news

News March 2, 2025

వైసీపీ శ్రేణులకు పనులు, సాయం చేయొద్దు: సీఎం చంద్రబాబు

image

AP: వైసీపీ శ్రేణులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలాంటి పనులూ చేయొద్దని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వారికి సాయం చేస్తే పాముకు పాలు పోసినట్లేనన్నారు. ఈ విషయాన్ని పార్టీ శ్రేణులకు గట్టిగా చెబుతున్నానంటూ హెచ్చరించారు. జీడీ నెల్లూరు కార్యకర్తలతో సమావేశంలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలని సూచించారు. నాయకులు తన చుట్టూ కాకుండా ప్రజల చుట్టూ తిరగాలన్నారు.

News March 2, 2025

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ATC: CM

image

TG: రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్స్(ITI)లను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు(ATC)గా అప్‌గ్రేడ్ చేయడంపై CM రేవంత్ సమీక్షించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో తప్పనిసరిగా ఒక ATC ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ITIలు లేని కేంద్రాల్లో కొత్తగా ATCలను ఏర్పాటు చేయాలన్నారు. నియోజకవర్గ కేంద్రాలు/పట్టణాలకు సమీపంలో ATCలు ఉండేలా చూడాలని, అవసరమైన నిధులను అందిస్తామని చెప్పారు.

News March 1, 2025

ప్రతి నియోజకవర్గంలో ఓ మోడల్ స్కూల్: మంత్రి లోకేశ్

image

AP: <<14566229>>అపార్ ఐడీ<<>> ద్వారా KG- PG వరకు విద్యార్థుల పురోగతిని ట్రాక్ చేయాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో ఓ మోడల్ స్కూల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. PG ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలుకు విధివిధానాలు రూపొందించాలని, అమరావతిలో AI, స్పోర్ట్స్ వర్సిటీల పనులను వేగవంతం చేయాలని సూచించారు. వెల్ఫేర్ హాస్టళ్లలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు.

News March 1, 2025

కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ ఎయిర్‌పోర్ట్: సీఎం

image

TG: వరంగల్(D) మామునూరు విమానాశ్రయం కేరళలోని కొచ్చి ఎయిర్‌పోర్టు తరహాలో ఉండాలని అధికారులకు CM రేవంత్ సూచించారు. నిత్యం రాకపోకలతో కార్యకలాపాలు జరిగేలా డిజైన్ రూపకల్పన జరగాలన్నారు. విమానాశ్రయ నిర్మాణానికి కేంద్రం నుంచి అనుమతి వచ్చిన నేపథ్యంలో సమీక్ష నిర్వహించారు. సాధ్యమైనంత తొందరగా భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేసి డిజైనింగ్‌కు పంపించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News March 1, 2025

ఆ స్టార్ హీరోలను కలవాలని ఉంది: మోనాలిసా

image

సోషల్ మీడియా పాపులారిటీతో సెన్సేషన్‌గా మారిన మోనాలిసా ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. హీరోయిన్లు కంగనా రనౌత్, సోనాక్షి సిన్హా నుంచి తాను స్ఫూర్తి పొందుతానని చెప్పారు. బాలీవుడ్ స్టార్లు సల్మాన్ ఖాన్, సన్ని డియోల్‌ను కలవాలని ఉందని తెలిపారు. ఈ జనరేషన్ నటులు వరుణ్ ధవన్, టైగర్ ష్రాఫ్ గురించి తెలియదని చెప్పారు. అవకాశం ఇస్తానని చెప్పిన సనోజ్ మిశ్రా తనను కూతురిలా చూసుకుంటారని పేర్కొన్నారు.

News March 1, 2025

డ్రగ్స్‌పై పంజాబ్ యుద్ధం

image

మాదకద్రవ్యాలను అరికట్టడమే లక్ష్యంగా పంజాబ్ ప్రభుత్వం భారీ ఆపరేషన్ చేపట్టింది. ఇవాళ ఒక్కరోజే 12వేల మందికి పైగా పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా 750 ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. 8 కిలోల హెరాయిన్, 16వేలకు పైగా మత్తు ట్యాబ్లెట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. 290 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. తమ పోరాటానికి పార్టీలకతీతంగా మద్దతు ఇవ్వాలని ఆప్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

News March 1, 2025

తీవ్ర విషాదం.. ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని

image

TG: చదువు ఇష్టం లేకపోవడం, పరీక్షల భయంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్(D)లో జరిగింది. నర్సాపూర్‌‌కు చెందిన వైష్ణవి HYDలోని ఒక ప్రైవేట్ కాలేజీలో చదువుతోంది. శివరాత్రి సందర్భంగా ఇంటికి వచ్చిన ఆమె ఇవాళ ఇంట్లోనే ఉరివేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పిల్లలకు పరీక్షల పట్ల ఉన్న భయాన్ని పోగొట్టి ధైర్యం చెప్పాలని పేరెంట్స్, టీచర్లకు నిపుణులు సూచిస్తున్నారు.

News March 1, 2025

సౌతాఫ్రికా ఈ సారైనా..

image

గత రెండేళ్లుగా సౌతాఫ్రికాకు ఐసీసీ టోర్నీలు పీడకలను మిగిల్చాయి. 2023లో మెన్స్ వన్డే వరల్డ్ కప్‌లో సెమీస్‌లోనే ఇంటిదారి పట్టింది. ఆ తర్వాతి ఏడాది టీ20 వరల్డ్ కప్‌ ఫైనల్ చేరినా భారత జట్టు చేతిలో అనూహ్యంగా పరాజయం పాలై కన్నీటిలో మునిగింది. ఇక ఈ ఏడాది జూన్‌లో జరిగే WTC ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇదే ఊపులో ఉన్న ప్రోటీస్ జట్టు CT సెమీఫైనల్లో సత్తా చాటి ఫైనల్లోకి దూసుకెళ్లాలని ఉవ్విళ్లూరుతోంది.

News March 1, 2025

సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్న రంభ

image

సీనియర్ హీరోయిన్ రంభ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా ప్రకటించారు. ‘సినిమానే నా ఫస్ట్ లవ్. కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు ఇదే సరైన సమయం అని భావిస్తున్నా. కథలో ప్రాధాన్యం ఉన్న పాత్రలు, ఛాలెంజింగ్ రోల్స్ చేయాలనుకుంటున్నా’ అని తెలిపారు. 90ల్లో హీరోయిన్‌గా, ఆ తర్వాత స్పెషల్ సాంగ్స్‌లో నటించిన ఆమె 2010లో ఇంద్రకుమార్ అనే వ్యాపారిని వివాహమాడారు. వీరికి ముగ్గురు పిల్లలు.

News March 1, 2025

గర్భిణులు, వృద్ధులు, పిల్లలు బయటకు రావొద్దు: APSDMA

image

APలో 3 నెలలపాటు ఎండలు, వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని <>APSDMA<<>> వెల్లడించింది. సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయంది. గర్భిణులు, బాలింతలు, పిల్లలు, వృద్ధులు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని, బయటికెళ్తే జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. డీహైడ్రేట్ కాకుండా నీళ్లు, మజ్జిగ, కొబ్బరి, లెమన్ వాటర్ తాగాలని సూచించింది. ఎండలపై సమాచారం కోసం 112, 1070, 18004250101 నంబర్లను సంప్రదించాలంది.