India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఏపీలో ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇవాళ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లిష్ సబ్జెక్టు పరీక్ష ఉంది. దీనికి సెట్ నెంబర్ 1 ఎంపిక చేసినట్లు బోర్డు వెల్లడించింది.

AP: ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌టికెట్లను బ్లాక్ అండ్ వైట్ ప్రింట్‌లో మాత్రమే తీసుకుని రావాలని అధికారులు సూచించారు. కలర్ ప్రింట్‌తో తీసుకొస్తే పరీక్షకు అనుమతించబోమని స్పష్టం చేశారు. వెబ్‌సైట్, వాట్సాప్‌లలో హాల్‌టికెట్లు అందుబాటులో ఉండటంతో కొందరు కలర్ పేపర్లపై ప్రింట్లు తీసుకొస్తున్నారని తెలిపారు. కాగా ఇంటర్ ఎగ్జామ్స్ ఈ నెల 20 వరకు కొనసాగనున్నాయి.

TG: BRS నుంచి కాంగ్రెస్‌లో చేరిన MLAలపై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. స్పీకర్ వద్ద విచారణ ప్రక్రియ MLAల పదవీకాలం ముగిసేంత వరకూ సాగాలా? అని ప్రశ్నించింది. ఇలాగే జరిగితే ప్రజాస్వామ్యం ఏం కావాలని నిలదీసింది. దీనిపై వివరణ ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శి, EC, ప్రతివాదులందరికీ కోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ నెల 25కి విచారణ వాయిదా వేసింది.

నిన్న ఆత్మహత్యాయత్నం చేసిన సింగర్ కల్పన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె స్పృహలోకి వచ్చారని తెలిపారు. అటు <<15653135>>కల్పన<<>> ఆత్మహత్యాయత్నం వెనుక ఆమె రెండో భర్త ప్రసాద్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో పోలీసులు ఆయనను విచారిస్తున్నారు. మరోసారి కల్పన ఇంట్లో తనిఖీలు కూడా చేపట్టారు. మరోవైపు తాను పనిమీద రెండు రోజుల క్రితం బయటకు వెళ్లినట్లు పోలీసులకు ప్రసాద్ తెలిపారు.

కాంగ్రెస్‌లో క్రమశిక్షణ తప్పితే చర్యలుంటాయని TPCC ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. ఎవరి తీరుపై అసంతృప్తి ఉన్నా అంతర్గత సమావేశాల్లో చెప్పాలన్నారు. మీడియా ముందు, సోషల్ మీడియాలో వాటిని చెప్పొద్దని హెచ్చరించారు. సీనియర్లకు ప్రాధాన్యత దక్కడం లేదని మెదక్ పార్లమెంట్ స్థానం స్థాయి భేటీలో సీనియర్లు వాపోయారు. దీంతో పదేళ్లకు పైగా పని చేసిన వారికి పీసీసీలో చోటు కల్పిస్తామని మీనాక్షి హామీ ఇచ్చారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ మూవీపై ఓ క్రేజీ రూమర్ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో బన్నీ సరసన ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో మెయిన్ ఫీమేల్ లీడ్‌గా జాన్వీ కపూర్ నటించనున్నట్లు సమాచారం. అమెరికన్, కొరియన్ హీరోయిన్లను కూడా తీసుకోవాలని అట్లీ భావిస్తున్నట్లు టాక్. ఈ సినిమా కోసం బన్నీ విదేశీ శిక్షణ కూడా పూర్తి చేసుకున్నారు.

AP: సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఆయన అక్కడ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు. ఇవాళ రాత్రి తిరిగి వైజాగ్ చేరుకుంటారు. రేపు ఉదయం తన తోడల్లుడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ సభలో పాల్గొంటారు. మళ్లీ 6వ తేదీ మధ్యాహ్నం ఢిల్లీ వెళ్తారు. 7న ఢిల్లీ నుంచి తిరిగి అమరావతి చేరుకుంటారు.

TG: స్కూళ్లలో మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి ప్రతినెలా ఒకటో తేదీనే బిల్లులు చెల్లించేందుకు కసరత్తు చేస్తోంది. తొలుత పెద్దపల్లి, కొత్తగూడెం జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. ప్రతినెలా ఎంత మంది విద్యార్థులు భోజనం చేశారో MDM యాప్‌లో నమోదు చేయగానే బిల్లు జనరేట్ అయ్యేలా మార్పులు చేయనుంది. బిల్లుకు HM, MEO ఆమోదం తెలపగానే ఖాతాల్లో బిల్లు మొత్తం జమ అవుతుంది.

ఛాంపియన్స్ ట్రోఫీ రెండో సెమీ ఫైనల్‌లో ఇవాళ సౌతాఫ్రికా, న్యూజిలాండ్ తలపడనున్నాయి. రెండు జట్లూ సమతూకంగా ఉండటంతో పోటీ ఆసక్తికరంగా ఉండనుంది. మ.2.30కు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐసీసీ టోర్నీల్లో చివరి మెట్టులో బోల్తా పడే వీక్‌నెస్‌ను అధిగమించాలని ఈ టీమ్‌లు ఆరాటపడుతున్నాయి. నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం భారత్‌ను ఢీకొట్టనుంది. ఇవాళ ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.

AP: తనపై కర్నూలు, పాతపట్నం, విజయవాడ, ఆదోనిలో నమోదైన కేసులను కొట్టేయాలని కోరుతూ పోసాని కృష్ణమురళి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇవి రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ‘మతం, జాతి, నివాసం, భాష ఆధారంగా విద్వేషాలను రెచ్చగొట్టేలా నేను వ్యాఖ్యలు చేయనందున BNS సెక్షన్ 196(1) కింద కేసు నమోదు చెల్లదు. నన్ను తప్పుడు కేసుల్లో ఇరికించారు. 41A కింద నోటీసు ఇచ్చి వివరణ మాత్రమే తీసుకోవాలి’ అని కోరారు.
Sorry, no posts matched your criteria.