news

News March 3, 2025

బ్లూఫ్లాగ్ గుర్తింపుతో ఉపయోగం ఏంటి?

image

తీర ప్రాంత జలాల్లో మెరుగైన అభివృద్ధి తీసుకురావడమే ఈ <<15632535>>బ్లూఫ్లాగ్ <<>>లక్ష్యం. వరల్డ్ మ్యాప్‌లో కూడా బీచ్‌లకు ఈ గుర్తింపు చూడవచ్చు. ఈ గుర్తింపు ఉన్న బీచ్‌లను సందర్శించడానికి విదేశీయులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ఈ ఫ్లాగ్ ఉంటే శుభ్రత, భద్రత పరంగా ఇబ్బంది ఉండదని వాళ్లు భావిస్తారు. ఈ ఫ్లాగ్ ఉన్న బీచ్‌ల ద్వారా ఆదాయం పెరగడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

News March 3, 2025

ALERT: మీ ఫోన్ పోయిందా?

image

ఎవరైనా తమ మొబైల్ ఫోన్ పోగొట్టుకుంటే వెంటనే అందులోని సిమ్‌ను బ్లాక్ చేయాలని TG పోలీసులు సూచిస్తున్నారు. ఆ నంబర్‌తో లింకై ఉన్న బ్యాంకు లావాదేవీలనూ నిలిపివేయాలని చెబుతున్నారు. ఫోన్ పోగొట్టుకున్న వారి బ్యాంకు ఖాతాల నుంచి రూ.లక్షల్లో డబ్బులు మాయమవుతున్న ఘటనలు ఇటీవల పెరిగాయని తెలిపారు. ఫోన్ నంబర్ సాయంతో ఆన్‌లైన్ మార్గాల ద్వారా సైబర్ నేరగాళ్లు డబ్బులు కాజేస్తున్నారని, అలర్ట్‌గా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

News March 3, 2025

వెయ్యి మందిని తొలగిస్తున్న ఓలా ఎలక్ట్రిక్!

image

ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ వెయ్యికి పైగా ఉద్యోగులు, కాంట్రాక్టు వర్కర్లను తొలగించేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. నష్టాలను తగ్గించుకొనేందుకే ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. దాదాపుగా అన్ని శాఖలపై ఈ ప్రభావం పడనుంది. ప్రస్తుతం కంపెనీలో 4000 ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2023, NOVలోనూ ఓలా 500 మందిని తీసేసింది. నష్టాలు, మార్కెట్ కరెక్షన్ వల్ల 60% తగ్గిన ఓలా షేర్లు ప్రస్తుతం రూ.55 వద్ద కొనసాగుతున్నాయి.

News March 3, 2025

రోహిత్‌పై ఇలాంటి వ్యాఖ్యలు సరికాదు: బీసీసీఐ

image

రోహిత్‌శర్మపై కాంగ్రెస్ నేత శమా మహమ్మద్ చేసిన వ్యాఖ్యలపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. ఒక అంతర్జాతీయ టోర్నమెంట్ జరుగుతున్న వేళ బాధ్యతాయుతమైన వ్యక్తి ఇలా మాట్లాడటం సరికాదన్నారు. ఆటగాళ్లందరూ అద్భుతంగా ఆడుతున్నారని దాని ఫలితాలు కూడా చూస్తున్నామని తెలిపారు. వ్యక్తిగత ప్రచారం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయటం మానుకోవాలని హితవు పలికారు.

News March 3, 2025

SEBI మాజీ చీఫ్, BSE అధికారులకు స్వల్ప ఊరట

image

మార్కెట్ అవకతవకలు, కార్పొరేట్ మోసం కేసులో SEBI, BSE అధికారులపై ACB FIR ఫైల్ చేయాలన్న ముంబై సెషన్స్ కోర్టు ఆదేశాలను బాంబే హైకోర్టు నిలిపివేసింది. ముందస్తుగా నోటీసులు ఇవ్వకపోవడంతో సెషన్స్ కోర్టు ఆదేశాలు చెల్లుబాటు కావన్న రెస్పాండెంట్స్‌ లాయర్ల వాదనను అంగీకరించింది. TUE వాదనలు వింటామంది. సెబీ మాజీ చీఫ్ మాధబీ, మెంబర్లు అశ్వనీ, అనంత్, కమలేశ్, BSE ఛైర్మన్ ప్రమోద్, CEO సుందర రామన్‌కు ఊరటనిచ్చింది.

