India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

స్టాక్‌మార్కెట్లు గరిష్ఠాలకు చేరినట్టే పతనమూ అవుతున్నాయని జెరోధా ఫౌండర్ నితిన్ కామత్ అన్నారు. ‘ఇకపై సూచీల గమనం ఎటో తెలియదు. బ్రోకింగ్ ఇండస్ట్రీ మాత్రం ఇబ్బంది పడుతోంది. మొత్తంగా 30% యాక్టివిటీ పడిపోయింది. ట్రేడర్లు తగ్గారు. వాల్యూమ్ తగ్గింది. జెరోధా ఆరంభించాక 15ఏళ్లలో తొలిసారి డీగ్రోత్ చూస్తున్నాం. ఇలాగైతే STT ద్వారా ప్రభుత్వం ఆశించిన ₹80K CR కాదు అందులో 50% అయిన ₹40K CR సైతం రాద’ని అంచనా వేశారు.

AP: రాజకీయాల్లో మచ్చలేని పార్టీ బీజేపీ అని ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి తెలిపారు. గతంలో స్కాముల ప్రభుత్వాలను చూస్తే ఇప్పుడు ప్రధాని మోదీ నేతృత్వంలో స్కీముల సర్కారును చూస్తున్నామన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీకి 52 శాతం సీట్లు వస్తాయని ఓ సర్వేలో తేలిందని చెప్పారు. ఇవాళ ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజాహితంగా ఉందని కొనియాడారు.

ఉత్తరాఖండ్ చమోలి-బద్రినాథ్ హైవేపై <<15607625>>గ్లేసియర్ బరస్ట్<<>> కారణంగా ఆ ప్రాంతమంతా మోకాళ్లలోతు మంచు పేరుకుపోయింది. దీంతో ఆ ప్రాంతమంతా మోకాళ్లలోతు మంచు పేరుకుపోయింది. దీంతో అక్కడ చిక్కుకున్న కార్మికులను కాపాడటం ఆర్మీకి కష్టతరమవుతున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ సైనికులు తీవ్రంగా శ్రమించి ఇప్పటి వరకు 10 మందిని రక్షించి వైద్య సహాయం అందిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను విడుదల చేశారు.

TG: రైతుభరోసా డబ్బుల జమపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు జారీ చేశారు. 3 ఎకరాల వరకు సాగు భూమి ఉన్న రైతన్నలకు నిధుల విడుదల ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో ఫ్లెక్సీల ద్వారా లబ్ధిదారుల వివరాలను ప్రదర్శించాలని పేర్కొన్నారు. రైతులకు అందుతున్న ఆర్థిక సాయం, పథకాల అమలు పురోగతిపై బ్యాంకర్లతో చేసిన సమీక్షలో మంత్రి ఈ మేరకు నిర్ణయాలు ప్రకటించారు.

AP: ప్రజల తీర్పుతో మంచి పాలన చేయకుండా బడ్జెట్‌లోనూ YCPపై విమర్శలు ఎందుకని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నించారు. బడ్జెట్‌లో అసలు సూపర్ సిక్స్ అమలుకు కేటాయింపులు లేవని మండిపడ్డారు. సంక్షేమ పథకాలు నిలిచిపోవడంతో ప్రజలు అప్పుల పాలయ్యారని తెలిపారు. సీఎం చంద్రబాబు చెప్పిన సంపద సృష్టి ఎక్కడ జరుగుతోందో కూటమి నేతలు చెప్పాలన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారులో వృద్ధి ఎక్కడని నిలదీశారు.

కంగనా రనౌత్, జావెద్ అక్తర్ వివాదం సమసింది. వీరిద్దరూ పరస్పరం వేసుకున్న పరువు నష్టం దావా కేసులను వెనక్కి తీసుకున్నారు. ‘ఇన్నేళ్ల తర్వాత ఈ వ్యవహారం ముగిసింది. నాకు కలిగించిన అసౌకర్యానికి ఆమె క్షమాపణ చెప్పారు’ అని అక్తర్ బాంద్రా కోర్టు వద్ద మీడియాకు తెలిపారు. 2016లో Email అంశంపై హృతిక్ రోషన్‌తో కంగనా బహిరంగంగా గొడవపడ్డారు. దీనిపై రోషన్ కుటుంబానికి సారీ చెప్పాలని అక్తర్ కోరడంతో ఈ వివాదం మొదలైంది.

AP: తన బ్యారక్ మార్చాలని వైసీపీ నేత వల్లభనేని వంశీ విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టును కోరారు. ఈమేరకు ఆయన తరఫు లాయర్లు పిటిషన్ వేశారు. బ్యారక్‌ను మార్చడం కుదరకపోతే, కొందరు ఖైదీలను తన గదిలో ఉంచాలని విన్నవించారు. తనకు 6-4 సైజ్ బ్యారక్ ఇచ్చారని, అందులో మంచం కూడా పట్టడం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా తనకు ఆస్తమా ఉందని, సెల్‌లో తనకు తోడుగా మరొకరని ఉంచాలని నిన్న జడ్జిని వంశీ కోరిన సంగతి తెలిసిందే.

విమానంలో ప్రయాణించడం ఖర్చుతో కూడుకున్నదని చాలా మంది భావిస్తుంటారు. అయితే, విమానయాన సంస్థలను బట్టి టికెట్ ధరలుంటాయి. ప్రపంచంలో అతి తక్కువ ధరకే విమాన ప్రయాణం అందిస్తోన్న సంస్థగా Air Asiaకి పేరుంది. దీని తర్వాత వోలోటియా, ఫ్లైనాస్, ట్రాన్సావియా ఫ్రాన్స్‌తో పాటు ఐదో స్థానంలో ఇండియాకు చెందిన ఇండిగో ఉంది. ఇక కాస్ట్లీయెస్ట్ ఎయిర్‌లైన్స్ జాబితాలో ఖతర్ ఎయిర్‌వేస్, సింగపూర్ ఎయిర్‌లైన్స్, ఎమిరేట్స్ ఉన్నాయి.

TG: సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన టీపీసీసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్‌లో విపక్షాలకు గొంతే లేకుండా చేసిందని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తోందన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కాంగ్రెస్ నినాదాలని చెప్పారు.

ఏదైనా కొండను చూసినప్పుడు అది జంతువు లేక మనిషి ఆకారంలో కనిపించడాన్ని గమనిస్తుంటాం. ఓ కొండ అచ్చం కుక్క ముఖం ఆకారంలో కనిపించడంతో అది చూసేందుకు ప్రజలు ఎగబడుతున్నారు. చైనాలోని షాంఘైకి చెందిన గువో కింగ్‌షాన్ తన వెకేషన్ ఫొటోను షేర్ చేయగా అందులో ప్రత్యేకమైన ఆకారంలో ఉన్న పర్వతంపై అందరి దృష్టీ పడింది. దీనిని ‘పప్పీ మౌంటేన్’ అని ఆమె పిలిచింది. దీంతో ఫొటోగ్రాఫర్లు, టూరిస్టులు ఆ ప్రాంతానికి తరలివస్తున్నారు.
Sorry, no posts matched your criteria.