున్నారు. భూమికి భూమితో పాటు మార్కెట్ ధర చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామానికి రోడ్డు, పిల్లలకు ఎయిర్‌పోర్టులో ఉద్యోగాలు కల్పించాలని కోరుతున్నారు.

News March 6, 2025

నేటి అర్ధరాత్రి నుంచి ఓటీటీలోకి ‘తండేల్’

image

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘తండేల్’ మూవీ ఇవాళ అర్ధరాత్రి ఓటీటీలోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళంలో కూడా ఈ మూవీ ప్రసారం కానుంది. చందూ మొండేటి తెరకెక్కించిన ఈ మూవీ గత నెల 7న థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టి సత్తా చాటింది.