News March 3, 2025

టెన్త్ హాల్ టికెట్లు విడుదల

image

AP: పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్‌ టికెట్లను విద్యాశాఖ విడుదల చేసింది. https://bse.ap.gov.in/ వెబ్‌సైట్ నుంచి <>డౌన్‌లోడ్<<>> చేసుకోవచ్చని సూచించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ వాట్సాప్ (9552300009) సర్వీస్ ‘మన మిత్ర’లోనూ అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. అందులో ఎడ్యుకేషన్ సర్వీసెస్ సెలక్ట్ చేసుకుని అప్లికేషన్ నంబర్/DOB ఎంటర్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపింది.

News March 3, 2025

చదివేటప్పుడు నిద్ర కమ్ముకొస్తుందా?

image

అలా అయితే కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని చదవడం ప్రారంభించండి. ఎట్టిపరిస్థితుల్లోనూ పడుకొని చదవొద్దు. చదివే సమయంలో నీరు ఎక్కువగా తాగండి. గట్టిగా చదవటం, నోట్స్ రాయటం వల్ల నిద్ర రాకుండా ఉంటుంది. 50ని.లకు ఒకసారి బ్రేక్ తీసుకొని, ముఖాన్ని చల్లటి నీటితో కడగండి. మీ రీడింగ్ రూంలో సరైన వెలుతురు ఉండేలా చూసుకోండి. బ్రేక్‌ టైంలో కాస్త నడిస్తే మైండ్ రీఫ్రెష్ అవుతుంది. లైట్ ఫుడ్ తీసుకుంటే మంచిది. Share It.

News March 3, 2025

అసెంబ్లీలో సభ్యులకు సీట్లు కేటాయింపు

image

AP అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయిస్తూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు నిర్ణయం తీసుకున్నారు. ట్రెజరీ బెంచ్‌కు ముందు వరుసలో CM, డిప్యూటీ CM, మంత్రులకు సీట్లు కేటాయించారు. సీఎం చంద్రబాబుకు ఒకటో నంబర్ సీటు ఇవ్వగా, డిప్యూటీ సీఎం పవన్‌కు 39వ సీటు ఇచ్చారు. సీనియారిటీ ప్రాతిపదికన మిగతా ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయించారు. మాజీ CM, YCP పక్ష నేతగా జగన్‌కు ప్రతిపక్ష బెంచిలో ముందు వరుసలో సీటు ఇచ్చారు.

News March 3, 2025

DA అప్డేట్: హోలీ పండగ లోపు గుడ్‌న్యూస్!

image

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు త్వరలోనే శుభవార్త చెప్పబోతోందని సమాచారం. ఈ నెల్లోనే DA సవరణ చేపడుతుందని తెలిసింది. హోలీ పండగ లోపు ఎంత శాతం ఇస్తారో ప్రకటిస్తుందని వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ CPI డేటా ప్రకారం పెంపు 2% వరకు ఉండొచ్చని విశ్లేషకుల అంచనా. ఈ లెక్కన DA 55.98 శాతానికి చేరుకుంటుంది. ఏడో వేతన సంఘం ప్రకారం ఏటా 2సార్లు DAను ప్రకటించాలి. జనవరికి సంబంధించి మార్చిలో వెల్లడిస్తుంది.

News March 3, 2025

వారానికి 60 గంటల పని: గూగుల్ కో ఫౌండర్

image

ఉద్యోగులను యంత్రాలుగా చూస్తున్న వారి జాబితాలోకి గూగుల్ కో ఫౌండర్ సెర్జీ బ్రిన్ కూడా వచ్చేశారు. ఇప్పటికే నారాయణమూర్తి, L&T సంస్థల ఫౌండర్లు 70 గంటలు పనిచేయాలని కామెంట్ చేయగా, సెర్జీ బ్రిన్ కూడా ఇలానే మాట్లాడారు. ‘AI రేసులో నిలవాలంటే వారానికి 60 గంటలు పనిచేయాలి. ప్రతిరోజూ ఆఫీసుకు రావాలి. అప్పుడే మంచి ప్రొడక్టివిటీ వస్తుంది. ఈ రేసులో మనం నిలవాలి, గెలవాలంటే తప్పదు’ అని ఆయన ఉద్యోగులకు నోట్ రాశారు.