India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఢిల్లీలో వాయు కాలుష్యం కారణంగా తాను మార్నింగ్ వాక్‌కు వెళ్లడం మానేసినట్లు సీజేఐ చంద్రచూడ్ తెలిపారు. గాలి నాణ్యత క్షీణించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్ సూచన మేరకు మార్నింగ్ వాక్‌కు వెళ్లట్లేదని, దీని వల్ల శ్వాసకోశ వ్యాధులకు దూరంగా ఉండొచ్చని అన్నారు. ఢిల్లీలో ఇవాళ ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 283గా నమోదైంది. కాలుష్యం పెరగడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతోందని స్థానికులు చెబుతున్నారు.
న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో భారత్ వేసిన ‘స్పిన్’ ప్లాన్ బెడిసికొడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు కివీస్ స్పిన్నర్ల ఉచ్చులో చిక్కుకున్నారు. శాంట్నర్(7), ఫిలిప్స్(2) ధాటికి కుదేలైన భారత్ 156 రన్స్ మాత్రమే చేసి ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 103 పరుగులు వెనుకబడి ఉంది. ప్రత్యేకంగా రూపొందించిన ఈ స్పిన్ పిచ్‌లో భారత్ తరఫున సుందర్(7), అశ్విన్(3) వికెట్లు తీసిన విషయం తెలిసిందే.
TG: మూసీ పరివాహక ప్రాంతంలో నివాసం ఉండాలని సీఎం రేవంత్ విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. HYD ధర్నా చౌక్ వద్ద BJP చేపట్టిన ధర్నాలో పాల్గొని మాట్లాడారు. ‘పేదల కోసం మూసీ పరీవాహకంలో ఉండటానికైనా మేము సిద్ధం. ఇళ్లను కూల్చాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలి. ఇక్కడ ఉండలేకపోతున్నామని పేదలు ఎవరైనా చెప్పారా? వారి బాధలు సీఎంకు తెలుసా?’ అని వ్యాఖ్యానించారు.
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కు తగినట్టే ఉన్నాడు తమ్ముడు అన్మోల్. వ్యవస్థీకృత నేరాలు చేయడంలో అతడిదీ అందెవేసిన చెయ్యే! ముంబైలో పొలిటికల్ పార్టీ యాక్టివిటీస్‌లో అతడు జోక్యం చేసుకుంటున్నట్టు NIA గమనించింది. అతడి సమాచారమిస్తే రూ.10 లక్షల బౌంటీ ఇస్తామని ప్రకటించింది. 2022లో 2 ఛార్జిషీట్లలో NIA అతడి పేరు నమోదు చేసింది. యాక్టర్ సల్మాన్ ఇంటిపై కాల్పుల కేసులో అన్మోల్ మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు.
బంగారం, వజ్రాలు వంటి ఖనిజాలు ఖరీదైనవని అనుకుంటాం. కానీ, ప్రపంచంలో ఎవ్వరూ కొనలేని మెటీరియల్ ఒకటి ఉంది. అదే యాంటీమ్యాటర్. భౌతిక శాస్త్రంలో యాంటీమ్యాటర్ అనేది పదార్థానికి వ్యతిరేకమైనదని నిర్వచించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థే సుమారు $100 ట్రిలియన్లు అయితే దీని 1gm ధర దాదాపు $62.5 ట్రిలియన్లు (రూ.5వేల బిలియన్లు). ఇది భూమి మీద లభించదని, దీనిని రవాణా చేయడమూ ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు.
TG: విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తెలిపారు. సిరిసిల్లలో జరిగిన విద్యుత్ మండలి బహిరంగ విచారణలో ఆయన మాట్లాడారు. ‘అన్ని సంస్థలను ఒకే కేటగిరీగా మార్చాలన్న ప్రతిపాదన సరైనది కాదు. ఛార్జీల పెంపుతో చిన్న పరిశ్రమలపై భారం పడుతుంది. అన్ని ఇండస్ట్రీలను కాపాడుకుంటేనే మనుగడ ఉంటుంది. చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రాయితీలు ఎక్కడ?’ అని ప్రశ్నించారు.
TG: మంత్రి కొండా సురేఖకు HYD సిటీ సివిల్ కోర్టు చివాట్లు పెట్టింది. KTR వేసిన <<14421276>>పరువునష్టం దావా<<>>ను కోర్టు విచారించింది. బాధ్యత గల పదవిలో ఉండి ఆ వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ మందలించింది. ఒక ప్రభుత్వ ప్రతినిధి నుంచి ఇలాంటి మాటలు రావడం తీవ్ర అభ్యంతరకరం, అనూహ్యమని పేర్కొంది. మరోసారి KTRపై అలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించింది. తన వ్యాఖ్యలకు సంబంధించి పోస్టులను సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఆదేశించింది.
న్యూజిలాండ్‌తో 2వ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో లంచ్ సమయానికి 107 రన్స్ మాత్రమే చేసి 7 కీలక వికెట్లు కోల్పోయింది. జైస్వాల్(30), గిల్(30) మాత్రమే ఫర్వాలేదనిపించారు. రోహిత్(0), కోహ్లీ(1), పంత్(18), సర్ఫరాజ్(11), అశ్విన్(4) నిరాశపరిచారు. క్రీజులో జడేజా(11), సుందర్(2) ఉండగా భారత్ ఇంకా 152 రన్స్ వెనుకబడి ఉంది. శాంట్నర్ 4, ఫిలిప్స్ 2 వికెట్లు తీశారు.
అక్కినేని నాగేశ్వర్‌రావు శత జయంతిని ఘనంగా నిర్వహించేందుకు నాగార్జున సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే ANR అవార్డ్స్-2024 ప్రదానోత్సవ కార్యక్రమానికి ఇద్దరు మెగాస్టార్లు రానున్నారు. బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ నుంచి చిరంజీవి ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. వారిద్దరినీ ఆహ్వానించినట్లు నాగార్జున ప్రకటించారు. కార్యక్రమం ఈనెల 28న జరగనుంది. ANR నేషనల్ అవార్డు చిరు అందుకోనున్నారు.
AP: పేద ప్రజల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ‘ఎన్టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) కింద నెట్‌వర్క్ ఆసుపత్రులకు మాజీ సీఎం జగన్ పెట్టిన రూ.2500కోట్ల బకాయిలలో మరో రూ.300 కోట్లు ఇవాళ చెల్లించాం. రాష్ట్రం అప్పుల నుంచి అభివృద్ధి వైపు, సంక్షోభం నుంచి సంక్షేమం దిశగా పయనిస్తోంది’ అని ట్వీట్ చేశారు.
Sorry, no posts matched your criteria.