India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సినిమాలు చేయడంలో తనకు తొందర లేదని, మంచి సినిమాల్లో భాగమవడం కోసమే టైమ్ తీసుకుంటున్నట్లు నిధి అగర్వాల్ తెలిపారు. ‘ఇస్మార్ట్ శంకర్(2019) తర్వాత నిధి ఎన్ని సినిమాలు చేసింది? 2021లో వచ్చిన శ్రీలీల 20+ మూవీస్ చేసింది’ అని ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు ఆమె రిప్లై ఇచ్చారు. ‘2019 తర్వాత తెలుగులో హీరో మూవీ, తమిళంలో 3 సినిమాలు చేశా. తర్వాత HHVM, రాజాసాబ్ చేస్తున్నా. బ్రదర్.. నా గురించి బాధపడొద్దు’ అని సూచించారు.
ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ మళ్లీ నిరాశపరిచారు. డీసీతో జరుగుతున్న మ్యాచులో 18 పరుగులే చేసి విఫలమయ్యారు. 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో టచ్‌లోకి వచ్చినట్లు కనిపించినా అనూహ్యంగా విప్రజ్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయారు. ఈ సీజన్లో CSKపై డకౌట్, GTపై 8, KKRపై 13, RCBపై 17, DCపై 18 పరుగులు చేశారు. కాగా గత IPL సీజన్ నుంచి హిట్‌మ్యాన్ పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడని విషయం తెలిసిందే.
TG: సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన ఖరారైంది. ఈ నెల 16 నుంచి 22 వరకు సీఎం నేతృత్వంలోని ప్రతినిధి బృందం జపాన్‌లో పర్యటించనుంది. టోక్యో, మౌంట్ ఫుజి, ఒసాకా, హిరోషిమాలో పర్యటించి రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామిక సాంకేతిక సహకారంపై పారిశ్రామికవేత్తలతో చర్చలు జరపనుంది.
ఢిల్లీతో జరుగుతున్న మ్యాచులో ముంబై భారీ స్కోర్ నమోదు చేసింది. ఓవర్లన్నీ ఆడి 205/5 పరుగులు చేసింది. హైదరాబాదీ తిలక్ వర్మ మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగారు. 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 59 పరుగులు చేశారు. రికెల్టన్ (41), సూర్యకుమార్ (40), నమన్ (38) రాణించారు. విప్రజ్, కుల్దీప్ చెరో రెండు వికెట్లు తీశారు. ముకేశ్ ఓ వికెట్ పడగొట్టారు. ఢిల్లీ టార్గెట్ 206 పరుగులు.
తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను తిరిగి పార్టీలోకి చేర్చుకుంటున్నట్లు BSP అధినేత్రి మాయావతి ప్రకటించారు. ఆకాశ్ తన తప్పులను బహిరంగంగా ఒప్పుకున్నందుకు మరోసారి అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. తన వారసులుగా ఎవరినీ ప్రకటించడం లేదని స్పష్టం చేశారు. ఇవాళ ఆనంద్ X వేదికగా మాయావతికి క్షమాపణలు చెప్పారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని కొన్ని రోజుల క్రితం ఆయనను మాయావతి పార్టీ నుంచి బహిష్కరించారు.
AP: రాష్ట్రాన్ని డ్రోన్ రాజధానిగా తీర్చిదిద్దుతామని డ్రోన్ కార్పొరేషన్ తెలిపింది. డ్రోన్ల తయారీలో ప్రపంచంలోనే ఒక బలమైన శక్తిగా అవతరిస్తామని ఆశాభావం వ్యక్తం చేసింది. ‘ప్రజలు, పాలనకు ఉపయోగపడేలా డ్రోన్ సేవలు విస్తృతం చేస్తాం. ఓర్వకల్లులో 300 ఎకరాల విస్తీర్ణంలో డ్రోన్ సిటీ అభివృద్ధి చేస్తున్నాం. ఈ నెల 21లోగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి కొత్త యూజ్ కేసెస్‌ను ఆహ్వానిస్తున్నాం’ అని పేర్కొంది.
కొందరికి చికెన్ లేనిదే ముద్ద దిగదు. రోజూ చికెన్ తింటే ఆరోగ్యానికి ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చికెన్ ఎక్కువ మోతాదులో తింటే బీపీ, గుండె జబ్బులు వస్తాయి. కొవ్వు పేరుకుపోయి బరువు పెరుగుతారు. రక్తంలో టాక్సిన్లు నిల్వ ఉండి ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదముంది. యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగిపోయి చేతి, కాలి వేళ్లలో స్ఫటికాలు పేరుకుపోయి కీళ్ల నొప్పులు వస్తాయి. వారానికి ఒకటి రెండు సార్లు తినడం ఉత్తమం.
☛ మే 23న ప్రభాస్, త్రిష నటించిన ‘వర్షం’ సినిమా రీ రిలీజ్
☛ రేపు HYDలోని పార్క్ హయత్‌లో తమన్నా నటించిన ‘ఓదెల-2’ ప్రీ రిలీజ్ ఈవెంట్
☛ రూ.100 కోట్ల మార్కును దాటిన అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా కలెక్షన్స్
☛ మహేశ్ బాబు-రాజమౌళి సినిమాకు డైలాగ్ రైటర్‌గా దేవకట్టా?
☛ మూడు రోజుల్లో రూ.32.2 కోట్ల వసూళ్లు రాబట్టిన గోపీచంద్ మలినేని-సన్నీ డియోల్ సినిమా ‘జాట్’
AP: తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రకటించారు. ప్రజల హక్కులను కాపాడడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి పొంచి ఉన్న అతిపెద్ద ప్రమాదం YS జగన్ అని, గత ఐదేళ్లలో ఆయన రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారని అన్నారు. ఆయన వల్ల ఐదేళ్ల విలువైన సమయం కోల్పోయామని పేర్కొన్నారు.
AP: రేపు కోనసీమ జిల్లాలోని 7 మండలాలు, కాకినాడలో 3, తూర్పు గోదావరిలో ఒక మండలంలో తీవ్ర వడగాలులు వీస్తాయని, మరో 98 మండలాల్లో <
Sorry, no posts matched your criteria.