India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
MLC ఎన్నికల్లో ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూల్ టీచర్లకు ఓటు హక్కు కల్పించలేదని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ స్పష్టం చేశారు. ఓటు అర్హతపై గత నిబంధనలే కొనసాగుతాయని ఆయన ప్రకటించారు. ఈ మేరకు DEOలకు వెల్లడించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు మెట్ల మార్గంలో వెళ్తున్న భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది. 60 ఏళ్లు దాటిన వృద్ధులు, షుగర్, హై BP, గుండె సంబంధిత వ్యాధులు, ఉబ్బసం వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు నడక దారిన రావడం మంచిది కాదని తెలిపింది. తిరుమల కొండ చాలా ఎత్తులో ఉండటంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తిరుమలలో 24 గంటలూ వైద్య సదుపాయం అందుబాటులో ఉంటుందని, భక్తులు సహకరించాలని కోరింది.
టీమ్ ఇండియా ఓపెనర్ యశస్వీ జైస్వాల్ అరుదైన రికార్డు నెలకొల్పారు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో టెస్టుల్లో 1,000 పరుగులు పూర్తి చేసుకున్న యంగెస్ట్ ఇండియన్ బ్యాటర్‌గా జైస్వాల్ (22 ఏళ్లు) చరిత్ర సృష్టించారు. కివీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆయన ఈ ఫీట్ సాధించారు. గతంలో ఈ రికార్డు దిలీప్ వెంగ్‌సర్కార్ (23 ఏళ్లు, 1979) పేరిట ఉండేది. 45 ఏళ్ల తర్వాత దిలీప్ రికార్డును జైస్వాల్ బద్దలు కొట్టారు.
TG: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దద్దమ్మ పాలనలో రాష్ట్రం ధర్నాలతో దద్దరిల్లుతోందని మండిపడ్డారు. మూలకున్న ముసలవ్వ నుంచి బడిపిల్లల దాకా అన్ని వర్గాల వారు నిరసనలు చేస్తున్నారని పేర్కొన్నారు. అంతా కాంగ్రెస్ పాలన వద్దని నినదిస్తున్నారని ట్విటర్(X)లో రాసుకొచ్చారు.
భారీ అంచనాలతో రూపొందించిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేక భారీ నష్టాలను మిగిలిస్తుంటాయి. అలాంటి కోవకు చెందిన చిత్రమే ‘ది లేడీ కిల్లర్’. బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్ జంటగా రూ.45 కోట్ల బడ్జెట్‌తో అజయ్ బాల్ ఈ సినిమాను తెరకెక్కించారు. గతేడాది నవంబర్‌లో ‘ది లేడీ కిల్లర్’ రిలీజవగా భారత సినీ చరిత్రలో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. ఇది కేవలం రూ.50వేలు మాత్రమే రాబట్టగలిగింది.
కేరళలో తొలిసారి GST అధికారులు కమాండో తరహా ఆపరేషన్‌తో 108 కేజీల అక్రమ బంగారం సీజ్ చేశారు. KLలోని 700 మంది ఆఫీసర్లను సరదా ట్రిప్ అని గోల్డ్ హబ్ త్రిస్సూర్‌లో ఓ రిసార్టుకు పిలిచారు. అంతా చేరాక ఆపరేషన్ ‘గోల్డ్ టవర్’ గురించి చెప్పి దాడులకు పంపారు. ఈ హఠాత్ పరిణామంతో కొన్ని షాపుల సిబ్బంది పసిడితో పారిపోతుంటే వెంబడించి పట్టుకున్నారు. KLలో బంగారం అమ్మకాల గణాంకాలు, పన్ను చెల్లింపుల మధ్య భారీ తేడా ఉంది.
ఎఫ్ఐఐల వరుస అమ్మకాల నేపథ్యంలో దేశీయ ఇన్వెస్టర్ల బై ఆన్ డిప్ స్ట్రాటజీ వర్కౌట్ కాకపోవడంతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. శుక్రవారం సెన్సెక్స్ 662 పాయింట్ల నష్టంతో 79,402 వద్ద, నిఫ్టీ 218 పాయింట్లు కోల్పోయి 24,180 వద్ద స్థిరపడ్డాయి. ITC 2.24%, Axis Bank 1.85%, BEL 1.55% లాభపడ్డాయి. IndusIndBK 19%, Adani Ent 5%, BPCL 5% మేర నష్టపోయాయి.
కెనడాలోని టొరంటోలో టెస్లా కారు డివైడర్‌ను ఢీకొన్న ప్రమాదంలో గుజరాత్‌కు చెందిన నలుగురు మృతి చెందారు. గుజరాత్‌లోని గోద్రాకు చెందిన తోబుట్టువులు కెటా గోహిల్(30), నిల్ గోహిల్(26) సహా మరో ముగ్గురు వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొంది. దీంతో కారు బ్యాటరీ నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరిని అటుగా వెళ్తున్న వ్యక్తి రక్షించారు.
TG: మూసీ సుందరీకరణ పేరుతో పేదలను ఇబ్బందులకు గురిచేస్తే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మూసీ పరీవాహకంలో ఇళ్లు కూల్చవద్దని చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. నగరంలో కనీస మౌలిక వసతులు లేవన్నారు. గత పాలకులు గులాబీ రంగుల్లో గ్రాఫిక్స్ చూపించారని విమర్శించారు. కేసీఆర్ మాదిరే రేవంత్ రెడ్డి పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు.
రతన్ టాటా తన రూ.10వేల కోట్లకు రాసిన వీలునామా తాజాగా వెలుగుచూసింది. స్వచ్ఛంద సంస్థ ది రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్(RTEF)కి ప్రధాన వాటా దక్కిందని టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇక తన సోదరుడు జిమ్మీ టాటా, చెల్లెళ్లు షిరీన్, డియానా, వంటమనిషి రజన్ షా, పనిమనిషి సుబ్బయ్య, స్నేహితుడు శంతను నాయుడుకి టాటా ఆస్తిలో వాటాలు దక్కనున్నాయి. తన శునకం టిటో బాధ్యతను రజన్ షాకే రతన్ అప్పగించినట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.