India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వార్-2 మేకర్స్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఎన్టీఆర్-హృతిక్ రోషన్‌లతో ఒక భారీ సాంగ్ షూటింగ్ ఇవాళ్టి నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వీరిద్దరి స్టెప్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయన్నారు. క్లైమాక్స్ ఫైట్‌కు ముందు వచ్చే ఈ పాటని 500 మందితో డ్యాన్సర్లతో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ప్రీతమ్ మ్యూజిక్ అందించగా బాస్కో మార్టిస్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఇందులో యంగ్ టైగర్ ‘RAW’ ఏజెంట్‌గా నటిస్తున్నారు.

‘సూర్య’ వెబ్ సిరీస్ చూశారా? అందులో టాలెంట్ ఉన్న సూర్యకు కాకుండా మహిళకు జాబ్ ఇచ్చేందుకు కంపెనీ మొగ్గుచూపుతుంది. బెంగళూరుకు చెందిన ఓ యువకుడికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ‘ఓ ఇంటర్వ్యూకు వెళ్లి దాదాపు 5 గంటలు వేచి ఉన్నా. నిమిషం మాత్రమే ఇంటర్వ్యూ చేసి ఇంగ్లిష్ వంకతో రిజెక్ట్ చేశారు. కంపెనీ HR మహిళా అభ్యర్థికి అనుకూలంగా ఉన్నాడు’ అని అతను రెడిట్‌లో వాపోయాడు. ఈ పోస్ట్ వైరలవుతోంది. మీకూ ఇలా జరిగిందా?

AP: ‘తల్లికి వందనం’ పథకంపై మంత్రి నారా లోకేశ్ శాసనమండలిలో కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ఈ పథకం గైడ్‌లైన్స్ విడుదల చేస్తామని ప్రకటించారు. పథకంపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. మే నెలలో ఈ పథకాన్ని ప్రారంభిస్తామని, బడ్జెట్‌లో రూ.9407 కోట్ల కేటాయించినట్లు తెలిపారు. కాగా ఈ పథకం కింద 1-12వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ప్రభుత్వం రూ.15,000 జమ చేయనుంది.

AP: పోలవరం ఎత్తును 41.15 మీటర్లకు కుదిస్తూ వైసీపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందని మంత్రి నిమ్మల రామానాయుడు అసెంబ్లీలో ఆరోపించారు. జగన్ సర్కార్ ప్రాజెక్టును నిలిపేసిందని, డయాఫ్రంవాల్ కొట్టుకుపోయేలా చేసిందని విమర్శించారు. 2025 కల్లా పోలవరం ఎడమ కాలవ పనులు పూర్తిచేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి రాయలసీమ, ఉత్తరాంధ్రకు నీటిని తరలిస్తామని హామీ ఇచ్చారు.

సీఏ ఇంటర్మీడియట్ కోర్సు ఫలితాలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా(ICAI) ఈరోజు ప్రకటించింది. రిజిస్ట్రేషన్ నంబర్, రోల్ నంబర్ ఎంటర్ చేస్తే రిజల్ట్స్ అందుబాటులోకి వస్తాయి. ఈ ఏడాది జనవరిలో 11, 13, 15, 17, 19, 21 తేదీల్లో ఈ పరీక్షను నిర్వహించారు. ఫలితాల కోసం ఇక్కడ <

AP: గంజాయి, డ్రగ్స్ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. మాదకద్రవ్యాల కేసుల్లో పట్టుబడిన వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలను నిలిపేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమైనట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. త్వరలోనే క్యాబినెట్‌లో చర్చించి ఆమోదించనున్నట్లు తెలిపాయి.

TG: ఆస్తి కోసం తల్లినే చంపేసిన దారుణ ఘటన సంగారెడ్డి(D) తెల్లాపూర్‌లో జరిగింది. మల్లారెడ్డి, రాధికారెడ్డి దంపతుల చిన్న కుమారుడు కార్తీక్ మద్యానికి బానిసయ్యాడు. కోయంబత్తూరులోని డీఅడిక్షన్‌లో చేర్చినా అతనిలో మార్పు రాలేదు. తిరిగొచ్చాక రూ.100 కోట్ల విలువైన భూమిని తనకు ఇవ్వాలంటూ పేరెంట్స్‌ను వేధించేవాడు. నిన్న నిద్రిస్తున్న తల్లిని కత్తితో 9చోట్ల పొడిచి చంపేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ సహా చాలా నగరాలు, పట్టణాల్లో ఇంటి అద్దెలు విపరీతంగా ఉంటున్నాయి. అగ్గిపెట్టెల్లాంటి ఇళ్ల అద్దెలూ నోరెళ్లబెట్టేలానే ఉన్నాయి. నెలజీతంలో సగం ఇంటి అద్దెకే పోతోందని చిరు ఉద్యోగులు వాపోతున్నారు. నీళ్లు, ఇతర సౌకర్యాలు లేకపోయినా అద్దెలు ఆకాశాన్నే తాకుతున్నాయి. ఒక ప్రాతిపదిక అనేది లేకుండా ఓనర్లు ఇష్టారీతిన పెంచే ఈ అద్దెలను ప్రభుత్వాలు నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.

భూమిపై సూర్యోదయం ఎంత రమణీయంగా ఉంటుందో మనకు తెలుసు. మరి చంద్రుడి పైనుంచి చూస్తే ఎలా ఉంటుంది? పై ఫొటోలో ఉన్నట్లు ఉంటుంది. ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్ సంస్థకు చెందిన బ్లూ ఘోస్ట్ ల్యాండర్ ఈ అద్భుతమైన ఫొటోను తీసింది. నాసాకు చెందిన పే లోడ్‌తో ఈ నెల 2న చంద్రుడిపై దిగిన ల్యాండర్ ఆ వెంటనే ఈ ఫొటోను పట్టేసింది.

ప్రపంచ వ్యాప్తంగా ట్రేడ్‌వార్ ముదురుతోంది. కెనడా, మెక్సికోకు తోడుగా అమెరికా ఉత్పత్తులపై చైనా ప్రతీకార సుంకాలను ప్రకటించింది. సోయాబీన్, పప్పులు, పోర్క్, బీఫ్, అక్వాటిక్ ప్రొడక్ట్స్, పండ్లు, కూరగాయలు, డెయిరీ ప్రొడక్ట్స్‌పై మార్చి 10 నుంచి 10% సుంకాలు అమల్లోకి వస్తాయని చైనా ఫారిన్ మినిస్ట్రీ తెలిపింది. చికెన్, గోధుమలు, పత్తి సహా మరికొన్ని వస్తువులపై అదనంగా 10-15% సుంకాలు విధిస్తామని వెల్లడించింది.
Sorry, no posts matched your criteria.