India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అమెరికా ఏ యుద్ధాన్ని కోరుకుంటే ఆ యుద్ధాన్నిస్తామని చైనా రాయబార కార్యాలయం తాజాగా తేల్చిచెప్పింది. ‘ఫెంటానిల్ డ్రగ్ అనేది సుంకాలు పెంచేందుకు అమెరికా చూపిస్తున్న ఓ కారణం మాత్రమే. వాణిజ్యమైనా, మరే రూపంలోనైనా అమెరికా కోరుకునేది యుద్ధమే అయితే అది ఇచ్చేందుకు, చివరి వరకూ పోరాడేందుకు మేం సిద్ధం’ అని స్పష్టం చేసింది.

విక్కీ కౌశల్, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఛావా’ హిందీ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. 19 రోజులకు రూ.471 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించింది. ఎల్లుండి తెలుగులోనూ రిలీజ్ కానుండటంతో ఈ వారాంతానికి రూ.500 కోట్ల మార్క్‌ను చేరుకునే అవకాశం ఉంది. మరాఠా యోధుడు శంభాజీ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇందులో విక్కీ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

సత్యవర్ధన్ అపహరణ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీని మరోసారి కస్టడీకి అనుమతించాలని విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టును పోలీసులు కోరారు. ఆయన్ను మరింత విచారించాల్సిన అవసరం ఉందని, కేసు విషయమై పూర్తి సమాచారం తెలుసుకునేందుకు 10రోజుల కస్టడీకి అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈరోజు న్యూజిలాండ్, సౌతాఫ్రికా మధ్య సెకండ్ సెమీ ఫైనల్ జరుగుతోంది. లాహోర్ స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిన్న జరిగిన తొలి సెమీస్‌లో ఆస్ట్రేలియాపై ఇండియా గెలుపొంది ఫైనల్‌లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న విషయం తెలిసిందే.

పల్లెల్లో ఉన్న ప్రేమలు పట్టణాల్లో ఉండవంటుంటారు. కానీ, అది తప్పని ఢిల్లీ ఘటనలో నిరూపితమైంది. శుభం అనే వ్యక్తి సొంతూరికి వెళ్లేందుకు ‘ఢిల్లీ కాంట్’ రైల్వే స్టేషన్‌కు వెళ్లేందుకు ఆటో ఎక్కాడు. అయితే, మాటల్లో పడి వేరే స్టేషన్‌కు వెళ్లగా మరో ఆటోలో ఉన్న వృద్ధురాలు & ఆటో డ్రైవర్ అతనికి సాయం చేశారు. ఎక్కువ డబ్బులిచ్చినా తీసుకోకుండా సమయానికి తీసుకెళ్లి హెల్ప్ చేశారని అతను చేసిన ట్వీట్ వైరలవుతోంది.

అమెరికాను ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టే అవకాశం కనిపిస్తోంది. ఓవైపు ట్రంప్ టారిఫ్స్ వల్ల ప్రొడక్షన్‌పై దెబ్బపడేలా ఉంది. మరోవైపు కంపెనీలు వేలాది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతున్నాయి. మార్చిలో తీసివేతలు ఉంటాయని 100కు పైగా సంస్థలు ఉద్యోగులకు WARN నోటీసులు ఇచ్చాయి. ఒక్కో కంపెనీ 50 నుంచి 500 మందికి పైగా తీసేస్తాయని సమాచారం. టెక్ ఇండస్ట్రీలోనే కోత ఎక్కువగా ఉండనుంది. దీంతో ఆందోళన నెలకొంది.

దేశీయ స్టాక్‌మార్కెట్ల నుంచి FII, FPIలు వెళ్లిపోవడానికి పెంచిన క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, STTలే కారణమని కొందరు ఆరోపిస్తున్నారు. PM మోదీ, FM నిర్మలపై మీమ్స్ షేర్ చేస్తున్నారు. ప్రపంచంలో మరెక్కడా మన స్థాయిలో లేవని విమర్శిస్తున్నారు. వారు చెప్తోందని తప్పని PWC డేటా చెబుతోంది. మనతో పోలిస్తే బ్రెజిల్, మెక్సికో, సౌదీ, ఉజ్బెక్ సహా కొన్ని దేశాల్లో విదేశీయులు 20-35% మేర LTCG, STCG చెల్లించాల్సి ఉంటుంది.

AP: జర్మనీ పర్యటనలో ఉన్న పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్ రెండో రోజు బెర్లిన్ సదస్సులో పాల్గొన్నారు. రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాలపై ప్రపంచ మీడియా ప్రతినిధులకు వివరించారు. ‘అంతర్జాతీయ పర్యాటక పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానంగా మారేందుకు ఈ సదస్సు ఉపకరిస్తుందని ఆశిస్తున్నాం. దక్షిణ భారత పర్యాటకానికి ఏపీ ముఖద్వారం. సుదీర్ఘ సముద్రతీరం, అందమైన బీచ్‌లు, ప్రకృతి రమణీయ ప్రాంతాలు ఏపీ సొంతం’ అని పేర్కొన్నారు.

ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ పంపిన లేఖ అందిందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. రెండు దేశాలకు ప్రయోజనం చేకూర్చే మినరల్ డీల్‌పై నెగోషియేషన్‌కు ఆయన ఆసక్తి ప్రదర్శించారని అన్నారు. ‘రష్యా, ఉక్రెయిన్ వివాదం ఆపేందుకు అవిశ్రాంతంగా పనిచేస్తున్నా. ప్రతివారం రెండు దేశాలకు చెందిన వందలమంది మరణిస్తున్నారు. మరో ఐదేళ్లు యుద్ధాన్ని ఇలాగే కొనసాగనిద్దామా’ అని ప్రశ్నించారు.

TG: తనను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేసినంత మాత్రాన BC ఉద్యమం ఆగదని MLC తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. HYD ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన తప్పు అని, ఆ చిత్తు కాగితం తగలబెట్టడం తప్పా? అని ప్రశ్నించారు. కులగణన దేశానికి ఆదర్శంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. KCR సమగ్ర కుటుంబ సర్వే పకడ్బందీగా చేశారని, నూటికి నూరు శాతం చేస్తేనే సర్వే ఆదర్శం అవుతుందని తెలిపారు.
Sorry, no posts matched your criteria.