India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం పేరిట 40 శాతం నూకలే పంపిణీ చేస్తోందని BRS MLA హరీశ్ రావు ఆరోపించారు. సన్నబియ్యం పేరుతో మోసం చేస్తున్నారని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో గురుకులాలకు నూకలు లేని సన్నబియ్యం ఇచ్చామని తెలిపారు. అర్హులైన వారందరికీ సన్నబియ్యం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధ్వానంగా మారిందని, జాకీలు పెట్టి లేపినా లేచే స్థితిలో లేదని ఎద్దేవా చేశారు.
AP: రాష్ట్రంలో రాబోయే 3 గంటల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం కురుస్తుందని APSDMA తెలిపింది. కోనసీమ, అనకాపల్లి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో వర్షం కురుస్తుందని అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని పేర్కొంది.
AP: కైలాసపట్నం అగ్నిప్రమాదంపై Dy.CM పవన్, మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని, బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్నారు. ‘ఇటీవల అల్లూరి జిల్లా పర్యటనకు వెళ్లినప్పుడు విశాఖ పరిశ్రమల్లో తీసుకోవాల్సిన భద్రతపరమైన జాగ్రత్తల గురించి చర్చించాలనుకున్నా. కానీ అత్యవసరంగా సింగపూర్ వెళ్లాల్సి వచ్చింది. తదుపరి విశాఖ పర్యటనలో దీనిపై దృష్టిపెడతా’ అని పవన్ తెలిపారు.
ఒకప్పుడు తనకు నచ్చిన బ్రాండ్స్‌ని ప్రమోట్ చేశానని, అందుకు తన ఫాలోవర్స్‌కి క్షమాపణలు చెబుతున్నానని హీరోయిన్ సమంత తెలిపారు. ఈ ఏడాది 15 బ్రాండ్స్ వదులుకున్నట్లు ఆమె చెప్పారు. ‘ప్రస్తుతం బ్రాండ్స్ ప్రమోట్ విషయంలో బాధ్యతగా ఉంటున్నా. నా వద్దకు ఎన్నో యాడ్స్ వస్తుంటాయి. కానీ ఆ ఉత్పత్తులను నాకు తెలిసిన డాక్టర్లతో పరీక్షలు చేయిస్తా. అవి ప్రజలకు హానీ చేయవని నిర్ధారణ అయ్యాకే ప్రమోట్ చేస్తున్నా’ అని తెలిపారు.
AP: అనకాపల్లి(D) కైలాసపట్నంలో జరిగిన <<16086158>>అగ్నిప్రమాదంలో<<>> 8 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మృతులను అప్పికొండ తాతబాబు(50), సంగరాతి గోవింద్ (45), దాడి రామలక్ష్మి(38), దేవర నిర్మల (38), పురం పాప (40), గుంపిన వేణుబాబు (40), సేనాపతి బాబురావు (56), మనోహర్‌గా పోలీసులు గుర్తించారు.
TG: అంబేడ్కర్ జయంతి సందర్భంగా HYDలోని 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహానికి స్వయంగా CM రేవంత్ నివాళులర్పించాలని BRS MLC కవిత డిమాండ్ చేశారు. KCRపై కోపంతో అంబేడ్కర్‌కు నివాళులర్పించకుండా అవమానించ వద్దన్నారు. ‘మంత్రులతో సహా CM అంబేడ్కర్ స్మృతివనాన్ని సందర్శించాలి. అలాగే ప్రజలకు కూడా సందర్శించే అవకాశం కల్పించాలి. KCRపై అక్కసుతో ఆ మహనీయుడిని స్మరించడం మరిచిపోవద్దు’ అని పేర్కొన్నారు.
నాని హీరోగా నటిస్తున్న ‘HIT-ది థర్డ్ కేస్’ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్, టైమ్‌ను మేకర్స్ ప్రకటించారు. రేపు ఉదయం విశాఖపట్నంలోని సంగం థియేటర్‌లో ఈ సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేయనున్నట్లు ఓ పోస్టర్ ద్వారా తెలిపారు. అలాగే ఉదయం 11.07 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. మే 1న ఈ మూవీ రిలీజ్ కానుంది.
TG: భూ భారతి వెబ్‌సైట్‌ను సామాన్య రైతులకు కూడా సులభంగా అర్థమయ్యేలా రూపొందించాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. జూబ్లీహిల్స్ నివాసంలో దీనిపై సమీక్షించారు. 100 ఏళ్లపాటు నడిచే ఈ వెబ్‌సైట్ అత్యాధునికంగా, పారదర్శకంగా ఉండాలన్నారు. భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా రూపొందించాలని.. భద్రత కోసం ఫైర్‌వాల్స్ ఏర్పాటు చేసి, నిర్వహణను విశ్వసనీయ సంస్థకు అప్పగించాలని ఆదేశించారు.
జపాన్‌లో పర్యటిస్తున్న రాజమౌళి అక్కడ మీడియాతో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్} మూవీకోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా ప్రభాస్ ‘స్పిరిట్’, రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీలను చూడాలనుకుంటున్నానని పేర్కొన్నారు. ‘RRR బిహైండ్ అండ్ బియాండ్’ డాక్యుమెంటరీ ప్రమోషన్స్ కోసం రాజమౌళి జపాన్ వెళ్లారు.
AP: రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియాను చేనేతశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. అలాగే ఐటీశాఖ సెక్రటరీ కె.భాస్కర్‌కు ఏపీహెచ్ఆర్‌డీఏ డైరెక్టర్‌గా పూర్తి బాధ్యతలు, సీసీఎల్ ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మికి రెవెన్యూశాఖ అదనపు బాధ్యతలు అప్పగించింది.
Sorry, no posts matched your criteria.