India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: రాష్ట్రంలో బెటాలియన్ పోలీసులు <<14458703>>ఆందోళనలకు<<>> దిగడంపై పోలీస్ శాఖ సీరియస్ అయినట్లు సమాచారం. నిరసనలు చేపట్టిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ఆందోళనల వెనుక ప్రభుత్వ వ్యతిరేక శక్తుల హస్తముందని ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. పోలీసులు ఆందోళన చేపట్టడం క్రమశిక్షణ ఉల్లంఘనేనని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించకూడదని భావిస్తున్నట్లు సమాచారం.
ఆస్ట్రేలియాతో జరగనున్న <<14454917>>టెస్టు సిరీస్‌కు<<>> తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డిని ఎంపిక చేయడం ఆశ్చర్యపరిచిందని మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే అన్నారు. అయితే అతని ఆల్‌రౌండర్ నైపుణ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చోటు కల్పించి ఉంటారని అభిప్రాయపడ్డారు. నితీశ్ వేగంగా బౌలింగ్ చేయడమే కాకుండా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తారని కొనియాడారు. ఈ కారణంతోనే 18 మందితో కూడిన జట్టులో చోటు దక్కించుకొని ఉంటారన్నారు.
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు పరోక్షంగా విమర్శలు చేశారు. ‘నాడు జగనన్న వదిలిన బాణం! నేడు చంద్రన్న వదిలిన బాణం! విధి విచిత్రమైనది’ అని ఆయన ట్వీట్ చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌ను విమర్శిస్తూ షర్మిల మూడు పేజీల బహిరంగ లేఖ రాయడంతో ఆయన చేసిన ట్వీట్ వైరలవుతోంది.
యూరోపియన్ చెస్ క్లబ్ కప్ లైవ్ రేటింగ్స్‌లో 2800 క్లబ్‌లోకి ప్రవేశించిన భారత చెస్ ప్లేయర్ అర్జున్ ఎరిగైసిని నెటిజన్లు అభినందిస్తున్నారు. ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ మార్కును దాటిన రెండవ భారతీయుడిగా ఆయన రికార్డులకెక్కారు. ప్రపంచంలోని 16 మంది మాత్రమే ఈ మార్క్‌ను టచ్ చేయగా 14 మంది ఆటగాళ్లు క్లబ్‌లో ఉన్నారు. అర్జున్ తెలంగాణలోని హనుమకొండకు చెందిన వ్యక్తి కావడం విశేషం.
AP: మంత్రి నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో ధరల నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్, పయ్యావుల కేశవ్ సభ్యులుగా ఉన్నారు. నిత్యావసరాలు, కూరగాయల ధరల పెరుగుదల, పంటల ఎగుమతులు, దిగుమతులపై అధ్యయనం చేయాలని ఈ కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. ధరల తగ్గింపునకు తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సులు చేయాలని సూచించింది.
అమెరికా రాజ్యాంగానికి మద్దతుగా తన ఆన్‌లైన్ పిటిషన్‌పై సంతకం చేసిన వ్యక్తికి ప్రతిరోజూ $1 మిలియన్ (సుమారు రూ. 8.40 కోట్లు) ఇస్తామని బిలియనీర్ ఎలాన్ మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా పిటిషన్‌పై సంతకం చేసిన నెవడాలోని పహ్రంప్‌కు చెందిన మేరీ 1 మిలియన్ డాలర్లు పొందారు. మేరీని అభినందిస్తూ ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. ఎన్నికల రోజు వరకు ప్రతిరోజూ సంతకం చేసిన ఒకరిని ఎంపిక చేసి ఈ బహుమతి ఇస్తారు.
బాలీవుడ్ సీనియర్ నటి రేఖ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు. అయితే, తన కెరీర్ తొలినాళ్లలో ఆమెకు ఓ చేదు అనుభవం ఎదురైంది. 1969లో బిస్వజిత్ ఛటర్జీ సినిమాలో 15 ఏళ్ల రేఖకు అవకాశం వచ్చింది. రొమాన్స్ సీన్ చిత్రీకరణ సమయంలో నటుడు ముద్దు పెట్టడంతో ఆమె షాక్‌కు గురయ్యారు. సెట్‌లో ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ది అన్‌టోల్డ్ స్టోరీలో రాసుకొచ్చారు.
దీపావళి సందర్భంగా ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించి సంబరాలు చేసుకుంటుంటారు. ఇంట్లో సుఖ సంతోషాలు, సిరి సంపదల కోసం దీపాలు వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు. అయితే, ప్రమిదలు సైతం స్టైల్‌గా ఉండాలని కొందరు సిరామిక్ వాటిని కొనుగోలు చేస్తుంటారు. కానీ, చాలా మంది చిరు వ్యాపారులు మట్టితో చేసిన ప్రమిదలను రోడ్డు పక్కన పెట్టి అమ్ముతుంటారు. అక్కడ కొని వారికి అండగా నిలవండి. వారి ఇంట్లోనూ పండుగను తీసుకురండి.
Share It
మహారాష్ట్ర కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై LOP రాహుల్ గాంధీ పెదవి విరిచారని తెలుస్తోంది. ఫేవరేటిజం కనిపిస్తోందని అసంతృప్తి చెందినట్టు సమాచారం. పార్టీ ఎలక్షన్ కమిటీ మీటింగులో ఆయన దీనిని హైలైట్ చేశారని ఇండియా టుడే తెలిపింది. కాంగ్రెస్ బలంగా ఉన్న కొన్ని సీట్లను శివసేన UBTకి ఎందుకు కేటాయించారని ప్రశ్నించినట్టు పేర్కొంది. పోటీ చేస్తున్న 85 సీట్లకు PCC 48 మందితో తొలి జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఒకేసారి బీచ్‌లో ఇసుకతో ఆడుకుంటూ మంచు కొండలను అనుభూతి చెందితే ఎంతో బాగుంటుంది కదా? ఇది ఊహకే పరిమితం అనుకుంటే పొరబడినట్లే. ఇలాంటి అద్భుతమైన బీచ్ జపాన్‌లో ఉంది. హక్కైడో ద్వీపంలో ఉన్న San’in Kaigan జియోపార్క్‌లో దీనిని చూడవచ్చు. 2008లో ఈ ప్రాంతాన్ని జపనీస్ జియోపార్క్‌గా, 2010లో UNESCO గ్లోబల్ జియోపార్క్‌గా ప్రకటించారు.
Sorry, no posts matched your criteria.