India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: దీపావళి బోనస్‌ను ఈరోజు సింగరేణి కార్మికుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. ఒక్కో కార్మికుడికి ₹93,750 అందనుంది. మొత్తంగా ₹358Cr విడుదల చేయాలని సింగరేణిని ఆదేశించింది. ఈ బోనస్ సింగరేణిలో పనిచేస్తున్న 40వేల మందికి అందనుంది. ఇటీవల సంస్థ పొందిన లాభాల్లో 33% వాటా పంచగా ఒక్కో కార్మికుడికి ₹1.90లక్షలు అందాయి. పండుగ అడ్వాన్స్ కింద మరో ₹25వేలు అందాయి. మొత్తంగా ఒక్కొక్కరికి ₹3లక్షల ప్రయోజనం అందింది.
AP: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును రూ.26వేల కోట్లతో 189కి.మీ మేర నిర్మించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నిన్న సీఎంతో NHAI అధికారుల భేటీలో ORRతో పాటు కుప్పం-హోసూర్-బెంగళూరు రోడ్డును రూ.300 కోట్లతో 56కి.మీ మేర, మూలపేట-విశాఖ గ్రీన్‌ఫీల్డ్ రోడ్డును రూ.8300 కోట్లతో 165కి.మీ మేర, హైదరాబాద్-విజయవాడ మధ్య రూ.8వేల కోట్లతో 6/8 వరుసలతో 226కి.మీ మేర నిర్మించే అంశాలపై చర్చించారు.
TG: ఆటో కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ నవంబర్ 5న ‘ఛలో హైదరాబాద్’ మహాధర్నాకు తెలంగాణ ప్రోగ్రెసివ్ ఆటో మోటార్ వర్కర్స్ యూనియన్ పిలుపునిచ్చింది. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని యూనియర్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ డిమాండ్ చేశారు. కార్మికులకు ఇస్తామన్న రూ.12 వేలు హామీని అమలు చేయాలని కోరారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దానా’ తీవ్ర తుఫాన్‌గా మారింది. వాయవ్య దిశగా గంటకు 13కి.మీ వేగంతో కదులుతూ పారాదీప్‌కు ఆగ్నేయంగా 80కి.మీ దూరంలో ఉంది. ఇవాళ ఉదయం తీరం దాటుతుందని అధికారులు అంచనా వేశారు. ఏపీపై దీని ప్రభావం లేకపోయినా శ్రీకాకుళం జిల్లాలో ఇవాళ మోస్తరు వర్షాలు పడనున్నాయి. రేపటి నుంచి ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
TG: ఉపాధ్యాయ నియోజకవర్గ MLC ఎన్నికల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులకు ఓటు హక్కు కల్పిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల జాబితాలో వాళ్లు పేరు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులను ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. కాగా ఇప్పటివరకు హైస్కూల్‌లో బోధించే స్కూల్ అసిస్టెంట్లకు మాత్రమే ఈ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉండేది.
TG: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పారామెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీకి పారామెడికల్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. విద్యార్థులు ఈ నెల 30వ తేదీలోపు తమ దరఖాస్తులను డీఎంహెచ్‌వో కార్యాలయాల్లో అందించాలని తెలిపింది. జిల్లాల వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియ నవంబర్ 13లోపు పూర్తి చేస్తామని, 20వ తేదీలోగా ఎంపికైన వారి జాబితా విడుదల చేస్తామంది. పూర్తి వివరాలకు TGPMB వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపింది.
TG: నల్లమల అటవీ ప్రాంత అందాలను చూసేలా లాంచీ ప్రయాణానికి పర్యాటక శాఖ శ్రీకారం చుట్టింది. ఈ నెల 26 నుంచి నాగర్ కర్నూలు(D) సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ సేవలను అందుబాటులోకి తేనుంది. కొల్హాపూర్(M) సోమశిల తీరంలో 120 మంది ప్రయాణించేలా ఏసీ లాంచీని అధికారులు ఏర్పాటు చేశారు. నల్లమల అందాలను తిలకిస్తూ ఏడు గంటల పాటు ప్రయాణం ఉంటుంది. టికెట్ ధర పెద్దలకు రూ.2వేలు, పిల్లలకు రూ.1600గా నిర్ణయించారు.
ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ ఎన్టీపీసీ APR-SEP త్రైమాసికంలో రూ.5,380.25 కోట్ల లాభాలను ఆర్జించింది. 2023-24లో ఇది రూ.4,726 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయంలో గతేడాదితో పోలిస్తే తగ్గుదల నమోదైంది. రూ.45,384.64 కోట్ల నుంచి రూ.45,197.77 కోట్లకు తగ్గింది. స్థూల విద్యుదుత్పత్తి 90.30 బిలియన్ యూనిట్ల నుంచి 88.46 బి.యూనిట్లకు తగ్గగా, క్యాప్టివ్ గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి 5.09 MMT నుంచి 9.03 ఎంఎంటీకి పెరిగింది.
TG: కేంద్ర టెక్స్‌టైల్, స్కిల్ డెవలప్‌మెంట్ మంత్రిత్వ శాఖలు ఏర్పాటు చేసిన సంప్రదింపుల కమిటీల్లో తెలంగాణకు చెందిన ముగ్గురు ఎంపీలకు చోటు దక్కింది. 14 మంది సభ్యులతో ఏర్పాటైన టెక్స్‌టైల్ శాఖ సంప్రదింపుల కమిటీలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సభ్యులుగా నియమితులయ్యారు. స్కిల్ డెవలప్‌మెంట్‌కు చెందిన కమిటీలో ఎంపీలు మల్లు రవి, కడియం కావ్యలకు అవకాశం దక్కింది. ఈ కమిటీ 16 మందితో ఏర్పాటైంది.
AP: అమరావతిలో నిర్మాణ పనులకు నవంబర్, డిసెంబర్‌లో టెండర్లు పిలుస్తామని మంత్రి నారాయణ తెలిపారు. రోడ్లు, లేఅవుట్లు, కొండవీటి, పాలవాగు, కెనాల్స్, కరకట్ట రోడ్లకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. సచివాలయ భవనాల నిర్మాణాలకు డిసెంబర్‌లో, అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలకు వచ్చే ఏడాది JAN నెలాఖరులో టెండర్లు ఖరారు చేస్తామన్నారు. అమరావతి రైల్వే లైన్‌కు కేంద్రం ఆమోదం తెలపడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.