India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలకు రావాలని మెగాస్టార్ చిరంజీవిని కింగ్ నాగార్జున ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు దిగిన ఫొటోను చూసి మెగా, అక్కినేని ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరూ ఇంకా యవ్వనంలోనే ఉన్నారా అన్నట్లుగా కనిపిస్తున్నారని కొనియాడుతున్నారు. ఇటీవల విశ్వంభర టీజర్‌లోనూ మెగాస్టార్ పాత సినిమాల్లోని చిరులా ఉన్నారంటూ మెగాఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఉత్తరాఖండ్ సీనియర్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ ఎట్టకేలకు టీమ్ ఇండియాలో చోటు దక్కించుకున్నారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ఆయనను సెలక్ట్ చేశారు. 29 ఏళ్ల అభిమన్యు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అదరగొట్టారు. దులీప్ ట్రోఫీలో 2, ఇరానీ కప్‌లో 1, రంజీలో 1 చొప్పున వరుసగా 4 సెంచరీలు బాదారు. ఓవరాల్‌గా 12 వేలకుపైగా రన్స్ సాధించారు. ఇందులో 37 సెంచరీలు ఉన్నాయి. గతంలో స్టాండ్‌బైగా ఎంపికైనా జట్టులో చోటు దక్కించుకోలేదు.
ఇటీవల చోటుచేసుకున్న రైలు ప్రమాదాల వెనుక ఎలాంటి విద్రోహ కుట్ర లేదని NIA విచారణలో తేలింది! 6 రైలు ప్రమాదాలపై జరిపిన ప్రాథమిక దర్యాప్తులో కుట్ర కోణంపై ఆధారాలు లభించలేదని ఓ అధికారి తెలిపారు. అయినా ఈ ఘటనలపై విచారణ యాక్టివ్ స్టేట్‌లోనే ఉన్నట్టు వెల్లడించారు. రైలు పట్టాలపై ఇటీవల ఆగంతకులు సిమెంట్ దిమ్మెలు, గ్యాస్ సిలిండర్లు పెడుతుండడంపై రైల్వే, భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.
AP: పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని ‘సరస్వతి పవర్’ భూములకు సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. అసలు ఆ భూములకు పర్యావరణ అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఆ భూముల్లో అటవీ భూమి ఎంత ఉంది, వాటిలో జల వనరులు ఏమైనా ఉన్నాయా అని ఆయన ఆరా తీశారు. సరస్వతి పవర్ భూములపై త్వరలో సమీక్షిస్తానని చెప్పారు.
ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ సెమీ ఫైనల్‌లో అఫ్గాన్-ఏ చేతిలో భారత్-ఏ పరాజయం పాలైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న అఫ్గాన్ 206 రన్స్ చేసింది. సెదీకుల్లా(83), జుబైద్(64) రాణించారు. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్-ఏ 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. రమణ్ దీప్ సింగ్(64) ఒంటరి పోరాటం చేసినా ఫలితం దక్కలేదు. అఫ్గాన్ బౌలర్లలో ఘజన్‌ఫర్, రహమాన్ చెరో 2 వికెట్లు తీశారు.
సినీతారలకు సంబంధించిన కొన్ని సంగతులు ఆసక్తిగా ఉంటాయి. సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో దివంగత నటి శ్రీదేవికి మంచి స్నేహం ఉంది. 2011లో రజినీ తీవ్ర అనారోగ్యానికి గురై సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. రజినీ కోలుకోవాలని మొక్కుకున్న శ్రీదేవి వారం పాటు ఉపవాసం చేశారు. ఆయన కోలుకున్నాక పుణేలోని బాబా ఆలయాన్ని దర్శించుకున్నారు. వారిద్దరూ కలిసి 18 సినిమాల్లో నటించడం విశేషం.
నవంబర్ 8 నుంచి సౌతాఫ్రికాతో జరగనున్న టీ20 సిరీస్‌కు 15 మంది సభ్యులు గల భారత జట్టును BCCI ప్రకటించింది. నవంబర్ 8, 10, 13, 15 తేదీల్లో సౌతాఫ్రికాలో మ్యాచ్‌లు జరగనున్నాయి.
జట్టు: సూర్య(కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, రింకూసింగ్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, హార్దిక్, అక్షర్, రమణ్‌దీప్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్, విజయ్‌కుమార్ వైశాక్, అవేశ్ ఖాన్, యశ్ దయాల్
ఆస్ట్రేలియాతో జరగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి 18 మందితో స్క్వాడ్‌ను BCCI ప్రకటించింది. జట్టులోకి వస్తాడనుకున్న షమీకి చోటు దక్కలేదు. నితీశ్ కుమార్ రెడ్డి, అభిమన్యు ఈశ్వరన్ ఛాన్స్ కొట్టేశారు.
జట్టు: రోహిత్(కెప్టెన్), బుమ్రా(VC), జైస్వాల్, అభిమన్యు, రాహుల్, కోహ్లీ, పంత్, సర్ఫరాజ్, గిల్, జురెల్, అశ్విన్, జడేజా, సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్, వాషింగ్టన్ సుందర్.
AP: జైలులో ఉన్న సమయంలో తనతో పవన్ కళ్యాణ్ ములాఖత్ అయినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఆ పరిస్థితుల్లో తాను ధైర్యంగానే ఉన్నానని, పవన్‌ను ధైర్యంగా ఉండాలని చెప్పినట్లు అన్‌స్టాపబుల్ షోలో పేర్కొన్నారు. కూటమి పొత్తు ప్రతిపాదన తానే తీసుకొచ్చినట్లు వెల్లడించారు. వెంటనే పవన్ ఆలోచించి ఓకే చెప్పారన్నారు. ఆ తర్వాత పవన్ కూటమి ప్రకటన చేసినట్లు గుర్తు చేశారు. అదే విజయానికి నాంది అని అన్నారు.
TG: కొమురంభీం ఆసిఫాబాద్‌కు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత, గుస్సాడీ నృత్య కళాకారుడు కనకరాజు(70) మరణించారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. రేపు మధ్యాహ్నం కనకరాజు స్వగ్రామం మార్లవాయిలో అంత్యక్రియలు చేయనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 55 ఏళ్ల పాటు గుస్సాడీ నృత్యాన్ని ఆయన ప్రదర్శించారు. ఆయన సేవలను గుర్తించి 2021లో కేంద్రం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
Sorry, no posts matched your criteria.