news

News March 4, 2025

బాడీబిల్డర్ బ్రైడల్ లుక్స్ వైరల్

image

ఆమె ఓ బాడీ బిల్డర్. తన శరీరాకృతితో వందల కొద్ది అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు. ఆమే కర్ణాటకకు చెందిన చిత్ర పురుషోత్తం. తాజాగా ప్రీ-వెడ్డింగ్ షూట్‌లో భాగంగా వధువు గెటప్‌లో దిగిన ఫొటోలు వైరల్‌గా మారాయి. అందరిలా సిగ్గుతో కాకుండా గాంభీర్యం ప్రదర్శిస్తూ ఫొటోకు పోజులిచ్చారు. ఎప్పుడూ బాడీ బిల్డర్ డ్రెస్సుల్లో కనిపించే ఆమె కాంచీపురం చీర, నగలతో దర్శనమివ్వడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

News March 4, 2025

రోహిత్‌పై FatShaming: కంగనను లాగిన షమా

image

రోహిత్ శర్మ fat అని అవమానించిన కాంగ్రెస్ నేత <<15636348>>షమా<<>> మహ్మద్ ఈ వివాదాన్ని మరింత పెద్దది చేస్తున్నారు. Fans, BJP నేతల విమర్శలను తిప్పికొట్టేందుకు నటి, MP కంగనా రనౌత్‌ను మధ్యలోకి లాగారు. గతంలో రైతు ఉద్యమానికి మద్దతుగా హిట్‌మ్యాన్ ట్వీట్ చేశారు. దానికి ‘దోబీ కా కుత్తా న ఘర్ కా న ఘాట్ కా’ అంటూ విమర్శించిన కంగన రిప్లై‌ను ఆమె పోస్టు చేశారు. వీటిపై మీరేమంటారు మన్‌సుఖ్ మాండవీయ, కంగన అని ప్రశ్నించారు.

News March 4, 2025

ట్రంప్ సుంకాలు.. యుద్ధాన్ని ఆహ్వానించడమే: బఫెట్

image

US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై భారీగా సుంకాల్ని విధించడంపై దిగ్గజ వ్యాపారవేత్త వారెన్ బఫెట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘టారిఫ్‌లు విధించడమంటే యుద్ధాన్ని ఆహ్వానించినట్లే. వీటి గురించి అమెరికన్లకు గత అనుభవాలున్నాయి. సర్వత్రా ధరలు పెరిగిపోతాయి. అమెరికా ఆర్థిక పరిస్థితి గురించి నేను ఇక మాట్లాడదలచుకోలేదు. గత 60 ఏళ్లలో మా సంస్థ నుంచి 101 బిలియన్ డాలర్ల మేర పన్ను చెల్లించాం’ అని తెలిపారు.

News March 4, 2025

IND-BAN బంధం పటిష్ఠం: యూనస్

image

భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు పటిష్ఠంగా ఉన్నాయని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ మహ్మద్ యూనస్‌ స్పష్టం చేశారు. మధ్యలో చిన్న అపార్థాలు వచ్చాయని, వాటిని పరిష్కరించుకుంటామని తెలిపారు. రెండు దేశాల మధ్య పరస్పర సహకారం ఉందన్నారు. ఈ వారంలోనే తానే వ్యక్తిగతంగా ప్రధాని మోదీతో మాట్లాడానని చెప్పారు. పాక్‌తో దోస్తీ, ఇతర రాజకీయ కారణాలతో బంగ్లాదేశ్ భారత్‌కు దూరం జరుగుతోందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

News March 4, 2025

మహారాష్ట్ర మంత్రి రాజీనామా

image

మహారాష్ట్రలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. సర్పంచ్ హత్య కేసులో ఆరోపణలు రావడంతో మంత్రి ధనంజయ ముండే రాజీనామా చేయగా సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఆమోదం తెలిపారు. నిన్న రాత్రి ఎన్సీపీ చీఫ్, మంత్రి అజిత్ పవార్, ముండేతో సీఎం సుదీర్ఘంగా చర్చించారు. కేసు తేలే వరకు పదవి నుంచి తప్పుకోవాలని సీఎం సూచించగా ఆయన రిజైన్ చేశారు.

News March 4, 2025

జెలెన్‌స్కీ‌ తీరు చాలా దుర్మార్గం: మస్క్

image

జెలెన్‌స్కీ‌ రష్యాతో నిరంతర యుద్ధాన్నికోరుకుంటున్నారని మస్క్ ఆరోపించారు. ఆయనలో యుద్ద కాంక్ష తీరట్లేదని ఇది చాలా దుర్మార్గమని విమర్శలు చేశారు. అమెరికా, యూరప్ సాయం ఉన్నంత వరకూ జెలెన్‌స్కీ యుద్ధాన్ని ముగించరన్న ట్రంప్ ట్వీట్ మస్క్ రీపోస్ట్ చేశారు. ఉక్రెయిన్‌కు అమెరికా అందిస్తున్న మిలిటరీ సాయం తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నేపథ్యంలో జెలెనీస్కీ మరోసారి చర్చలకు సిద్ధమని ప్రకటించిన సంగతి తెలిసిందే.

News March 4, 2025

రష్మిక మందన్న vs కాంగ్రెస్: ఆమెకు మద్దతుగా BJP, JDS

image

కన్నడ సినీ పరిశ్రమ, నటి <<15639271>>రష్మిక<<>> మందన్నపై కాంగ్రెస్ మంత్రులు, MLAల వ్యాఖ్యలను BJP, JDS ఖండించాయి. కర్ణాటక LoP, BJP నేత R అశోకా, JDS నేత నిఖిల్ కుమార స్వామి ఆమెకు మద్దతు ప్రకటించారు. మీరు చెప్పినట్టల్లా ఆడటానికి నటులేమీ కాంగ్రెస్ కార్యకర్తలు కారని విమర్శించారు. ప్రభుత్వం నిర్వహించిన కన్నడ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఆమె సహా కొందరు నటులు రాకపోవడంతో ఈ వివాదం మొదలైంది. DY CM డీకే సినీ పరిశ్రమను హెచ్చరించారు.

News March 4, 2025

బ్లూఫ్లాగ్ రద్దు.. ఇద్దరు అధికారులపై వేటు

image

AP: విశాఖ రుషికొండ బీచ్‌కు బ్లూఫ్లాగ్ హోదా <<15639382>>గుర్తింపు <<>>రద్దుకు బాధ్యుల్ని చేస్తూ ఇద్దరు అధికారులపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. విశాఖ జిల్లా పర్యాటక శాఖ అధికారి జ్ఞానవేణి, RJD రమణను తప్పించింది. బీచ్‌పై వచ్చిన అభ్యంతరాలపై ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. బీచ్ పరిశుభ్రతపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. బీచ్ పరిశుభ్రతపై పర్యాటకులకు అవగాహన కల్పిస్తోంది.

News March 4, 2025

ట్రంప్‌తో ట్రూడో ఢీ: ప్రతీకార టారిఫ్స్‌ ప్రకటన

image

అమెరికాపై కెనడా ప్రతీకార సుంకాలను ప్రకటించింది. డొనాల్డ్ ట్రంప్ తగ్గేవరకు తామూ తగ్గమని PM జస్టిన్ ట్రూడో అన్నారు. ‘ఈ అన్యాయానికి కెనడా బదులివ్వకుండా ఉండదు. తొలి దశలో $20.6B US ఉత్పత్తులపై మేమూ 25% టారిఫ్స్ వేస్తాం. 3 వారాల్లోపు రెండో దశలో మరో $80Bకు విస్తరిస్తాం’ అని ట్రూడో తెలిపారు. పరిస్థితి ఇలాగే ఉంటే రెండేళ్లలోనే కెనడా ప్రొడక్షన్ 3% మేర తగ్గుతుందని బ్యాంక్ ఆఫ్ కెనడా ఆందోళన వ్యక్తం చేసింది.

News March 4, 2025

గ్రూప్-2 అభ్యర్థులకు BIG UPDATE

image

AP: గ్రూప్-2 మెయిన్స్ రాసిన అభ్యర్థులు తమ పోస్టుల ప్రాధాన్యం, జోన్, జిల్లా, ప్రాధాన్యతలు సెలక్ట్ చేసుకునే అవకాశాన్ని APPSC కల్పించింది. అభ్యర్థులు ఇవాళ్టి నుంచి ఈ నెల 10వ తేదీలోగా APPSC వెబ్‌సైటులో తమ వివరాలు అప్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది. హారిజంటల్ రిజర్వేషన్ అమల్లో భాగంగా మహిళలకు కేటాయించిన పోస్టులకు సరిపడినంత మహిళా అభ్యర్థులు లేకుంటే ఆ పోస్టులను పురుష అభ్యర్థులకు కేటాయించనుంది.