India's largestHyperlocal short
news App
            Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా అందరికంటే తక్కువ ఓట్లు సాధించిన వ్యక్తికి వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు. వాటిని ఆయా అభ్యర్థులకు బదిలీ చేసి చివరి వ్యక్తిని పోటీ నుంచి తప్పిస్తారు. అప్పటికీ 50%+1 ఓట్లు రాకపోతే చివరగా నిలిచిన మరో అభ్యర్థి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తూ చివరి అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తూ వస్తారు. విజేత తేలే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది.

ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచులో భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. 6.4 ఓవర్లలో 30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. రోహిత్(15), గిల్(2), కోహ్లీ (11) ఔటయ్యారు.

ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్‌లో కళ్యాణ్ రామ్ నటిస్తోన్న NKR21 షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో విజయశాంతి పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నారు. ఈ మూవీకి మెరుపు, రుద్ర అనే టైటిళ్లు ప్రచారంలో ఉన్నాయి. త్వరలోనే వరుసగా అప్డేట్స్ విడుదలవుతాయని తెలుస్తోంది. ‘డెవిల్’ తర్వాత ఏడాదిగా కళ్యాణ్ రామ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాని విషయం తెలిసిందే.

మన దేశంలో చాలా రాష్ట్రాల్లో తమ కూతురు బాగుండాలని వరుడికి తల్లిదండ్రులు కట్న కానుకలు ఇవ్వడం కామన్. కానీ అరుణాచల్ ప్రదేశ్‌లో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. గలో తెగలో పెండ్లి కూతురికి కానుకలు ఇస్తారు. అరి అనే ఆచారంలో భాగంగా వధువుకు వరుడి కుటుంబం డబ్బులు, బహుమతులు, ఆస్తులు అందజేస్తారు. రెండు కుటుంబాల సత్సంబంధాలకు ఈ ఆచారాన్ని పాటించాలని వారు విశ్వసిస్తారు.

విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించారు. భారత్ తరఫున 300 వన్డేలు ఆడిన ఏడో ప్లేయర్‌గా నిలిచారు. న్యూజిలాండ్ మ్యాచులో ఈ మైలురాయి చేరుకున్నారు. ఈ జాబితాలో సచిన్(463), ధోనీ(350), ద్రవిడ్(344), అజహరుద్దీన్(334), గంగూలీ(311), యువరాజ్(304) విరాట్ కంటే ముందు స్థానాల్లో ఉన్నారు. ఓవరాల్‌గా 22వ ప్లేయర్ కావడం గమనార్హం.

ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియాతో జరుగుతున్న మ్యాచులో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో గెలిచిన జట్టు గ్రూప్-Aలో తొలి స్థానంలో నిలవనుంది. హర్షిత్ స్థానంలో వరుణ్ చక్రవర్తి జట్టులోకి వచ్చారు.
భారత్: రోహిత్ (C), గిల్, కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, జడేజా, అక్షర్ పటేల్, షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్  చక్రవర్తి.

సామాజిక అంశాలను కథా వస్తువులుగా తెరకెక్కించే దర్శకుడు దేవ కట్టా ఓ వెబ్ సిరీస్ తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం YSR, సీఎం చంద్రబాబు స్నేహం గురించి ఈ కథ ఉంటుందని సమాచారం. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కే ఈ సిరీస్‌లో చంద్రబాబు పాత్రలో ఆది పినిశెట్టి, వైఎస్ఆర్ రోల్‌లో చైతన్య రావు నటిస్తారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

పాకిస్థాన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ IPLపై విషం కక్కారు. IPLను బాయ్‌కాట్ చేయాలని ఇతర దేశాల క్రికెట్ బోర్డులకు పిలుపునిచ్చారు. ‘భారత క్రికెటర్లు ఏ ఇంటర్నేషనల్ లీగ్‌లలో పాల్గొనరు. కానీ ప్రపంచంలోని టాప్ ప్లేయర్లందరూ IPL ఆడతారు. భారత ప్లేయర్లు ఫారిన్ లీగ్స్ ఆడే వరకు ఇతర దేశాల క్రికెట్ బోర్డులు తమ క్రికెటర్లను ఐపీఎల్ ఆడేందుకు ఇండియాకు పంపొద్దు’ అని వ్యాఖ్యానించారు.

AP: ఉమెన్ ఎంపవర్‌మెంట్ బ్రాండ్ అంబాసిడర్‌గా హీరోయిన్ మీనాక్షి చౌదరిని నియమించారన్న వార్తను రాష్ట్ర ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఖండించింది. సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం పూర్తిగా ఫేక్ అని స్పష్టం చేసింది. ప్రభుత్వం పేరుతో ఉద్దేశపూర్వకంగా ఇటువంటి తప్పుడు పోస్టులు పెడుతున్న వారిపై, ఫేక్ ప్రచారం చేస్తున్న వారిపై చట్టప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

కిడ్నీఫెయిలైన వారిలో 90శాతం బీపీ, షుగర్ పేషెంట్సేనని నెఫ్రాలజిస్ట్ డా. భూషణ్ రాజు తెలిపారు. ఏటా HYDలోనే 30 వేల నుంచి 40 వేల మంది వ్యాధికి గురవుతున్నారని పేర్కొన్నారు. వీరిలో మధుమేహం వల్ల 40%, బీపీ వల్ల 30% మందికి జబ్బు సోకుతుందన్నారు. చివరి దశలలో వ్యాధిని గుర్తించి ఆసుపత్రికి వచ్చినా ప్రయోజనం ఉండదని తెలిపారు. బీపీ, షుగర్ నియంత్రణలో ఉండేలా జాగ్రత్త పడాలని స్క్రీనింగ్ చేయించాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.