India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: 2018లో విశాఖలో YS జగన్‌పై దాడికి ఆరేళ్లు పూర్తయ్యాయని TDP ట్వీట్ చేసింది. ‘హ్యాపీ “కోడి కత్తి డే” జగన్. 6 ఏళ్ల క్రితం తమరు ఇచ్చిన పర్ఫార్మెన్స్, నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్. తల్లి, చెల్లి మీద కోర్టుకి వెళ్లడం కాదు. ఈ కేసులో కోర్టుకి వచ్చి సాక్ష్యం చెప్పి దళిత యువకుడి జీవితం నిలబెట్టు’ అని సెటైర్లు వేసింది. కోడికత్తి లాంటి ఆయుధంతో దాడి చేసినా నేరం కాదని TDP ప్రకటించిందంటూ దీనికి YCP బదులిచ్చింది.
AP: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని దళిత మహాసభ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కత్తి పద్మారావు సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. 6వ తరగతి నుంచి ఎం.ఏ చివరి వరకు పుస్తకాల్లో చేర్చాలని కోరారు. డిసెంబర్ 6 నాటికి అంబేడ్కర్ 69వ వర్ధంతి, 2025 ఏప్రిల్ 14 నాటికి 133వ జయంతిని పురస్కరించుకుని వీటిపై ప్రకటన చేయాలని సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
AP: శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద 6 వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర రహదారి, రవాణాశాఖ రూ.252.42 కోట్లు మంజూరు చేసింది. ఆ మార్గంలో నెలకొన్న ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించడానికి ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఆ ప్రాంత వాసుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అన్నారు. దీనిపై విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు హర్షం వ్యక్తం చేశారు.
దేశంలోని చాలా రాష్ట్రాల్లో హిందీ భాష వినియోగంలో ఉంది. ఓ నివేదిక ప్రకారం దాదాపు 52.82 కోట్ల మంది హిందీ మాట్లాడతారు. బెంగాలీని 9.72కోట్ల మంది మాట్లాడితే 8.30 కోట్ల మంది మరాఠీలో సంభాషిస్తారు. ఇక 8.11 కోట్ల మంది తెలుగు, 6.90 కోట్ల మంది తమిళం మాట్లాడుతున్నారు. 5.54 కోట్ల మంది గుజరాతీ, 5.07 కోట్ల మంది ఉర్దూ, కన్నడ భాషను 4.37 కోట్లు, 3.75 కోట్ల మంది ఒడియా, మలయాళం మాట్లాడేవారు 3.48 కోట్ల మంది ఉన్నారు.
AP: ఇవాళ్టి నుంచి నవంబర్ 1 వరకు మంత్రి లోకేశ్ అమెరికాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా జార్జియా ఐటీ సర్వ్ సినర్జీ సదస్సులో ఆయన ప్రసంగిస్తారు. పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చిస్తారు. శాన్ఫ్రాన్సిస్కోలో రేపు ఒరాకిల్ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు.
TG: ‘హైడ్రా’కు 100 రోజులు పూర్తవడంతో ప్రభుత్వంపై BRS విమర్శలు గుప్పించింది. ‘రేవంత్ సర్కార్ హైడ్రా పేరుతో పేదల జీవితాలను రోడ్డుకీడ్చింది. వెయ్యెలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు చేసినట్టు కబ్జాలు ప్రోత్సహించిన కాంగ్రెస్ పరిరక్షణ పేరుతో డ్రామాలాడుతోంది. పేదలకు నోటీసులు ఇవ్వకుండా కూలగొట్టేందుకు మనసెలా వచ్చింది? అనుముల తిరుపతిరెడ్డి ఇంటి ఒక్క ఇటుకనైనా ఎందుకు ముట్టలేకపోయింది?’ అని ప్రశ్నించింది.
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత ప్లేయర్ వాషింగ్టన్ సుందర్ 7/59తో అదరగొట్టిన విషయం తెలిసిందే. అయితే నాలుగు దశాబ్దాల్లో మొత్తం నలుగురు ప్లేయర్లే ఈ ఘనత సాధించారు. 1994లో అనిల్ కుంబ్లే, 2005లో ఇర్ఫాన్ పఠాన్, 2016లో అశ్విన్, 2024లో సుందర్ 7 వికెట్లు తీశారు. ఇందులో ప్రతిఒక్కరూ 7 వికెట్లు తీసి 59 పరుగులు సమర్పించారు. భారత్ అత్యధిక టెస్టు స్కోరు కూడా 759 పరుగులే.
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ మధుమేహానికి దారి తీస్తోందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తేల్చింది. సమోసా, పకోడి, ఫ్రైడ్ చికెన్, చిప్స్, కేక్స్, ఫాస్ట్ ఫుడ్స్ రక్తంలో చక్కెర స్థాయులను పెంచుతున్నట్లు నిర్ధారించింది. ఇవి శరీరంలో హానికరమైన అడ్వాన్స్డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్‌గా మారి ఇన్సులిన్ నిరోధకతను దెబ్బతీస్తున్నాయి. దీంతో టైప్-2 మధుమేహం, ఊబకాయానికి దారితీస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు.
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌పై విధించిన జీవితకాల కెప్టెన్సీ నిషేధం తొలిగిపోయింది. 2018లో శాండ్ పేపర్ వివాదంలో అతడిని కెప్టెన్సీ నుంచి ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు బ్యాన్ చేసింది. తాజాగా ఆ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్ BBLలో సిడ్నీ థండర్‌కు కెప్టెన్‌గా ఉండే అవకాశం లభించింది.
TG: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలల ఆధ్వర్యంలో మహా పాదయాత్రకు దళితులు సిద్ధం అవుతున్నారు. భద్రాచలం నుంచి హైదరాబాద్ వరకు సాగే పాదయాత్రను మాజీ ఎంపీ హర్షకుమార్ ఇవాళ ప్రారంభిస్తారు. 38 రోజుల పాటు 16 జిల్లాలు, 35 నియోజకవర్గాల మీదుగా 1000కి.మీ మేర ఈ పాదయాత్ర సాగనుంది. డిసెంబర్ 1న ముగింపు సందర్భంగా హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహణకు ప్రణాళికలు రచిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.