news

News March 3, 2025

కల్తీ నెయ్యి కేసు నిందితులకు మరోసారి కస్టడీ

image

AP: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులు పొమిల్ జైన్, అపూర్వ చావడాకు మరోసారి మూడు రోజుల పోలీస్ కస్టడీకి తిరుపతి రెండో అదనపు మున్సిఫ్ కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో రేపటి నుంచి మూడు రోజుల పాటు సిట్ అధికారులు నిందితులను విచారించనున్నారు. ఇటీవల ఈ కేసులో నలుగురు నిందితులను సిట్ ఐదు రోజుల పాటు ప్రశ్నించిన విషయం తెలిసిందే.

News March 3, 2025

కోహ్లీ ఎప్పటికీ తృప్తి పడరు: గవాస్కర్

image

విరాట్ కోహ్లీ ప్రతి మ్యాచ్‌కూ మెరుగవ్వాలని చూస్తుంటారని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నారు. ‘సాధించిన దాని గురించి కోహ్లీ ఎప్పటికీ తృప్తి పడరు. భారత్‌కు ఆడటాన్ని అదృష్టంగా భావిస్తారు. రికార్డుల్ని మాత్రమే కాదు. మైదానంలో ఆయన నిబద్ధత చూడండి. జట్టు కోసం ఏం చేయాలన్నా చేస్తారు. అందుకే భారత క్రికెట్ అనే విద్యాలయంలో విద్యార్థి స్థాయి నుంచి ఛాన్సలర్ స్థాయికి చేరుకున్నారు’ అని ప్రశంసించారు.

News March 3, 2025

మనసు ‘దోశే’సిన వంటకం!

image

తెలుగువారికి బ్రేక్‌ఫాస్ట్‌లో దోశ లేకుంటే రోజు గడవదంటే అతిశయోక్తి లేదు. దీనిలో ఎన్ని వెరైటీలున్నాయో చెప్పడానికి ఒకరోజు సరిపోదు. ప్రధానంగా ఉల్లి దోశ, మసాలా దోశ, ఉప్మా దోశ, ఎగ్ దోశ మన వద్ద ఫేమస్. దోశ వేయడమనేది తమిళనాడులో మొదలైందని అంటారు. అట్టు నుంచే దోశ పుట్టిందనేది మరో కథనం. ఏదేమైనా నేడు ప్రపంచమంతా విస్తరించిందీ వంటకం. ఈరోజు దోశ దినోత్సవం. మరి మీకు నోరూరించే దోశ ఏది? కామెంట్ చేయండి.

News March 3, 2025

3 రాజధానులపై YCP యూటర్న్?

image

AP: అభివృద్ధి వికేంద్రీకరణ కోసం రాష్ట్రానికి 3రాజధానులు అవసరమని అధికారంలో ఉన్నప్పుడు YCP బలంగా వాదించింది. విశాఖ, అమరావతి, కర్నూలును రాజధానులు చేస్తామని తేల్చి చెప్పింది. అయితే 3 రాజధానులు కార్యరూపం దాల్చలేదు. కాగా, 3 రాజధానులు అప్పటి మాట అని, ప్రస్తుతం తమ విధానం ఏంటో చర్చించుకొని చెప్తామని బొత్స అన్నారు. దీంతో YCP యూటర్న్ తీసుకుందా? అనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా నడుస్తోంది. దీనిపై మీ COMMENT.

News March 3, 2025

రోహిత్‌పై కామెంట్స్.. కేంద్రమంత్రి మండిపాటు

image

రోహిత్ శర్మపై కాంగ్రెస్ నేత షామా మహమ్మద్ <<15636715>>వ్యాఖ్యలను<<>> కేంద్ర మంత్రి మాండవీయ ఖండించారు. క్రీడాకారులను వివాదాల్లోకి లాగొద్దని హితవు పలికారు. షామాను సమర్థించిన TMC ఎంపీ సౌగతా రాయ్‌పైనా ఆయన మండిపడ్డారు. బాడీ షేమింగ్‌పై కాంగ్రెస్, టీఎంసీ పార్టీల నేతల మాటలు సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ వేదికలపై మన దేశ గౌరవాన్ని పెంచే ఆటగాళ్లను కించపరిచేలా మాట్లాడటం సరికాదని మాండవీయ హితవు పలికారు.

