news

News March 4, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 4, 2025

శుభ ముహూర్తం (04-03-2025)

image

☛ తిథి: శుక్ల పంచమి, రా.8.07 వరకు
☛ నక్షత్రం: అశ్విని, ఉ.9.00 వరకు
☛ శుభ సమయం: ఏమీ లేవు
☛ రాహుకాలం: మ.3.00 నుంచి 4.30 వరకు
☛ యమగండం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
☛ దుర్ముహూర్తం: ఉ.8.24-నుంచి 9.12 వరకు, రా.10.48 నుంచి 11.36 వరకు
☛ వర్జ్యం: ఉ.6.46 వరకు, సా.5.47 నుంచి 7.17 వరకు
☛ అమృత ఘడియలు: తె.4.45 గంటల నుంచి 6.14 వరకు

News March 4, 2025

భారత్ – ఆసీస్ మ్యాచ్‌కు కొత్త పిచ్

image

CT ఫస్ట్ సెమీఫైనల్‌లో రేపు భారత్, ఆసీస్ తలపడనున్నాయి. హైబ్రిడ్ విధానం వల్ల భారత్ తన మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోనే ఆడుతోంది. ఇది టీమ్ఇండియాకు కలిసొస్తోందని పలువురు మాజీ క్రికెటర్లు అక్కసు వెళ్లగక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపటి మ్యాచ్‌కు కొత్త పిచ్ వినియోగిస్తున్నట్లు క్రిక్‌బజ్ వెల్లడించింది. AUSకు చెందిన క్యూరేటర్ మాథ్యూ శాండ్రీ ఆధ్వర్యంలో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్(ECB) పిచ్ సిద్ధం చేసింది.

News March 4, 2025

TODAY HEADLINES

image

* TG: MLCలుగా మల్క కొమురయ్య, శ్రీపాల్ రెడ్డి విజయం
* TG: ఇంటర్ ఎగ్జామ్స్.. 5min లేటైనా అనుమతి
* AP ఎక్కువ నీరు తీసుకుంటోంది.. అడ్డుకోండి: రేవంత్
* త్వరలోనే 16,347 టీచర్ పోస్టుల భర్తీ: మంత్రి లోకేశ్
* ఉత్తరాంధ్ర టీచర్ MLCగా గాదె శ్రీనివాసులు గెలుపు
* చిరంజీవి గారూ.. కూతుళ్లూ వారసులే: కిరణ్ బేడీ
* రోహిత్‌పై కాంగ్రెస్ నేత కామెంట్స్.. పొలిటికల్ హీట్
* సూచీలు ఫ్లాట్.. ఆదుకున్న మెటల్, రియల్టీ స్టాక్స్

News March 4, 2025

రాత్రిపూట నేలపై పడుకుంటే..

image

వేసవి వచ్చేసింది. ఉక్కబోత అల్లాడించే ఈ కాలంలో పరుపు నుంచి కూడా వేడి వస్తుంటుంది. అసలే రోజంతా పనులతో అలసిపోయిన శరీరం కునుకు తీసేందుకు పరుపుపై వాలగానే ఏదో అసౌకర్యం. అలాంటప్పుడు చక్కగా నేలపై నిద్రపోవడం చాలా మంచిదంటున్నారు జీవనశైలి నిపుణులు. చల్లటి నేలపై మంచి నిద్రే కాక ఒళ్లు నొప్పులకూ ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. నేలపై నిద్రను హాయిగా ఆస్వాదించాలని సూచిస్తున్నారు.

News March 4, 2025

క్రికెట్ అంటే తెలియనివాళ్లు ఇలా మాట్లాడటం విడ్డూరం: భజ్జీ

image

రోహిత్ శర్మపై కాంగ్రెస్ నేత షామా మహమ్మద్ బాడీ షేమింగ్ కామెంట్స్ దురదృష్టకరమని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అన్నారు. క్రికెట్ తెలియనివారు కూడా ఇలా మాట్లాడటం విడ్డూరమన్నారు. క్రీడాకారులకూ ఎమోషన్స్, సెంటిమెంట్లు ఉంటాయని, ఇలాంటి కామెంట్స్ ఎంత బాధిస్తాయో తెలుసుకోవాలని హితవు పలికారు. రోహిత్ అద్భుతమైన ప్లేయర్‌ అని, గొప్ప నాయకుడని భజ్జీ కొనియాడారు.

News March 4, 2025

ఫస్ట్ క్లాస్ మాజీ క్రికెటర్ మృతి

image

ముంబై లెజెండరీ స్పిన్నర్ పద్మాకర్ శివాల్కర్(84) కన్నుమూశారు. వృద్ధాప్యంతో ఆయన తుది శ్వాస విడిచారు. 124 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఆయన 589 వికెట్లు పడగొట్టారు. పదకొండు సార్లు 10 వికెట్ల ఘనత సాధించారు. 12 లిస్ట్-ఎ మ్యాచ్‌లు ఆడిన పద్మాకర్ 16 వికెట్లు తీశారు. 2017లో సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు.

News March 3, 2025

ఆత్మహత్య చేసుకుంటా.. సుప్రీం కోర్టుకు లాయర్ బెదిరింపు

image

తాను వాదిస్తున్న కేసులో పిటిషన్‌ను విచారణకు తీసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఓ న్యాయవాది ఏకంగా సుప్రీం కోర్టునే బెదిరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో విచారణ జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆయన ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం ఈ నెల 7లోపు తమకు లిఖితపూర్వక క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. లేని పక్షంలో బార్ లైసెన్స్ రద్దు చేసి అరెస్టు చేయిస్తామని తేల్చిచెప్పింది.

News March 3, 2025

రేపు TDP కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు రేపు మంగళగిరిలోని TDP కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా నామినేటెడ్ పదవులు, పార్టీ సంస్థాగత వ్యవహారాలపై నేతలతో చర్చించనున్నారు. ఈ నెలాఖరులోగా నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని ఆయన ఇటీవల చెప్పిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. తమపక్కన తిరిగే వారికి కాకుండా పార్టీ కోసం పనిచేసే వారిని నామినేటెడ్ పదవులకు సూచించాలని MLAలను CM ఆదేశించిన విషయం తెలిసిందే.

News March 3, 2025

రోహిత్‌పై వ్యాఖ్యలా.. దేశం వదిలిపోండి: యువరాజ్ తండ్రి

image

రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేసిన షామా మహమ్మద్‌పై భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ మండిపడ్డారు. ‘దేశానికి గర్వకారణమైన వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్లు సిగ్గుపడాలి. వారికి మన దేశంలో బతికే హక్కు లేదు. క్రికెట్ మా మతం. ఇలాంటి మాటల్ని సహించేది లేదు. నేనే ప్రధానమంత్రినైతే ఆమెను వెంటనే బ్యాగ్ సర్దుకుని దేశం విడిచిపొమ్మని ఆదేశించి ఉండేవాడిని’ అని పేర్కొన్నారు.