news

News March 6, 2025

ప్రణయ్ హత్య కేసు.. 10న తీర్పు

image

TG: మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ఈ నెల 10న NLG అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు ఇవ్వనుంది. కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్నాడన్న కక్షతో మారుతీరావు సుపారీ గ్యాంగ్‌తో ఈ హత్య చేయించాడని పోలీసులు రిపోర్టులో పేర్కొన్నారు. 78 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టి, ఎనిమిది మంది నిందితులపై ఛార్జ్‌షీటు దాఖలు చేశారు. A1 మారుతీరావు ఆత్మహత్య చేసుకోగా, తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

News March 6, 2025

నేటి పరీక్షకు ఎంపిక చేసిన సెట్ ఇదే

image

ఏపీలో ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఫస్టియర్ విద్యార్థులకు మ్యాథ్స్ 1A, బోటనీ పేపర్-1, సివిక్స్ పేపర్-1 సబ్జెక్టులకు పరీక్ష ఉంది. వీటికి సెట్ నెంబర్ 2 ప్రశ్నపత్రం ఎంపిక చేసినట్లు బోర్డు వెల్లడించింది.

News March 6, 2025

రాష్ట్రంలో లెన్స్‌కార్ట్ భారీ పెట్టుబడులు

image

TG: ప్రముఖ బ్రాండెడ్ కళ్లజోళ్ల పరిశ్రమల్లో ఒకటైన లెన్స్‌కార్ట్ రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధమైంది. తుక్కుగూడలో ఉన్న నాన్ సెజ్ జనరల్ పార్కులో ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయనుంది. రూ.1500 కోట్లతో ఏర్పాటు చేసే ఈ పరిశ్రమకు మంత్రి శ్రీధర్‌బాబు ఇవాళ శంకుస్థాపన చేస్తారు. గత డిసెంబర్‌లోనే ప్రభుత్వంతో ఒప్పందం జరగ్గా, ఇక్కడి నుంచి ప్రపంచ దేశాలకు కళ్లద్దాలను ఎక్స్‌పోర్ట్ చేయనున్నారు.

News March 6, 2025

రవితేజ కొత్త చిత్రం ‘అనార్కలి’?

image

కిశోర్ తిరుమల డైరెక్షన్‌లో రవితేజ ఓ చిత్రంలో నటించనున్నట్లు సమాచారం. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే ఈ సినిమాకు ‘అనార్కలి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో కయాదు లోహర్, మమతా బైజు హీరోయిన్లుగా నటిస్తారని టాక్. వచ్చే సంక్రాంతికి చిత్రాన్ని రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

News March 6, 2025

రేపటి నుంచి పంచాయతీల్లో ఆన్‌లైన్ వసూళ్లు

image

AP: పంచాయతీల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆన్‌లైన్ పన్ను వసూలు విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు ‘స్వర్ణ పంచాయతీ’ పోర్టల్‌ను ప్రారంభించనున్నారు. క్యూఆర్ స్కానర్ల ద్వారా సిబ్బంది ఆస్తి, లీజులు, ఇతర పన్నులను వసూలు చేస్తారు. దీనిద్వారా రూ.250 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా. కాగా రాష్ట్రంలోని గ్రామాల్లో ఇళ్లు, షాపులు, ఇతర భవనాలు 85 లక్షల వరకు ఉన్నట్లు తేలింది.

News March 6, 2025

CT: 25 ఏళ్ల ప్రతీకారం తీర్చుకుంటారా?

image

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరుకున్నాయి. కాగా ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్‌పై భారత్‌కు అంత గొప్ప రికార్డులేమీ లేవు. ఆ జట్టుతో ఆడిన రెండు ఫైనల్స్‌లోనూ టీమ్ ఇండియా ఓటమి చవిచూసింది. గతంలో 2000 CT ఫైనల్, 2021 WTC ఫైనల్‌లో ఇరు జట్లు తలపడ్డాయి. రెండు సందర్భాల్లోనూ కివీస్‌దే పైచేయి. మరోవైపు కివీస్ ఐసీసీ టోర్నీల్లో భారత్ తప్ప మిగతా జట్లతో ఆడిన నాలుగు ఫైనల్స్‌లోనూ ఓడిపోవడం గమనార్హం.

News March 6, 2025

నంద్యాలలో దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత

image

AP: నంద్యాల జిల్లాలో దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలోని ఆత్మకూరులో నిన్న 40.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే ప్రకాశం జిల్లాలోని కొనకనమిట్లలో 40, కృష్ణా జిల్లా కంకిపాడులో 39.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావారణ శాఖ తెలిపింది. రాష్ట్రంపైకి పొడిగాలులు వీయడం వల్లే ఎండలు మండిపోయినట్లు పేర్కొంది. ఇవాళ కూడా సాధారణం కంటే 4 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని అంచనా వేసింది.

News March 6, 2025

ఉ.11 గంటల్లోపే ఉపాధి పనులు.. ఆదేశాలు జారీ

image

AP: ఎండలు పెరిగిన నేపథ్యంలో ఉపాధి హామీ పనులను ఉ.6 నుంచి 11 గంటల్లోపే ముగించాలని ప్రభుత్వం కలెక్టర్లు, డ్వామా పీడీలను ఆదేశించింది. అవసరమైతే సా.4 నుంచి 6 గంటల వరకు పనులు కొనసాగించాలని పేర్కొంది. పని ప్రదేశాల్లో నీటి వసతి, నీడ ఉండేలా షెడ్స్ ఏర్పాటు చేయాలంది. ప్రథమ చికిత్స కిట్లు, ORS ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని పేర్కొంది.

News March 6, 2025

కార్గిల్ యుద్ధంపై వెబ్ సిరీస్?

image

దేశ చరిత్రలో కీలకమైన కార్గిల్ యుద్ధంపై నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సిరీస్ తెరకెక్కించనున్నట్లు సమాచారం. పాక్ సైన్యాన్ని తరిమికొట్టేందుకు వాయుసేన చేపట్టిన ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ ఘట్టాన్ని ఇందులో చూపిస్తారని తెలుస్తోంది. సిద్ధార్థ్, జిమ్మీ షెర్గిల్, అభయ్ వర్మ, మిహిర్ కీలక పాత్రల్లో నటిస్తారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని టాక్.

News March 6, 2025

వీర్యం నాణ్యతగా ఉంటే దీర్ఘాయుష్షు?

image

నాణ్యమైన వీర్యం ఉన్న వ్యక్తులు ఇతరుల కంటే రెండు మూడేళ్లు ఎక్కువగా బతుకుతారని డెన్మార్క్‌లోని కోపెన్ హెగెన్ వర్సిటీ సైంటిస్టులు గుర్తించారు. వీరు 50 ఏళ్లుగా 80 వేల మంది పురుషులపై స్టడీ చేశారు. శుక్ర కణాల సంఖ్య 120 మిలియన్లకుపైగా ఉన్నవారు 5 మిలియన్లు ఉన్న వారి కంటే 2.7 సంవత్సరాలు ఎక్కువగా బతుకుతారని తెలిపింది. స్పెర్మ్ క్వాలిటీ ఉండేవారు 80.3, తక్కువగా ఉండేవారు 77.7 ఏళ్లు జీవిస్తారని పేర్కొంది.