News March 3, 2025

జనసేనలోకి మాజీ MLA!

image

AP: జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం మాజీ MLA పెండెం దొరబాబు జనసేనలో చేరనున్నట్లు తెలుస్తోంది. కాసేపటి క్రితం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి పవన్‌ను కలిశారు. ఈ సందర్భంగా పార్టీలో చేరికపై చర్చించినట్టు సమాచారం. వారం రోజుల్లో ఆయన JSP తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో తనను కాదని వంగా గీతకు టికెట్ ఇవ్వడంతో దొరబాబు AUGలో వైసీపీకి రాజీనామా చేశారు.

News March 3, 2025

కాదేదీ కథకు అనర్హం!

image

గతంలోని ‘కాదేదీ కవితకనర్హం’ అనే నానుడిలోకి ఇప్పుడు ‘కాదేదీ సినిమా కథకు అనర్హం’ చేరింది. గతంలో కోతి, పాము, ఏనుగు, కొండచిలువ, పులి, సింహం, కుక్క వంటి జంతువుల నేపథ్యంగా సినిమాలు వచ్చాయి. ఇటీవల ట్రెండ్ కాకులకు మారింది. మన బంధు పక్షి కోర్ టాపిక్‌గా ‘విరూపాక్ష’, కాకి ముట్టడం అనే స్టోరీ లైన్‌తో ‘దసరా, బలగం’, వస్తే ఇప్పుడు కాకుల విక్టరీ అంటూ శ్రీకాంత్ ఓదెల ‘ది ప్యారడైజ్’ తెరకెక్కిస్తున్నారు.

News March 3, 2025

UAEలో భారత మహిళకు మరణ శిక్ష అమలు

image

షెహజాదీ అనే భారత మహిళకు UAEలో ఈ నెల 15న మరణ శిక్ష అమలైంది. UPకి చెందిన ఆమెను విదేశాలకు తీసుకెళ్తానని నమ్మించిన ఓ బ్రోకర్ ఓ ముస్లిం జంటకు అమ్మేశాడు. వారు ఆమెను తమతో UAE తీసుకెళ్లి తమ బిడ్డ ఆలనాపాలనల్ని అప్పగించారు. ఆ బిడ్డ హఠాత్తుగా చనిపోవడంతో షెహజాదీపై హత్యారోపణలు మోపారు. తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్లే చిన్నారి చనిపోయిందని ఆమె వాదించినా ఆలకించని కోర్టు మరణ శిక్ష విధించింది.

News March 3, 2025

రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు..

image

ఛాంపియన్స్ ట్రోఫీలో రేపు మ.2.30 గంటలకు భారత్, ఆస్ట్రేలియా మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. CT చరిత్రలో ఈ 2 పెద్ద జట్లు నాలుగు సార్లు తలపడగా రెండుసార్లు IND, ఒకసారి AUS గెలిచింది. ఒక మ్యాచ్ డ్రా అయింది. దీంతో ఇరు జట్లూ హాట్ ఫేవరెట్లుగా బరిలోకి దిగనున్నాయి. లీగ్ దశలో ఆడిన 3 మ్యాచ్‌ల్లో గెలిచి జోరు మీదున్న భారత్ ఆసీస్‌పై గెలిచి 2023 WC ఫైనల్‌లో ఓటమికి రివేంజ్ తీసుకోవాలని చూస్తోంది.
ALL THE BEST TEAM INDIA.

News March 3, 2025

ప్రతిష్ఠాత్మక అవార్డుకు నామినేట్ అయిన పంత్

image

టీమ్ఇండియా క్రికెటర్ రిషభ్ పంత్ ‘లారెస్ వరల్డ్ కమ్‌బ్యాక్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు నామినేట్ అయ్యారు. 2022లో పంత్ కారు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. 14 నెలల తర్వాత పునరాగమనం చేశారు. పంత్ తిరిగి కోలుకున్న తీరు ఎందరికో ఆదర్శంగా నిలిచిన నేపథ్యంలో నామినేట్ చేశారు. ఏప్రిల్ 21న విజేతలను ప్రకటించి అవార్డును అందజేయనున్నారు. భారత క్రికెటర్లలో పంత్ కంటే ముందు సచిన్ ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు.