India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఐపీఎల్‌లో ముంబైతో జరుగుతున్న మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
MI: రోహిత్, రికెల్‌టన్, జాక్స్, సూర్య, తిలక్, హార్దిక్ (C), నమన్, శాంట్నర్, చాహర్, బౌల్ట్, బుమ్రా.
DC: మెక్‌గుర్క్, పోరెల్, కేఎల్ రాహుల్, స్టబ్స్, అక్షర్ (C), అశుతోశ్, విప్రజ్, స్టార్క్, మోహిత్, కుల్దీప్, ముకేశ్.
పరస్పర సుంకాలను పూర్తిగా రద్దు చేయాలని అమెరికాను చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ కోరింది. ట్రంప్ తాను చేసిన తప్పును సరిదిద్దుకోవాలని సూచించింది. ఫోన్లు, కంప్యూటర్లు, చిప్‌లను టారిఫ్స్ నుంచి మినహాయిస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం చాలా చిన్నది అని తెలిపింది. తమ దేశంపై 145% సుంకం విధించడాన్ని తప్పుబట్టింది. ‘పులి మెడలోని గంటను దానిని కట్టిన వ్యక్తి మాత్రమే విప్పగలడు’ అని పేర్కొంది.
వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తమిళ సినీ నటుడు, TVK పార్టీ అధినేత విజయ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ చట్టం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అని, దీనిని వెనక్కి తీసుకోవాలని ఆయన ఇప్పటికే డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ చట్టానికి రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ ఇప్పటివరకు సుప్రీంకోర్టులో 10 పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై ఈనెల 16న ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
TGPSC తనకు పరువునష్టం నోటీసులు <<16075233>>పంపడంపై <<>>BRS నేత రాకేశ్ రెడ్డి స్పందించారు. ‘పూర్తి ఆధారాలతో గ్రూప్-1 అవకతవకలు బయటపెట్టాం. వాటికి TGPSC సమాధానం చెప్పట్లేదు. కమిషన్ ఇలా పరువునష్టం నోటీసులు ఇవ్వడం దేశంలోనే ప్రథమం. నోటీసులు ఇచ్చినా నేను క్షమాపణలు చెప్పను. న్యాయవిచారణ జరిపిస్తే ఆధారాలు చూపిస్తాం. నేనే TGPSCపై పరువునష్టం దావా వేయబోతున్నా. అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం’ అని స్పష్టం చేశారు.
ఉక్రెయిన్‌లోని సుమీ నగరంపై రష్యా సైన్యం బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 31 మంది మరణించినట్లు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారని, 84 మందికి పైగా గాయపడ్డారని తెలిపారు. ప్రపంచ దేశాలు మౌనంగా ఉండకుండా రష్యా దాడులను ఖండించాలని ఆయన కోరారు. రష్యాపై బలమైన ఒత్తిడి తీసుకురాకపోతే ఈ యుద్ధాన్ని ఇలాగే కొనసాగిస్తుందని అన్నారు.
బాలీవుడ్ నటి మౌనీ రాయ్ అందంపై సోషల్ మీడియాలో నెటిజన్లు కొద్ది రోజులుగా ట్రోల్ చేస్తున్నారు. సర్జరీ షాప్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. దీనిపై ఓ ఈవెంట్‌లో మౌనీ స్పందించారు. ‘ట్రోల్స్‌ను పెద్దగా పట్టించుకోను. వారు నాకు కనబడరు కాబట్టి వాళ్ల మాటలకు బాధపడాల్సిన అవసరం లేదు. ఇతరులను ట్రోల్ చేస్తూ సంతోషం పొందేవారిని మనం మార్చలేం’ అని కౌంటరిచ్చారు. ప్రస్తుతం ఆమె ‘ది భూత్నీ’ మూవీలో నటిస్తున్నారు.
AP: తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి టోకెన్ల తొక్కిసలాటపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. ఈ తొక్కిసలాట వెనుక వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి, హరినాథ్ రెడ్డిల హస్తం ఉన్నట్లు ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ‘గోవుల మృతిపై భూమన మార్ఫింగ్ ఫొటోలతో దుష్ప్రచారం చేశారు. భూమనకు ఈ ఫొటోలను గోశాల మాజీ డైరెక్టర్ హరినాథ్ రెడ్డి ఇచ్చారు. ఈ విషయంలో భూమనపై క్రిమినల్ కేసు పెడతాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.
TG: కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం పేరిట 40 శాతం నూకలే పంపిణీ చేస్తోందని BRS MLA హరీశ్ రావు ఆరోపించారు. సన్నబియ్యం పేరుతో మోసం చేస్తున్నారని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో గురుకులాలకు నూకలు లేని సన్నబియ్యం ఇచ్చామని తెలిపారు. అర్హులైన వారందరికీ సన్నబియ్యం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధ్వానంగా మారిందని, జాకీలు పెట్టి లేపినా లేచే స్థితిలో లేదని ఎద్దేవా చేశారు.
AP: రాష్ట్రంలో రాబోయే 3 గంటల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం కురుస్తుందని APSDMA తెలిపింది. కోనసీమ, అనకాపల్లి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో వర్షం కురుస్తుందని అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని పేర్కొంది.
AP: కైలాసపట్నం అగ్నిప్రమాదంపై Dy.CM పవన్, మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని, బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్నారు. ‘ఇటీవల అల్లూరి జిల్లా పర్యటనకు వెళ్లినప్పుడు విశాఖ పరిశ్రమల్లో తీసుకోవాల్సిన భద్రతపరమైన జాగ్రత్తల గురించి చర్చించాలనుకున్నా. కానీ అత్యవసరంగా సింగపూర్ వెళ్లాల్సి వచ్చింది. తదుపరి విశాఖ పర్యటనలో దీనిపై దృష్టిపెడతా’ అని పవన్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.